టాటా హారియర్‌ను ర్యాష్ డ్రైవింగ్‌ చేసిన విద్యార్థి.. అదుపుతప్పి వంతెన నుంచి పడిపోయిన SUV.. వీడియో వైరల్‌..!

ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే దేశాల్లో భారత్‌ కూడా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రమాదాలకు అనేక కారణాలు ఉంటున్నాయి. అధిక వేగం సహా నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేయడం మరియు ప్రధానంగా మైనర్లు వాహనాలు నడపడం కూడా భారీ ప్రమాదాలకు కారణాలు అవుతున్నాయి.

తాజాగా టాటా హారియర్‌ ఫేస్‌లిఫ్ట్‌ (Tata Harrier 2023) వాహనం భారీ ప్రమాదానికి గురైంది. అతివేగం కారణంగా అదుపుతప్పి వంతెన పైనుంచి కిందపడింది. ప్రమాద సమయంలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థి కారు డ్రైవింగ్‌ చేసినట్లు తెలిసింది. ఆ సమయంలో మరో ఇద్దరు విద్యార్థులు అతనితోపాటు కారులో ప్రయాణం చేస్తున్నారు.

tata harrier 2023 accident in jharkhand

ప్రమాదానికి సంబంధించిన వీడియోను ప్రతీక్‌ సింగ్‌ యూట్యూబ్‌లో షేర్‌ చేశారు. ఈ వీడియో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. అయితే హారియర్‌ ఫేస్‌లిఫ్ట్‌ భద్రతా ప్రమాణాలు, బిల్డ్‌ క్వాలిటీ కారణంగా అంత భారీ ప్రమాదంలో డ్రైవింగ్‌ సీట్లో ఉన్న విద్యార్థికి మాత్రమే చిన్నగాయాలు అయినట్లు తెలుస్తోంది. మిగిలిన ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన ఝార్ఘండ్‌లోని NH18 పైన జరిగింది.

హారియర్ ఫేస్‌లిఫ్ట్‌ (Tata Harrier Facelift) నడుపుతున్న విద్యార్థి జాతీయ రహదారి 18పైన ఉన్న టెల్మాచో వంతెన వద్ద వాహనంపై నియంత్రణ కోల్పోయారు. దీంతో SUV సమీపాన ఉన్న రైలింగ్‌ పైకి దూసుకెళ్లి, వంతెన నుంచి కిందకు పడిపోయినట్లు తెలుస్తోంది. ఫలితంగా SUV సైడ్‌, రూఫ్‌లు భారీగా డ్యామేజీ అయ్యాయి. ప్రమాదానికి ర్యాష్‌ డ్రైవింగ్‌ కారణమని తెలుస్తోంది.

tata Harrier 2023 first accident

ప్రమాద సమయంలో విద్యార్థులు మద్యం మత్తులో ఉన్నారా లేదా అనే వివరాలు వెల్లడికాలేదు. SUV బ్యారీగా డ్యామేజీ అయింది. ఫ్రంట్ బంపర్‌, డోర్లు, బానెట్‌, రూఫ్‌ భారీగా దెబ్బతింది. ప్రమాద సమయంలో టాటా హారియర్‌ SUVలో ప్రయాణం చేస్తున్న విద్యార్థులు సీట్‌బెల్ట్‌లు ధరించిన కారణంగా ఎయిర్‌బ్యాగ్‌లు సమయానికి తెరుచుకున్నాయి.

హారియర్‌ను డ్రైవింగ్‌ చేసిన విద్యార్థి లైసెన్స్‌ను కలిగి ఉండే అవకాశం లేదు. ఫలితంగా ఈ ఘటన గురించి పోలీసులకు సమాచారం అందితే.. విద్యార్థి తల్లిదండ్రులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. మరియు వాహనాన్ని స్వాధీనం చేసుకోవచ్చు. మైనర్లు డ్రైవింగ్ చేయడం భారత్‌లో చట్టవిరుద్ధం.

tata Harrier 2023 SUV lost control and fell from bridge in jharkhand

టాటా హారియర్ ఫేస్‌లిఫ్ట్‌.. లెవల్‌ 2 ADAS (అడ్వాన్సడ్‌ డ్రైవింగ్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్‌), 360 డిగ్రీ కెమెరాలు సహా అనేక భద్రతా ఫీచర్లను కలిగి ఉంది. పెద్దలు, పిల్లల భద్రతలో గ్లోబల్‌ NCAP నుంచి 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. దీంతోపాటు ఈ కారు టర్న్‌ బై టర్న్‌ నావిగేషన్‌, పనోరమిక్‌ సన్‌రూఫ్‌, డ్యూయల్‌ జోన్ క్లైమెట్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ వంటి ఫీచర్లను కలిగి ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Monday, February 5, 2024, 18:10 [IST]
English summary
Tata harrier 2023 driven by 12th class student met an accident in jharkhand
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+