ఇలయదలపతి విజయ్ బర్త్ డే స్పెషల్; అతడు ఉపయోగించే లగ్జరీ కార్స్

దక్షిణ భారత సినీ పరిశ్రమలో పేరుమోసిన హీరోలలో ఒకరు తమిళ నటుడు ఇలయదలపతి విజయ్. విజయ్ కేవలం తమిళ భాషలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా చాలా సినిమాలలో నటించి ఎక్కువమంది అభిమానుల మనసు దోచుకున్నారు. నటుడు విజయ్ కి తమిళం, తెలుగుతో పాటు కర్ణాటకలో కూడా ఎక్కువమంది అభిమానులు ఉన్నారు.

ఇలయదలపతి విజయ్ ఉపయోగించే లగ్జరీ కార్స్

ఇటీవల 'ఇలయదలపతి విజయ్' నటించిన 'మాస్టర్' సినిమా విడుదలై చాలా బాగా ముందుకు వెళ్తోంది. దక్షిణ భారతదేశంలో భారీ అభిమానులు ఉన్న నటులలో ఒకరు విజయ్ అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటి వరకు విజయ్ యొక్క సినిమా జావితం గురించి మాత్రమే తెలుసు, కానీ విజయ్ మంచి అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లను కలిగి ఉన్నాడు. విజయ్ వద్ద ఉన్న లగ్జరీ కార్ల గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

ఇలయదలపతి విజయ్ ఉపయోగించే లగ్జరీ కార్స్

రోల్స్ రాయిస్ ఘోస్ట్

ప్రపంచవ్యాప్తంగా ఉన్న లగ్జరీ కార్లలో ఒకటి ఈ రోల్స్ రాయిస్ బ్రాండ్. నటుడు విజయ్ రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారును కలిగి ఉన్నాడు. దక్షిణ భారతదేశంలో ఈ కారును కలిగి ఉన్న అతి తక్కువమందిలో విజయ్ ఒకరు. ఈ కారు ధర అక్షరాలా రూ. 2.5 కోట్లు.

MOST READ:ఇలా చేస్తే ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ పొందటం వెరీ సింపుల్

ఇలయదలపతి విజయ్ ఉపయోగించే లగ్జరీ కార్స్

రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారులో 6.75-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ వి 12 పెట్రోల్ ఇంజన్ అమర్చారు. ఈ ఇంజన్ 570 బిహెచ్‌పి పవర్ మరియు 850 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం అమ్మకానికి ఉన్న ఘోస్ట్ కార్, రోల్స్ రాయిస్ యొక్క 116 సంవత్సరాల చరిత్రలో అత్యంత విజయవంతమైన కారు.

ఇలయదలపతి విజయ్ ఉపయోగించే లగ్జరీ కార్స్

మినీ కూపర్ ఎస్

విజయ్ కలిగి ఉన్న కార్లలో మరింత కాంపాక్ట్ మరియు స్పోర్టి మరియు విలాసవంతమైన మినీ కూపర్ ఎస్ ఒకటి. ఈ హ్యాచ్‌బ్యాక్‌లో 2-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 184 బిహెచ్‌పి పవర్ మరియు 240 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

MOST READ:హైదరాబాద్‌లో మళ్ళీ ప్రారంభం కానున్న డబుల్ డెక్కర్ బస్ సర్వీస్..ఎప్పుడంటే?

ఇలయదలపతి విజయ్ ఉపయోగించే లగ్జరీ కార్స్

మినీ కూపర్ ఎస్ కారును అమితాబ్ బచ్చన్ మరియు మమ్ముట్టి వంటి ప్రముఖుల కారు గ్యారేజీలో చూడవచ్చు. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా మంచి లగ్జరీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇది కూడా అత్యంత ఖరీదైన కారు.

ఇలయదలపతి విజయ్ ఉపయోగించే లగ్జరీ కార్స్

ఆడి ఎ 8

ఆడిబ్రాండ్ యొక్క అత్యంత లగ్జరీ సెడాన్ ఈ ఆడి ఎ 8. ఈ ఆడి ఎ 8 కారుని కూడా విజయ్ కలిగి ఉన్నాడు. ఇది అతడు తన రోజువారీ అవసరాలు ఉపయోగిస్తారు. ఆడి ఎ 8 భారత మార్కెట్లో ఉన్న లగ్జరీ కార్లలో ఒకటి.

MOST READ:అరుదైన లగ్జరీ కార్‌లో కనిపించిన బాలీవుడ్ బాద్షా "షారుఖ్ ఖాన్" [వీడియో]

ఇలయదలపతి విజయ్ ఉపయోగించే లగ్జరీ కార్స్

ఆడి ఎ 8 కారులో 3.0 లీటర్ వి 6 టర్బో పెట్రోల్ ఇంజన్ అమర్చనున్నారు. ఈ ఇంజన్ 340 బిహెచ్‌పి శక్తి మరియు 500 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలిగి ఉంటుంది. ఇది చాలా లగ్జరీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. వాహనదారునికి చాలా అనుకూలంగా కూడా ఉటుంది.

ఇలయదలపతి విజయ్ ఉపయోగించే లగ్జరీ కార్స్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 మరియు ఎక్స్6

తమిళ్ స్టార్ విజయ్ బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 5 మరియు ఎక్స్ 6 ఎస్‌యూవీలను కూడా కలిగి ఉన్నారు. సాధారణంగా విజయ్ కి బిఎమ్‌డబ్ల్యూ బ్రాండ్ కార్లపై ఎక్కువా మక్కువ. ఈ కారణంగా యితడు చాలావరకు బిఎమ్‌డబ్ల్యూ ఎస్‌యూవీలు ఉపయోగిస్తుంటారు.

MOST READ:డ్రైవింగ్ టెస్ట్ లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం ఎలా.. ఇది చూడండి

ఇలయదలపతి విజయ్ ఉపయోగించే లగ్జరీ కార్స్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌ 5 ఎస్‌యూవీలో 5 3 లీటర్, ఇన్‌లైన్ 6 టర్బో డీజిల్ ఇంజన్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో ఉంటుంది. బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 6 ఇప్పుడు ఎక్స్‌డ్రైవ్ 40 ఐ 3.0-లీటర్, సిక్స్ సిలిండర్, టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ 340 హెచ్‌పి మరియు 450 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. ఇవి బీఎండబ్ల్యూ యొక్క అత్యంత ప్రసిద్ధ కార్లు.

Most Read Articles

English summary
Luxurious Cars Owned By Actor Vijay Thalapathi. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X