180 అడుగుల ఎత్తు నుంచి పడిపోయిన టాటా ఆల్ట్రోజ్ కారు.. ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉందంటే..?
ఇటీవల కార్లు కొనుగోలు చేస్తున్నవారిలో అత్యధిక శాతం మంది సెఫ్టీ రేటింగ్‌ను కూడా దృష్టిలో పెట్టుకొనే నిర్ణయం తీసుకుంటున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే లోపల ఉన్న ప్రయాణికుల సురక్షితంగా ఉండేలా కార్ల తయారీ సంస్థలు తమ వాహనాలను రూపొందిస్తున్నారు. అయితే కార్లకు ఫీచర్ల ఎంత ముఖ్యమో సేఫ్టీ ఫీచర్లు కూడా అంతే ముఖ్యం. తాజా ఘటన చూస్తే ఈ విషయం మీకే అర్థం అవుతుంది.
మహారాష్ట్రలోని పూణేలో తాజాగా ఓ ప్రమాదం జరిగింది. సుమారు 180 అడుగుల ఎత్తు నుంచి టాటా ఆల్ట్రోజ్ కారు కింద పడిపోయింది. భారత్‌లో 5 స్టార్ రేటింగ్ కలిగిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు టాటా ఆల్ట్రోజ్ మాత్రమే. గ్లోబర్ NCAP రేటింగ్‌లోనూ అద్భుతమైన రేటింగ్‌ను కలిగి ఉంది. ఈ టాటా ఆల్ట్రోజ్ కారు బోల్డ్ లుక్‌ను కలిగి ఉంటుంది. మరియు మల్టిపుల్ పవర్‌ట్రైన్‌లతో అందుబాటులో ఉంటుంది.

టాటా ఆల్ట్రోజ్ కారు ప్రమాదానికి సంబంధించిన వీడియోను నిఖిల్ రానా యూట్యూబ్‌లో షేర్ చేశారు. ప్రమాద సమయంలో ఓ మహిళ టాటా ఆల్ట్రోజ్ కారును నడుపుతున్నారు. అయితే కారు నియంత్రణ కోల్పోయి.. సుమారు 180 మీటర్ల కిందకు పడిపోయింది. ఘటన స్థలికి దగ్గరలోని నిర్మాణంలో ఉన్న భవనంలోని కెమెరాల్లో ఈ వీడియో రికార్డయింది. అయితే ఈ ఘటనలో ఉన్న ప్రయాణికులు పరిస్థితి ఎలా ఉందో తెలుసా..
సీసీ కెమెరా వీడియో ప్రకారం.. ప్రమాదం అనంతరం డ్రైవింగ్ సీట్లో ఉన్న మహిళ చిన్న గాయాలతో బయటపడ్డారు. మరియు ప్రమాద స్థలం నుంచి ఆమె నడుచుకుంటూ బయటకు వచ్చారు. అంటే సుమారు 180 అడుగుల ఎత్తు నుంచి కారు కిందకు పడినా.. లోపలున్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అంటే టాటా ఆల్ట్రోజ్ కారు బిల్డ్ క్వాలిటీని మెచ్చుకునేలా చేసింది. అయితే కారు ప్రమాదానికి గల కారణాలు మాత్రం సరిగా తెలియలేదు.
భారత్‌లో ప్రతి సంవత్సరం వేలాది రోడ్డు ప్రమాదాలను జరుగుతున్నాయి. వీటికి ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడమే కారణం. అయితే టాటా ఆల్ట్రోజ్ నియంత్రణ కోల్పోవడానికి గల కారణాలు తెలియకపోయినా.. ఎత్తున ప్రాంతాల్లో అతివేగం సహా నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ ఘటనలో కారు బిల్డ్ క్వాలిటీ వల్లనే పెద్ద ప్రమాదం జరిగినా ప్రాణనష్టం కలగలేదు.

ఈ ప్రమాదమే కాదు... ఇటీవల జరిగిన కొన్ని ప్రమాదాల్లో టాటా ఆల్ట్రోజ్ కార్లు బిల్డ్ క్వాలిటీను నిరూపించాయి. దాదాపు అన్ని ప్రమాదాల్లోనూ ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అందువల్ల కార్ల కొనుగోలు చేస్తున్న సమయంలో చాలా మంది కారు బిల్డ్ క్వాలిటీ సహా ఇతర సెక్యూరిటీ ఫీచర్లపై ఆరా తీసిన అనంతరమే నిర్ణయం తీసుకుంటున్నారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








