వధువుకి లీటరు పెట్రోల్, వరుడికి లీటర్ డీజిల్ గిఫ్ట్.. బహుశా ఇప్పుడివే ఖరీదైన కానుకలేమో..!!
దేశంలో ఇంధన ధరలు దాదాపుగా ప్రతిరోజూ పెరుగుతున్న సంగతి మనందరికీ తెలిసినదే. ఈ నేపథ్యంలో, ప్రజలు వివిధ రూపాల్లో పెరుగుతున్న ఇంధన ధరలపై నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇందులో ఇన్ని నిరసనలు చాలా సరదాగా కూడా ఉంటున్నాయి. తాజాగా, ఓ పెళ్లి వేడుకలో వధూవరుల స్నేహితులు వధువుకి లీటర్ పెట్రోల్‌ను మరియు వరుడికి లీటరు డీజిల్‌ను కానుకగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

ప్రస్తుత పరిస్థితుల్లో బహుశా ఇదే ఖరీదైన కానుక కాబోలు అంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. ఓ కొత్త జంట వివాహం సందర్భంగా, వారి స్నేహితులు పెళ్లి కానుకగా ఆ జంటకు లీటర్ బాటిళ్లలో పెట్రోల్ మరియు డీజిల్ ఇంధనాన్ని కానుక ఇచ్చారు. ఈ కొత్త జంటకు ఇంధనాన్ని ఈ బహుమతిని ఇస్తున్న దృశ్యాన్ని అతని స్నేహితులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. సోషల్ మీడియాలో ఆ వీడియో కాస్తా వైరల్ అయ్యింది.

ఈ వీడియో తమిళనాడులోని చెంగల్‌పట్టు జిల్లా చేయూర్ గ్రామానికి చెందినదనిగా చెబుతున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తర్వాత, ఈ వీడియోని ఎక్కువమంది షేర్ చేయడం వలన త్వరగా వైరల్ అయింది. ఇప్పటే లక్షలాది మంది ఈ వీడియోను సోషల్ మీడియాలో చూసి షేర్ చేశారు. ఈ వినూత్న ఆలోచన వరుడు గ్రేస్ కుమార్, వధువు కీర్తనల స్నేహితుల మదిలో మెదిలింది. ఈ వీడియోని చూసిన వారు ఇకపై పెళ్లి కానుకుల చదివింపులలో నూటపదహార్లకు బదులుగా లీటరు పెట్రోల్ లేదా లీటరు డీజిల్ చదివిస్తారేమో..!!

భారతదేశంలో ఐదు రాష్ట్రాలలో ఎన్నికల నేపథ్యంలో దాదాపు ఐదు నెలలుగా ఇంధన ధరలు పెరగలేదు. ఆ సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగినప్పటికీ, భారతదేశంలో మాత్రం చమురు కంపెనీలు మాత్రం ధరలను పెంచలేదు. ఎక్కువ ధరకు కొని తక్కువ ధరకు విక్రయించిన కారణంగా, భారతీయ చమురు కంపెనీలు దాదాపు 19,000 కోట్ల రూపాయలు నష్టపోయినట్లు అంచనా.

ఇప్పుడు నష్టాన్ని రికవరీ చేసుకునేందుకు చమురు కంపెనీలు నిరంతరాయంగా ధరలను పెంచుతూనే ఉన్నాయి. నాలుగు నెలల విరామం తర్వాత ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుండి (మార్చి 22 నుండి) భారతదేశంలో ఇంధన ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం, భారత రాజధాని ఢిల్లీ సహా దేశంలోని అనేక ఇతర రాష్ట్రాలలో లీటరు చమురు ధర 100 రూపాయలను దాటేసింది. మరికొన్ని రాష్ట్రాల్లో అయితే, ఇది లీటరు 130 రూపాయలకు చేరువలో ఉంది

నిజానికి, భారత చమురు ధరలపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని చమురు కంపెనీల చేతికే వదిలేస్తూ, ఎప్పుడో తమ చేతులు దులిపేసుకుంది. అయితే, గడచిన ఎన్నికల నేపథ్యంలో, ఇంధన ధరల పెంపు తమ ప్రభుత్వానికి వ్యతిరేకతను తీసుకువస్తుందనే నెపంతో, ప్రభుత్వం చమురు కంపెనీలపై వత్తిడి తెచ్చింది. దీంతో, వారు చచ్చినట్లు ధరలను పెంచకుండా, పాత ధరకే ఇంధనాన్ని విక్రయించారు.

దేశంలో రోజురోజుకీ పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలపై దేశవ్యాప్తంగా ప్రజలు మరియు ప్రతిపక్షాలు వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయి. గడచిన 15 రోజుల్లో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు దాదాపు తొమ్మిది రూపాయలకు పైగా పెరిగాయి. ధరల పెరుగుదల తర్వాత తెలంగాణాలో లీటరు పెట్రోల్ ధర రూ.120 వరకూ ఉంటే, ఆంధ్రప్రదేశ్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.122 వరకూ ఉంది.

గడచిన 5 రోజులుగా మెట్రో నగరాల్లో ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదు. చివరిసారిగా బుధవారం నాడు పెట్రోల్ ధర లీటరుకు 80 పైసలు పెరిగింది. ప్రస్తుతం, దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ. 105.41 గా ఉంటే, ముంబైలో రికార్డు స్థాయిలో రూ. 120.51 గా ఉంది. ఇక డీజిల్ ధరల విషయానికి వస్తే, ఢిల్లీలో లీటరు ధర రూ.96.67 గా ఉంటే, ముంబైలో లీటకు ధర రూ.104.77 గా ఉంది.

ఏప్రిల్ 11, 2022 (సోమవారం) నాటికి దేశంలోని పలు ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి:
ఢిల్లీ
పెట్రోల్ - లీటరుకు రూ.105.41
డీజిల్ - లీటరుకు రూ.96.67
ముంబై
పెట్రోల్ - లీటరు రూ.120.51
డీజిల్ - లీటరుకు రూ.104.77
కోల్‌కతా
పెట్రోల్ - లీటరుకు రూ.115.12
డీజిల్ - లీటరుకు రూ.99.83
చెన్నై
పెట్రోల్ - లీటరు రూ.110.85
డీజిల్ - లీటరుకు రూ.100.94

హైదరాబాద్
పెట్రోల్ - లీటరుకు రూ.119.49
డీజిల్ - లీటరుకు రూ.105.49
బెంగళూరు
పెట్రోల్ - లీటరుకు రూ.111.09
డీజిల్ - లీటరుకు రూ.94.79
గాంధీనగర్
పెట్రోల్ - లీటరుకు రూ.105.29
డీజిల్ - లీటరుకు రూ.99.64
తిరువనంతపురం
పెట్రోల్ - లీటరుకు రూ.117.19
డీజిల్ - లీటరుకు రూ.103.95
గౌహతి
పెట్రోల్ - లీటరుకు రూ.105.66
డీజిల్ - లీటరుకు రూ.91.40
భోపాల్
పెట్రోల్ - లీటరుకు రూ.118.14
డీజిల్ - లీటరుకు రూ.101.16
లక్నో
పెట్రోల్ - లీటరు రూ.105.25
డీజిల్ - లీటరుకు రూ.96.83


Click it and Unblock the Notifications








