సేఫ్టీలో నేనే కింగ్; మరోసారి నిరూపించుకున్న Tata Altroz

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రసిద్ధి చెందిన వాహన తయారీ సంస్థల్లో ఒకటి Tata Motors (టాటా మోటార్స్). Tata Motors యొక్క కార్లు నమ్మికైనవి మరియు నాణ్యమైనవి. అంతే కాకూండా, భారతీయ మార్కెట్లో అత్యంత సురక్షితమైన కార్ల తయారీదారులలో ఒకటిగా ఎంతగానో ప్రసిద్ధి చెందింది. Tata Motors కార్లు క్రాష్ టెస్ట్ టెస్ట్‌లలో మంచి సేఫ్టీ రేటింగ్ కూడా కైవసం చేసుకున్నాయి.

సేఫ్టీలో నేనే కింగ్; మరోసారి నిరూపించుకున్న Tata Altroz

Tata Motors యొక్క కార్లు సేఫ్టీ విషయంలో తమకు తామే సాటి అని చాలా సార్లు నిరూపించబడ్డాయి. ఇటీవల కాలంలో కూడా Tata Motors యొక్క Tata Altroz మరో సారి తన సేఫ్టీ విషయంలో రారాజుగా నిలిచింది.

సేఫ్టీలో నేనే కింగ్; మరోసారి నిరూపించుకున్న Tata Altroz

నివేదికల ప్రకారం Tata Altroz ఇటీవల ఒక ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కారు తీవ్రంగా దెబ్బతింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. ఇంత ప్రమాదానికి గురైనప్పటికి కూడా కారులోని ప్రయాణికులు అందరూ సురక్షితంగా బయటపడ్డారు. నిజంగా ఇదంతా Tata Motors ఇందులో అందించిన సేఫ్టీ ఫీచర్స్ వల్ల సాధ్యమయ్యింది.

సేఫ్టీలో నేనే కింగ్; మరోసారి నిరూపించుకున్న Tata Altroz

Tata Altroz (టాటా ఆల్ట్రోజ్) కారు యజమాని ప్రమాదానికి గురైన కారు చిత్రాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. వారు అందించిన సమాచారం ప్రకారం, ఈ Tata Altroz కారులో ముగ్గురు పెద్ద వారు మరియు ముగ్గురు పిల్లలు కారులో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో Tata Altroz ముందు వెళ్తున్న కారును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు ఎడమ వైపు బంపర్ బాగా దెబ్బతింది.

సేఫ్టీలో నేనే కింగ్; మరోసారి నిరూపించుకున్న Tata Altroz

Tata Altroz కారు ఈ ప్రమాదానికి గురైన వెంటనే లోపల ఉన్న రెండు ఎయిర్‌బ్యాగులు తెరవబడ్డాయి. కారు లోపల కూర్చున్న వారందరూ సురక్షితంగా బయటపడ్డారు. కారులోని వారికి ఎలాంటి గాయాలు కాలేదు. కారు లోపల కూర్చున్న అందరూ కూడా సీట్ బెల్ట్ ధరించడం వల్ల ఎలాంటి హాని జరగకుండా బయటపడ్డారు.

సేఫ్టీలో నేనే కింగ్; మరోసారి నిరూపించుకున్న Tata Altroz

Tata Altroz కు గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్‌లో సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందింది. ఈ కారు అడల్ట్స్ యొక్క భద్రతలో 17 కి 16.13 పాయింట్లు సాధించింది. అంతే కాకూండా పిల్లల భద్రతలో 49 కి 29 పాయింట్లు సాధించింది. Tata Altroz యొక్క అన్ని వేరియంట్లలో రెండు ఎయిర్ బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా అందించబడతాయి. ఇవి ప్రయాణికుల భద్రత విషయంలో ప్రధాన పాత్ర వహిస్తాయి.

సేఫ్టీలో నేనే కింగ్; మరోసారి నిరూపించుకున్న Tata Altroz

Tata Altroz యొక్క సేఫ్టీ ఫీచర్స్ గమనించినట్లయితే, ఇందులో ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబిడి, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్, ఫ్రంట్ సీట్‌బెల్ట్ రిమైండర్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, ISOFIX యాంకర్ వంటివి ఉన్నాయి. ఇవి కారులో ప్రయాణించేవారికి ప్రమాదంనుంచి కాపాడటానికి ఉపయోగపడతాయి.

సేఫ్టీలో నేనే కింగ్; మరోసారి నిరూపించుకున్న Tata Altroz

Tata Altroz కారు Tata Motors యొక్క ఆల్ఫా ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడింది, ఇది అత్యుత్తమ బలం మరియు సమతుల్యతకు ప్రసిద్ధి చెందింది. ఇది 'ఇంపాక్ట్ 2.0' డిజైన్ భాషపై నిర్మించబడింది. కావున అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, బంపర్‌లపై ఫాగ్ ల్యాంప్‌లు మరియు వెనుకవైపు ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు ఉన్నాయి.

సేఫ్టీలో నేనే కింగ్; మరోసారి నిరూపించుకున్న Tata Altroz

Tata Altroz యొక్క కొలతల విషయానికి వస్తే, ఇది 3,990 మిమీ పొడవు, 1,755 మిమీ పొడవు, ఎత్తు 1,523 మిమీ మరియు వీల్‌బేస్‌ 2,501 మిమీ వరకు ఉంటుంది.

సేఫ్టీలో నేనే కింగ్; మరోసారి నిరూపించుకున్న Tata Altroz

Tata Altroz ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇంటీరియర్ డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్‌తో చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. ఇందులో యాంబియంట్ లైటింగ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, హర్మన్ సరౌండ్ సౌండ్, స్టీరింగ్ వీల్ మౌంటెడ్ కంట్రోల్స్ మరియు రియర్ ఎసి వెంట్స్ మరియు టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లను పొందుతుంది.

సేఫ్టీలో నేనే కింగ్; మరోసారి నిరూపించుకున్న Tata Altroz

Tata Altroz రెండు ఇంజిన్ ఎంపికలతో వస్తుంది. ఒకటి 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ కాగా మరొకటి 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్. ఇందులోని 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 86 బిహెచ్‌పి పవర్ మరియు 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

సేఫ్టీలో నేనే కింగ్; మరోసారి నిరూపించుకున్న Tata Altroz

ఇక రెండవ ఇంజిన్ అయిన 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 1,497 సిసి మోటార్‌తో శక్తినిస్తుంది, ఇది 90 బిహెచ్‌పి పవర్ మరియు 200 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ తో మాత్రమే జతచేయబడి ఉంటుంది. ఇది మంచి ఫెర్ఫామెన్స్ అందిస్తుంది.

Most Read Articles

English summary
Tata altroz driver praising his car after saved in accident
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X