కరోనా ఎఫెక్ట్ : 11 వేలకు పైగా వాహనాల సీజ్
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించడం వల్ల దాదాపు 40,000 వేలకు పైగా ప్రజలు మరణించారు. భారతదేశంలో కూడా ఈ వైరస్ ఎక్కువగా వ్యాపిస్తోంది.
కరోనా వ్యాప్తిని తగ్గించడానికి భారత ప్రభుత్వం 2020 ఏప్రిల్ 14 వరకు 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించింది. ఈ లాక్ డౌన్ లో భాగంగా అన్ని వాహన సేవలు అంటే బస్సులు, ట్రైన్లు, విమాన సేవలు వంటివి పూర్తిగా నిలివేయబడ్డాయి. ప్రజలు కూడా అత్యవసర పరిస్థితిలో తప్ప ఇంటినుంచి బయటకు రాకూడదని హెచ్చరికలు జరీ చేసింది.

భారతదేశం కరోనా వ్యాప్తిని తగ్గించడాకిని లాక్ డౌన్ ప్రకటించబడింది. కానీ కొంతమంది ఇంత క్లిష్ట పరిస్థితులలో కూడా బయట తిరగటం అనేది చాలా హేమమైన చర్య. ఈ లాక్ డౌన్ వల్ల కరోనా తగ్గించడానికి పోలీసులు పగలు రాత్రి కష్టపడుతున్నారు. కానీ ఎంత కఠినమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రజలను నిలువరించలేకపోతున్నారు. ఈ లాక్ డౌన్ ని చాల మంది ప్రజలు మాత్రమే కాకుండా రాజకీయ నాయకులు కూడా ఉల్లంగిస్తున్నారు.

లాక్ డౌన్ ఉల్లంఘనకు పాల్పడిన వారిపై పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. చాల వాహనాలను సీజ్ చేయడం, ఉల్లంఘనకు పాలపడిన వ్యక్తులపై కేసులు నమోదు చేయడం వంటివి కాకూండా వాహనదారులపై లాఠీ ఛార్జి కూడా చేయడం జరిగింది

రాష్ట్ర కర్ఫ్యూను ఉల్లంఘించినందుకు తమిళనాడులో పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 11,565 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకూండా ప్రజలపై 14,815 కేసులు నమోదు చేశారు.
లాక్ డౌన్ మొదటి నాలుగు రోజుల్లో 17,668 మందిని అరెస్టు చేశారు. ఈ గణాంకాలు గణనీయంగా పెరుగుతాయని గమనించాలి. లాక్ డౌన్ కాలంలో పోలీసులు ప్రజల నుండి వసూలు వసూలు చేసిన జరిమానా మొత్తం రూ. 4.8 లక్షలు.

ఇదే విధంగా చెన్నైలో పోలీసులు 307 కేసులను బుక్ చేసి 218 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు జరిమానాలు జారీ చేయడమే కాకుండా చాలా వాహనాలను స్వాధీనం చేసుకోవడం ప్రారంభించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలలో అక్కడ రెండు ఆటోరిక్షాలు మరియు ఒక కారు కూడా ఉన్నాయి.

భారతదేశంలో కరోనా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో తమిళనాడు ఒకటి. ఈ కారణంగా తమిళనాడులో 144 సెక్షన్ విధించడం జరిగింది. ప్రజలు రోడ్లపైకి రావడాన్ని కూడా పూర్తిగా నిషేధించడం జరిగింది. కరోనావైరస్ వ్యాప్తి వల్ల ప్రజలు బయటకు వెళ్ళడం వల్ల కలిగే పరిణామాలను వారు అర్థం చేసుకుంటారని ఒక పోలీసు అధికారి తెలిపారు. అయినప్పటికీ చాలా మంది వీటిని ఉల్లంగిస్తున్నారు.

కరోనావైరస్ వ్యాప్తి ప్రస్తుతం భారతదేశంలో 1,500 మందికి పైగా వ్యాపించిందని నివేదికలు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇది మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ లాక్ డౌన్ మరింత కఠినంగా నిర్వహించాసి వస్తుంది. ప్రజలందరూ దీనిని దృష్టిలో ఉంచుకుని వీలైనంతవరకు ఇంట్లోనే ఉంటూ కరోనా నివారణకు మద్దతు తెలపాలి.


Click it and Unblock the Notifications








