ఇది చూసారా.. ఇప్పుడు అతి తక్కువ ఖర్చుతో వివాహ వేదిక మీ ఇంటికే వస్తుంది

ఇటీవల కాలంలో భారతదేశంలో చాలా పెద్ద సంఖ్యలో వాహనాలు మాడిఫై చేయబడుతున్నాయి. కార్లు మరియు బైక్ లతో సహా అన్ని రకాల వాహనాలు వివిధ రకాలుగా మాడిఫై చేయబడ్డాయి. ప్రజలు తమ వాహనాలను తమకు నచ్చినట్లు ఆకర్షణీయంగా తయారుచేసుకుంటారు.

ఇది చూసారా.. ఇప్పుడు అతి తక్కువ ఖర్చుతో వివాహ వేదిక మీ ఇంటికే వస్తుంది

సాధారణంగా వాహనాలను మాడిఫై చేయడం కొంతవరకు కష్టమైన పనే అయినప్పటికీ కొంతమంది వృత్తిపరంగా చాలా ఆకర్షణీయంగా తయారుచేస్తారు. అటువంటి అరుదైన వ్యక్తులలో అబ్దుల్ హకీమ్ ఒకరు. తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలోని ఉడుమలైపేటాయికి చెందినవాడు. అబ్దుల్ హకీమ్ తన ట్రక్కును మాడిఫై చేసాడు.

ఇది చూసారా.. ఇప్పుడు అతి తక్కువ ఖర్చుతో వివాహ వేదిక మీ ఇంటికే వస్తుంది

అబ్దుల్ హకీమ్ చేసిన ఈ మార్పు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కరోనా వైరస్ కారణంగా వివాహాలపై ప్రభుత్వం ఇప్పుడు కఠినమైన ఆంక్షలు విధించింది. హాళ్ళలో జరిగిన వివాహాలు ఇప్పుడు ఇళ్లలోనే జరుగుతున్నాయి.

ఇది చూసారా.. ఇప్పుడు అతి తక్కువ ఖర్చుతో వివాహ వేదిక మీ ఇంటికే వస్తుంది

గత వివాహాలతో పోల్చితే ఇప్పుడు జరుగుతున్న వివాహాలు ఆడంబరముగా ఉండవు. వివాహం జీవితంలో ఒక మలుపు. సాధారణంగా పెళ్లిలో డెకరేషన్ కోసం చాలామంది ప్రజలు లక్ష రూపాయలు ఖర్చు చేస్తారు.

ఇది చూసారా.. ఇప్పుడు అతి తక్కువ ఖర్చుతో వివాహ వేదిక మీ ఇంటికే వస్తుంది

కానీ కరోనా వైరస్ అన్ని రకాల వివాహ ఆడంబరాలకు బ్రేక్ పెట్టింది. విలాసంగా వివాహం చేసుకోవాలనుకున్న వారు నిరాశ చెందారని చెప్పుకోవాలి. నిజానికి అబ్దుల్ హకీమ్ స్టేజ్ డెకరేషన్ బిజినెస్ చేస్తున్నాడు.

ఇది చూసారా.. ఇప్పుడు అతి తక్కువ ఖర్చుతో వివాహ వేదిక మీ ఇంటికే వస్తుంది

కానీ కరోనావైరస్ మరియు లాక్ డౌన్ అతని వృత్తిని కొంతవరకు నాశనం చేశాయి. కానీ అబ్దుల్ హకీమ్ మాత్రం తన ప్రయత్నాలను ఆపలేదు. హకీమ్ ఒక లారీని కలిగి ఉన్నాడు. ఈ లారీని పెళ్లి గృహంగా ఎందుకు చేయకూడదు? ఈ ఆలోచన గుర్తుకు వచ్చిన వెంటనే, అతడు దానిని అమలు చేయడం ప్రారంభించాడు.

ఇది చూసారా.. ఇప్పుడు అతి తక్కువ ఖర్చుతో వివాహ వేదిక మీ ఇంటికే వస్తుంది

వారు తమ ట్రక్ వెనుక భాగాన్ని వివాహ వేదికగా తయారుచేసాడు. ఈ వేదికపై వధూవరులకు రెండు వైపులా సోఫా, ఎయిర్ కూలర్ మరియు పూల కుండలు అమర్చారు. తేలికపాటి సంగీతం కోసం స్పీకర్లను కూడా తయారుచేసాడు. ఈ వివాహ వేదిక క్రింద కుర్చీలు పెట్టడం థియేట్రికల్ వెడ్డింగ్ హోమ్ లాగా కనిపిస్తుంది.

ఇది చూసారా.. ఇప్పుడు అతి తక్కువ ఖర్చుతో వివాహ వేదిక మీ ఇంటికే వస్తుంది

ఈ కారణంగా, ఈ ట్రక్కును మినీ వెడ్డింగ్ హాల్ అని పిలవడానికి ఎటువంటి ఆటంకాలు లేవు. అబ్దుల్ హకీమ్ 17 అడుగుల ట్రక్కు వెనుక భాగాన్ని వివాహ వేదికగా సిద్ధం చేశాడు. ఈ మొబైల్ వెడ్డింగ్ హాల్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఇది చూసారా.. ఇప్పుడు అతి తక్కువ ఖర్చుతో వివాహ వేదిక మీ ఇంటికే వస్తుంది

వివాహానికి హాజరయ్యే వారికి ఫేస్ మాస్క్‌లు, శానిటైజర్లు ఇస్తారు. ఈ మొబైల్ వెడ్డింగ్ హాల్ వివాహ రిసెప్షన్ కంటే తక్కువ ఖర్చుతో కూడుకున్నది. అబ్దుల్ హకీమ్ చేసిన ఈ ప్రయత్నం బాగా ప్రశంసించబడింది.

Source: Vikatan

Article Published On: Thursday, July 16, 2020, 20:22 [IST]
English summary
Tamilnadu lorry owner modifies his lorry as mobile marriage hall. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+