సేఫ్టీలో మరోసారి భేష్‌ అనిపించుకున్న టాటా హారియర్‌.. ఈ యాక్సిడెంట్‌ చూస్తే చెమటలు పట్టడం ఖాయం.!!

దేశంలో టాటా కార్లకు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. లుక్‌ అండ్‌ ఫీచర్ల పరంగానే కాకుండా భద్రత పరంగా కూడా ప్రయాణికులకు గట్టి భరోసానిస్తోంది. అందుకే ఎంత ఘోర ప్రమాదాలు జరిగినా కూడా అందులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడుతున్నారు. తాజాగా మరో సంఘటనలో(Tata Harrier Accident) కూడా టాటా కారు తన బిల్ట్‌ క్వాలిటీని నిరూపించుకుంది.

మార్కెట్లో కస్టమర్లు కారు సెలెక్ట్‌ చేసుకునే విధంగా చాలా మారిపోయింది. తాము కొనుగోలు చేసే కారులో ఆధునిక అంశాలు ఉండటమే కాకుండా భద్రతా ఫీచర్లు, స్ట్రాంగ్‌ బిల్ట్‌ క్వాలిటీ ఉండేలా చూసుకుంటున్నారు. అందుకే వారి అభిరుచికి ఏ మాత్రం తగ్గకుండా ప్రముఖ దేశీ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్‌ కార్లను తయారుచేస్తోంది.

Tata-Harrier-Accident-Crashes-Between-Truck-And-Car

దేశవ్యాప్తంగా టాటా మోటార్స్‌ కార్లకు చాలా డిమాండ్‌ ఉండటమే కాకుండా ఫ్యాన్స్‌ కూడా ఉన్నారు. ఎందుకంటే పటిష్ఠమైన నిర్మాణ నాణ్యతతో వచ్చిన టాటా కార్లు అనేక సందర్భాల్లో ప్రమాదాల సమయంలో ప్రయాణికులను కాపాడి తమ బాధ్యతను చాటుకున్నాయి. టాటా ప్రీమియం వాహనం అయిన టాటా హారియర్‌ కూడా.. ఇటీవల ఓ ఘోర ప్రమాదంలో నుజ్జునుజ్జయినా కాకుండా ప్రయాణికులకు గాయాలు కాలేదు.

టాటా హారియర్‌ ఎస్‌యూవీ(Tata Harrier SUV) కారు హైవేపై రెండు వాహనాల మధ్య ఇరుక్కుపోయినా ప్రయాణికులు సురక్షితంగా బయటపడటం టాటా కార్ల నాణ్యతను చాటిచెబుతోంది. NH 44లో జరిగిన ఈ ప్రమాదం ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. బెంగళూరు- సేలం జాతీయ రహదారి 44 పై ఈ ప్రమాదం జరిగినట్లుగా వీడియో ద్వారా తెలుస్తోంది.

Tata-Harrier-Accident-Crashes-Between-Truck-And-Car

ఇటీవల టాటా హారియర్‌.. ఒక ట్రక్కు మరియు కుషాక్ SUV మధ్య ఇరుక్కుపోయి నుజ్జునుజ్జయిపోయింది. టాటా హారియర్‌ వెనుక మరియు ముందు, ఇంకా రెండు వైపులా చాలా దెబ్బతినడంతో పాటు నలిగిపోయింది. అయితే ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై స్పష్టమైన సమాచారం తెలియరాలేదు.

అయితే ముందు వెళ్తున్న స్కోడా కుషాక్ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో హారియర్ డ్రైవర్ కూడా బ్రేక్ వేసినట్లు అక్కడి స్థానికుల ద్వారా తెలుస్తోంది. ఈ సమయంలో వెనుక ఉన్న ట్రక్కు హారియర్‌ను ఢీకొట్టింది. దీంతో హారియర్‌కు ఎదురుగా ఉన్న కుషాక్‌ను ఢీకొట్టడం ద్వారా లోడ్‌తో ఉన్న ట్రక్కు మరియు కుషాక్‌ మధ్య ఇరుక్కుపోయినట్లుగా తెలుస్తోంది.

Tata-Harrier-Accident-Crashes-Between-Truck-And-Car

ప్రమాదం జరిగిన సమయంలో కారులోపల ఉన్న ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారని, ప్రాణనష్టం సంభవించలేదని సమాచారం. కానీ కారుకు మాత్రం చాలా నష్టం వాటిల్లింది. టాటా హారియర్‌ వెనుక మరియు ముందు, లైట్లు మరియు రెండు వైపులా డిజైన్ పూర్తిగా దెబ్బతింది. ఇంత ఘోర ప్రమాదంలోనూ కారు లోపల ఉన్న ప్రయాణికులు సురక్షితంగా ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

టాటా హారియర్‌ ఇంత పనితనం ప్రదర్శించడానికి కారణం దాని బిల్ట్‌ క్వాలిటీ. అత్యుత్తమ స్టాండర్డ్‌ ప్రమాణాలతో దీనిని రూపొందించారు. గ్లోబల్ NCAP క్రాష్‌ టెస్ట్‌ అడల్ట్‌ సేఫ్టీ విభాగంలో 34 పాయింట్లకు గాను టాటా హారియర్‌ ఎస్‌యూవీ 33.05 పాయింట్లను స్కోర్ చేసింది. 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించింది.

ఇక టాటా హారియర్ ఫేస్‌లిఫ్ట్ SUV ఇంజిన్ పనితీరు విషయానికొస్తే.. ఇది 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది గరిష్ఠంగా 170 hp శక్తిని మరియు 350 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. వేరియంట్ల ప్రకారం 6-స్వీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో జతచేయబడి ఉంటుంది.

ఫీచర్ల పరంగా.. ADAS, 360-డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్ మరియు మొదలైన ఆధునిక ఫీచర్లను కలిగి ఉంది. టాటా హారియర్‌ పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు కొత్త యూజర్ ఇంటర్‌ఫేస్‌తో కూడిన కొత్త టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కూడా పొందుతుంది. ఎకో, సిటీ మరియు స్పోర్ట్స్ డ్రైవింగ్ మోడ్ ఆప్షన్లను అందిస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, March 1, 2024, 18:50 [IST]
English summary
Tata harrier suv accident crashes between truck and car passengers safe
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+