130 km/h వేగంతో చెట్టును ఢీకొట్టిన టాటా హారియర్ SUV.. ప్రయాణికులను కాపాడిన ఫీచర్ ఏంటో తెలుసా..?
భారతదేశంలో జాతీయ రహదారుల పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. కానీ ఆయా రోడ్లపై జరుగుతున్న ప్రమాదాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. అందుకు అతివేగం సహా అనేక కారణాలు ఉన్నాయి. నిర్లక్ష్యపు డ్రైవింగ్, ఫోన్ వినియోగిస్తూ డ్రైవింగ్ చేయడం, లేదా అకస్మాత్తుగా రోడ్లపైకి వచ్చే జంతువులు, మనుషులు కూడా ప్రమాదాలకు కారణమే.
గతంలో ఇలాంటి కారణాలతో చాలా ప్రమాదాలు జరిగిన ఘటనలు చాలా ఉన్నాయి. భారత రోడ్లపై డ్రైవింగ్ చాలా సవాళ్లతో కూడుకున్నదని.. చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉంటారు. తాజాగా ఓ ఘటన జరిగింది. అత్యంత వేగంగా వచ్చిన టాటా హారియర్ కారు పశువులను తప్పించబోయి చెట్టును ఢీకొట్టింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

కారులో ఉన్న ప్రయాణికులు పరిస్థితి ఏంటి, ఒకవేళ ప్రయాణికులు సురక్షితంగా ఉంటే.. కారులోని ఏ ఫీచర్ వారిని కాపాడింది. అసలు కారు ఏమేరకు దెబ్బదింతి వంటి వివరాలు ఈ కథనంలో చూద్దాం. ఈ వీడియోను ప్రతీక్ సింగ్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేశారు. ఘటన ప్రాంతంలో జరిగిన ప్రమాద ఫోటోలను షేర్ చేశారు.
ఈ వీడియోలో ఎటువంటి సీసీ కెమెరా పుటేజ్‌ను లభించలేదు. యూట్యూబ్ వీడియో ప్రకారం ఈ ఘటన గుజరాత్‌లో జరిగింది. ఓ జాతీయ రహదారిపై టాటా హారియర్ SUVలో సుమారు 130 km/h వేగంతో వెళ్తుండగా.. ఎదురుగా ఓ పశువు అడ్డొచ్చింది. చూసిన డ్రైవర్... దానిని ఢీకొట్టకుండా ఉండేందుకు వాహనాన్ని పక్కకు తప్పించేందుకు ప్రయత్నించారు. అనంతరం వాహనాన్ని కంట్రోల్ చేయలేక బలంగా చెట్టుకు ఢీకొట్టారు.
ఈ ఘటనలో టాటా హారియర్ ముందు భాగం భారీగా దెబ్బతింది. SUV ముందు బంపర్, బానెట్, గ్రిల్, హెడ్‌ల్యాంప్, LED డీఆర్‌ఎల్, రేడియేటర్ దెబ్బతిన్నాయి. ప్రమాదం ధాటికి ముందు విండ్‌షీల్డ్ కూడా దెబ్బతింది. వాహనం రూఫ్ కూడా కొంచెం పాడైంది. అయితే SUV అత్యధిక ధర వేరియంట్‌కు చెందినదిగా తెలుస్తోంది. టాటా హారియర్ SUV సన్‌రూఫ్ కూడా డ్యామేజ్ అయింది. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్, ప్రయాణికుల ఎయిర్‌బ్యాగ్స్ వెంటనే తెరుకున్నట్లు సమాచారం.

అయితే SUVలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారో తెలియలేదు. అయితే ఈ వీడియో ప్రకారం కారులో ఉన్న ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారని తెలుస్తోంది. టాటా సంస్థ బిల్డ్ క్వాలిటీతో అనేక మంది వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకున్న విషయం తెలిసిందే. అనేక ప్రమాదాల్లో ఈ తరహా బిల్డ్ క్వాలిటీ కారణంగా టాటా కార్లలోని ప్రయాణికులు క్షేమంగా బయటపడిన సంఘటనలు చాలా ఉన్నాయి.
ఇక్కడ ప్రమాదానికి గురైన వాహనం టాటా హారియర్ కూడా అందులోని ప్రయాణికులను కాపాడింది. ఈ SUV యొక్క పిల్లర్లు చెక్కు చెదరకుండా ఉన్నాయి. అయితే ఈ కొత్త కారు పెద్ద ప్రమాదానికి గురవడం బాధాకరం. టాటా తన మోడళ్లయిన టియాగో, నెక్సాన్, అల్ట్రోజ్ క్రాష్ టెస్టులకు పంపింది. కానీ అధికారికంగా టాటా హారియర్, సఫారీ కార్లను క్రాష్ టెస్టులకు పంపించలేదు.
ప్రమాదానికి సంబంధించిన ఫోటోలను పరిశీలిస్తే.. బిల్డ్ క్వాలిటీ విషయంలో టాటా ఎక్కడ రాజీ పడలేదని స్పష‌్టంగా తెలుస్తోంది. ప్రస్తుతం టాటా హారియర్ ఎస్‌యూవీ ఫెస్‌లిఫ్ట్‌పై పనిచేస్తున్నట్లు సమాచారం. అయితే అనేక మార్పులతో టాటా హారియర్ వాహనం మరోసారి లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌తోపాటు 2.0 లీటర్ టర్బోఛార్జడ్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్ కూడా అందించనుందని సమాచారం.


Click it and Unblock the Notifications








