ధర రూ.12.5 లక్షల బైక్‌ను బహుమతిగా ఇచ్చిన హీరో అజిత్‌... ఎందుకో తెలుసా?

తమిళ స్టార్‌ హీరో అజిత్‌ కుమార్‌కు బైక్‌లు, రేస్‌లంట్ ఎంతో ఇష్టం. సినిమాల మధ్య విరామం దొరికినప్పుడు సరదాగా టూర్లు కూడా వేస్తుంటారు. హీరో అజిత్‌ ఇటీవల భారత్‌, నేపాల్‌, భూటాన్‌, సహా యూరప్‌లోని కొన్ని ప్రాంతాలకు బైక్‌ యాత్రకు వెళ్లి వచ్చారు. ఈ సంవత్సరం నవంబర్‌లో మరోసారి ప్రపంచ యాత్రకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.

ఈ నెల తొలి భాగంలో హీరో అజిత్‌ కుమార్‌ తన భారత యాత్రను విజయవంతంగా పూర్తిచేశారు. ఈ యాత్ర తర్వాత ఈ సంవత్సరం నవంబర్‌లో ప్రపంచ యాత్రకు వెళ్లేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. అంతకు ముందే తన తోటి రైడర్‌కు ఎప్పటికి గుర్తిండిపోయే బహుమతి ఇవ్వాలని నిర్ణయించుకొని సూపర్‌బైక్‌ను గిఫ్ట్‌గా అందించారు. నేపాల్‌ యాత్ర నిర్వహించిన తోటి రైడర్‌ సుగత్‌ సత్పతికి రూ.12.5 లక్షల విలువైన BMW F 850 GS సూపర్‌బైక్‌ను బహుమతిగా ఇచ్చి ఆశ్యర్యపరిచారు.

Tamil hero ajith gifted costly bmw F850GS

ఈ విషయాన్ని సుగత్‌ సత్పతి స్వయంగా తన ఇన్‌స్టాగ్రాం ద్వారా వెల్లడించారు. హీరో అజిత్‌ కోసం తాను ఇప్పటికి రెండు బైక్ యాత్రలు నిర్వహించినట్లు చెప్పారు. తన ఉత్సాహం మరియు కృతజ్ఞతను వివరించారు. 2022 సంవత్సరం చివర్లో స్టార్‌ హీరో అజిత్‌తో టచ్‌లో ఉండే అదృష్టం తనకు దక్కిందని తెలిపారు. అజిత్‌ బైక్‌ డ్రైవింగ్‌కు ఎంతో ఇష్టమని సుగత్‌ తెలిపారు.

Tamil hero ajith gifted costly bmw F850GS

హీరో అజిత్‌ కుమార్‌ కోసం ఇటీవల ఈశాన్య యాత్రను నిర్వహించినట్లు సుగత్‌ తెలిపారు. ఆ యాత్రలో తాను డ్యూక్‌ 390 బైక్‌ను నడిపినట్లు చెప్పారు. ఈశాన్య యాత్ర సందర్భంగా అజిత్‌ తనతో మరో యాత్రకు వస్తాయని చెప్పారని, అందులో భాగంగానే నేపాల్‌, భూటాన్‌ను చుట్టివచ్చినట్లు చెప్పారు. ఈ యాత్ర మే 6న పూర్తయినట్లు తెలిపారు. ఈ యాత్రలో ఎన్నో సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు చూసినట్లు పేర్కొన్నారు.

BMW F850GS కేవలం ఓ మోటార్‌సైకిల్‌ మాత్రమే కాదని.. తనకు అన్న నుంచి వచ్చిన గొప్ప బహుమతి అంటూ చెప్పుకొచ్చారు. భూగోళాన్ని చుట్టి వచ్చేంత సామర్థ్యమున్న F850GS తన వద్ద ఉండాలని అజిత్‌ అన్న కోరుకున్నారని సుగత్‌ తెలిపారు.

Tamil hero ajith gifted costly bmw F850GS

ఈ బీఎండబ్ల్యూ F 850 GS బైక్‌ 853 cc ఎయిర్‌ కూల్డ్‌ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. 8250 rpm వద్ద 95.17 PS శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌ 15 లీటర్ల సామర్థ్యం కలిగిన ఇంధన ట్యాంక్ ఉంటుంది. మరియు ఈ బైక్ 24.4 kmpl మైలేజీ వస్తుంది. ఈ బైక్‌ ముందు, వెనుక డిస్క్‌ బ్రేకులను కలిగి ఉంటుంది. BS6 కర్బన ఉద్గార ప్రమాణాలను కలిగి ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, May 25, 2023, 14:15 [IST]
English summary
Tamil hero ajith kumar gifted costly bmw f 850 gs super bike to rider
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+