Tata Altroz CNG బ్రోచర్‌ లీక్‌.. వేరియంట్స్, ఫీచర్ల వివరాలు మీకోసం

ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా నుంచి టియోగో, టిగోర్‌ తర్వాత మరో CNG మోడల్‌ Tata Altroz త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ ఏడాది ప్రారంభంలో ఏర్పాటుచేసిన ఆటో ఎక్స్‌పో ఈ కారును ప్రదర్శించారు. అయితే ఈ కారుకు సంబంధించిన కీలక విషయాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి.

Tata Altroz CNG నాలుగు రంగుల్లో అందుబాటులో ఉండనుంది. ఓపెరా బ్లూ, డౌన్‌టౌన్‌ రెడ్‌, అర్కడే గ్రే మరియు అవెన్యూ వైట్‌ రంగుల్లోని కార్లను వినియోగదారులు ఎంపికచేసుకోవచ్చు. ఇక డిజైల్‌ విషయానికి వస్తే ఈ కారు 3,990 mm పొడవు, 1755 mm వెడల్పు, 1,523 ఎత్తు కలిగి ఉండనుంది. 16 అంగుళాల డ్యూయల్ టోన్‌ అల్లాయ్‌ వీల్స్‌తో పాటు 2,501 mm వీల్‌బేస్‌తో కలిగి ఉండనుంది.

Tata Altroz CNG

ఈ కారు మొత్తం 6 వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. XE, XM+, XM+ (S), XZ, XZ+ (S) మరియు XZ+O (s) వేరియంట్లను లాంచ్‌ కానుంది. వీటిలో XM+(S), XZ+(S) మరియు XZ+O వేరియంట్లు వాయిస్‌ అసిస్టెంట్‌తోపాటు సన్‌రూఫ్‌ కలిగి ఉంటాయి.

ఆల్ట్రోజ్‌ సీఎన్‌జీ XE బేస్‌ వేరియంట్‌లో కొన్ని సేఫ్టీ ఫీచర్లు తప్పితే ఇంకా ఎటువంటి ప్రత్యేక ఫీచర్లు అందుబాటులో లేవు. 4 అంగుళాల డిజిటల్‌ ఇన్ట్రుమెంట్‌ క్లస్టర్‌తో ఈ కారు రానుంది.

Altroz CNG XM+ వేరియంట్ 7 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌ టచ్‌ స్ర్కీన్‌తోపాటు నాలుగు స్పీకర్లతో రానుంది. మౌంటెండ్ స్టీరింగ్‌ కంట్రోల్స్, what3words నేవిగేషన్‌, రిమోట్‌ కీ లెస్‌ ఎంట్రీ, USB షాకెట్స్‌ ఉంటాయి. ఎలక్ట్రిక్‌ పోల్డబుల్‌ ORVMs, సెంట్రల్ లాకింగ్‌, వాయిస్‌ అసెస్టెంట్‌, యాపిల్‌ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్‌ ఆటో కనెక్టవిటీతో విడుదల కానుంది.

Tata Altroz XZ+O కారులో అనేక ఫీచర్లు ఉండనున్నాయి. ఆటో హెడ్‌ల్యాంప్‌, TPMS, ఎయిర్‌ ఫ్యూరిఫైయర్‌, వెనుక వైపు AC వెంట్స్, వైర్‌లైస్‌ ఛార్జర్‌, 8 స్పీకర్లతో మ్యూజిక్‌ సిస్టమ్, కార్‌ టెక్‌ టెక్నాలజీ, వెనుకవైపు ఫాగ్‌ ల్యాంప్‌, రేర్‌ వ్యూ కెమెరా, లెదర్‌ సీట్ల వంటి అద్భుతమైన సౌకర్యాలతో ఈ కారు అందుబాటులోకి రానుంది.

టాటా టియాగో, టాటా టిగోర్‌లో 60 లీటర్ల సింగిల్‌ ఇంధన ట్యాంకులు కలిగి ఉన్నాయి. అదే ఆల్ట్రోజ్‌ సీఎన్‌జీలో రెండు 30 లీటర్ల ట్యాంక్‌లను బూట్‌ ప్లోర్‌ కింద అమర్చారు. దీంతో ఈ కారు బూట్‌ స్పేస్‌ ప్రస్తుతం 345 లీటర్లుగా ఉంది. కాబట్టి సీఎన్‌జీ వేరియంట్‌లో బూట్‌ స్పేస్‌ సుమారు 200 లీటర్లుగా ఉండే అవకాశం ఉంది.

టాటా ఆల్ట్రోజ్‌ CNG 1.2 లీటర్లు, 3 సిలిండర్‌తో 5 స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌తో రానుంది. పెట్రోల్‌ ఇంజిన్‌.. 86hp శక్తిని 113 టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే CNGలో 6000 RPM వద్ద 77 hp శక్తిని మరియు 3500 RPM వ‌ద్ద 97 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ఇంధన సామర్థ్యం 27 km/kg గా ఉండనుంది.

అయితే Tata Altroz CNG కారు ధర త్వరలో వెల్లడించే అవకాశం ఉంది. ఈ కారు లాంచ్‌ అయిన తర్వాత మారుతి సుజికీ బాలెనో CNG, టయోటా గ్లాంజా CNG మరియు హ్యుందాయ్‌ గ్రాండ్‌ i10 నియోస్‌ CNG కార్లతో పోటీపడే అవకాశం ఉంది. రూ.21,000 వద్ద టాటా ఆల్ట్రోజ్‌ కారు బుకింగ్‌లను సంస్థ ప్రారంభించింది. ఈ మే నుంచి డెలివరీలు ప్రారంభించనుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, May 2, 2023, 20:24 [IST]
English summary
Tata altroz cng brochure leaked key features and variant details revealed
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+