ఘోర రోడ్డు ప్రమాదం.. అయినా బతికి బట్టకట్టారు.. టాటా కార్లను కొనడానికి ఇదే నిదర్శనం
దేశంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. నిత్యం వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. వీటిని అరికట్టేందుకు తగు చర్యలు తీసుకుంటున్న ప్రయోజనం లేకుండా పోతుంది. నిద్ర, మద్యం, రాంగ్ రూట్, అధిక వేగం వంటివి రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ప్రస్తుతం రోడ్డు ప్రమాదాల్లో ప్రపంచంలోనే భారత్ ఒకటిగా ఉంది. రోజు రోజుకి ఈ సంఖ్య అధికం అవుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన లేకపోవడం రోడ్డు ప్రమాదాలకు దారీ తీస్తుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. కొందరి అలసత్వం రోడ్డు ప్రమాదాలకు దారితీస్తున్నాయని అంటున్నారు. మరోవైపు రోడ్డు ప్రమాదాల్లో మరణాలను తగ్గించేందుకు కార్ల కంపెనీలు పటిష్టంగా తయారు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా కార్ల కంపెనీలకు ఇదే విషయమై నిరంతరం విజ్ఞప్తి చేస్తోంది.
కేంద్ర ప్రభుత్వ ఈ అభ్యర్థనను బరిలోకి తీసుకుని టాటా మోటార్స్ సురక్షితమైన కార్లను అభివృద్ధి చేస్తోంది. గ్లోబల్ NCAP, భారత్ NCAP క్రాష్ టెస్టుల్లో టాటా మోటార్స్ 5కు 5 స్టార్లు సాధిస్తున్నాయి. మేడిన్ ఇండియా కార్లను గర్వపడేలా చేసింది. ఇటీవల భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో టాటా పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీ ఎలక్ట్రిక్ కార్లు 5 స్టార్లు సాధించాయి.

ఈ ఎలక్ట్రిక్ కార్ల కంటే ముందు టాటా మోటార్స్ చెందిన హారియర్, సఫారీలు భారత్ ఎన్సీఏపీలో 5 స్టార్లు సాధించాయి. భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో పరీక్షించిన మొదటి కార్లుగా టాటా హారియర్ మరియు సఫారీ రికార్డు సాధించాయి. సేఫ్టీలో టాటా హారియర్ నంబర్.1 గా ఉంది. మరోసారి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలను కాపాడి సత్తా చాటింది.
రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును టాటా హారియర్ కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హారియర్ ముందు బానెట్ భాగం పూర్తిగా ఇరుక్కుపోయింది. బానెట్ కింద ఉన్న కారు ఇంజిన్ వ్యవస్థ కూడా తీవ్రంగా దెబ్బతింది. వీడియో ప్రకారం ట్రక్కు వెనుక భాగం హారియర్ కారు యొక్క ముందు విండ్‌షీల్డ్ భాగం పూర్తిగా చొచ్చుకుపోయింది. అయితే టాటా కారు లోపల ఉన్న ప్రయాణికులందరి కాపాడింది.

ఈ ప్రమాదం భారతదేశంలోని ఏ ప్రాంతంలో జరిగిందో తెలియరాలేదు. గత ఏడాది అక్టోబర్‌లో టాటా హారియర్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ అయ్యింది. హారియర్ ఫేస్‌లిఫ్ట్‌ని గత ఏడాది డిసెంబర్‌లో భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో తొలిసారిగా పరీక్షించారు. ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కంటే ముందు హారియర్ వెర్షన్ NCAP క్రాష్ టెస్ట్‌ని ఎదుర్కోలేదు. అయితే సేఫ్టీలో ఫేస్‌లిఫ్ట్‌కి వెర్షన్‌కి నార్మల్ హారియర్‌కి మధ్య పెద్ద వ్యత్యాసం లేదు.
ఈ ప్రమాదానికి కారణం హారియర్ కారు డ్రైవర్ నిర్లక్ష్యమని తెలుస్తుంది. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ట్రక్కును కారు డ్రైవర్ గమనించకపోడంతో ఈ ప్రమాదం జరిగిందని అర్థం అవుతుంది. అయినా కానీ అందరూ సురక్షితంగా బయటపడటంతో మరోసారి టాటా క్వాలిటీ వార్తల్లో నిలిచింది. టాటా కార్ల పనితీరుని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కారు క్వాలిటీపై ఆధారపడకుండా రోడ్డుపై వెళ్లేటప్పుడు తగినంత జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








