మానవత్వం చాటుకున్న మంచి పోలీస్ & బైక్ రైడర్.. వీడియో చూస్తే మీరు కూడా మెచ్చుకుంటారు

సాధారణంగా పోలీసులు నడిరోడ్డుపై ఎక్కడైనా వాహనాలను ఆపారంటే వాహనదారులు చాలా ఆందోళనకు గురువవుతారు. ఎందుకంటే పోలీసులు డ్రైవింగ్ లైసెన్స్ మరియు వాహననానికి సంబంధించిన ఇతర డాక్యుమెంట్స్ చూపించాలని పట్టుబడతారు. ఇవన్నీ సరిగ్గా ఉన్న వాహనదారులకు ఎటువంటి భయం ఉండదు. ఇలాంటివి లేని వాహనదారులు చట్ట రీత్యా నేరస్థులు.

ఇదిలా ఉండగా ఇటీవల తమిళనాడు రాష్ట్రంలో ఒక పోలీస్ అధికారి రోడ్డుపై ఒక బైక్ ని ఆపాడు. అయితే పోలీస్ ఈ బైక్ ని ఆపడానికి వేరే కారణం ఉంది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ చూద్దాం రండి..

నివేదికల ప్రకారం తమిళనాడు పోలీసు అధికారి కర్ణాటకకు చెందిన బైకర్‌ను ఆపాడు. దీనికి సంబంధించిన వీడియో యన్నీఅరుణ్ యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేయబడింది. కర్ణాటకకు చెందిన ఈ బైక్ రైడర్ పాండిచ్చేరి నుండి తెన్కాసి వెళ్తున్నాడు. ఆ సమయంలో ఒక తమిళనాడు పోలీసు అధికారి అతన్ని ఆపి మీరు కర్ణాటకకు చెందినవారా అని అడగడం, దానికి బైకర్ అవును అని చెప్పడం వంటివి ఈ చూడవచ్చు.

MOST READ:గెలియోస్ హోప్ ఎలక్ట్రిక్ స్కూటర్; ధర తక్కువ, డ్రైవింగ్ లైసెన్స్ అవసరమే లేదు

ఆ పోలీస్ అధికారి బైక్ రైడర్ ని ఆపడానికి ప్రధాన కారణం ఏమిటంటే, ఆ రోడ్డు మీదగా వెళ్తున్న బస్సులో ఒక వృద్ధ మహిళ మందుల బాటిల్ పడిపోయింది. దానిని తిరిగి ఆ వృద్ధ మహిళకు అప్పగించడానికి ఆ బైక్ రైడర్ ని ఆపాడు.

బస్సులో వెళ్తున్న ఆ వృద్ధ మహిళకు ఆ బాటిల్ ఇవ్వాలని ఆ రైడర్ కి చెప్పాడు. వేగంగా వెళ్తున్న ఓవర్ టెక్ చేసి ఆ బైక్ రైడర్ ఆ మందుల బతికి ఆ వృద్ధ మహిళకు అప్పగించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో వైరల్ అవుతోంది.

MOST READ:తలకిందులుగా నడుస్తూ కారునే లాగేసిన యోగా గురువు.. ఎందుకో తెలుసా..!

వీడియో చూసిన వారు సంబంధిత పోలీసు అధికారిని, బైకర్‌ను ప్రశంసిస్తున్నారు. ఈ వీడియోచూసిన వారు మానవత్వం ఇంకా చనిపోలేదని వ్యాఖ్యానించారు. మరికొందరు బస్సును ఆపిన బస్సు డ్రైవర్‌ను ప్రశంసించారు. భారతదేశంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను పరిష్కరించడానికి పోలీసు అధికారులు ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు.

ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు కొన్నిసార్లు పగటిపూట వాహనదారులను దోచుకుంటారని ఫిర్యాదులు కూడా ఉన్నాయి.

MOST READ:ఈ-చలాన్ విధించారని పోలీసుల క్యాప్ & ఎటిఎం లాక్కుని, బోరున ఏడ్చిన మహిళ [వీడియో]

కానీ ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియోలోని పోలీసు అధికారి మంచి కారణంతో బైక్‌ ఆపి, ప్రజల ప్రశంసలు అందుకున్నాడు. నిజంగా ఇటువంటి సహాయం చేసిన పోలీస్, బైక్ రైడర్ ప్రశంసనీయం.

Image Courtesy: AnnyArun

Most Read Articles

English summary
Tamilnadu Cop Stops Karnataka Bike Rider For Humanity Cause. Read in Telugu.
Story first published: Friday, March 26, 2021, 10:59 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X