మరో కొత్త వెహికల్ స్క్రాపింగ్ ప్లాంట్‌ను ప్రారంభించిన టాటా మోటార్స్
ప్రముఖ దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ దేశంలో మరో కొత్త వాహనాల స్క్రాపింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. టాటా మోటార్స్ తన 5వ రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ప్లాంట్(Registered Vehicle Scrapping Plant)ను తాజా ఢిల్లీలో ప్రారంభించింది. టాటా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరీష్ వాగ్ ప్రారంభించిన ఈ ఫ్యాక్టరీకి 'రీసైకిల్ విత్ రెస్పెక్ట్' అని పేరు పెట్టారు. షార్ట్‌కట్‌లో Re.Wi.Re అంటారు.
ఎకో ఫ్రెండ్లీకి ప్రాధాన్యతనిస్తూ టాటా మోటార్స్(Tata Motors Vehicle Scrapping Plant) కొత్త స్క్రాపింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్‌లో సంవత్సరానికి 18,000 వాహనాలను సురక్షితంగా స్క్రాప్ చేసేలా నిర్మించారు. రిజిస్టర్డ్ కార్లతో పాటు, ఫ్యాక్టరీ ట్రక్కులు మరియు బస్సుల వంటి వాణిజ్య వాహనాలను కూడా ఈ స్ర్పాపింగ్ ప్లాంట్ ధ్వంసం చేయగలదు.

అదే విధంగా ఈ ఫ్యాక్టరీలో కేవలం టాటా వాహనాలను మాత్రమే కాదు.. అన్ని బ్రాండ్‌ల వాహనాలను కూడా సరిగ్గా మరియు సురక్షితంగా ధ్వంసం చేస్తారు. జోహార్ గ్రూప్ మోటార్స్ టాటా మోటార్స్‌తో కలిసి ఈ వెహికల్ స్క్రాపింగ్ ఫ్యాక్టరీని స్థాపించింది. కాగా ఇప్పటికే టాటా మోటార్స్.. జైపూర్, భువనేశ్వర్, సూరత్ మరియు చండీగఢ్‌లలో వెహికల్ స్క్రాపింగ్ ప్లాంట్‌లను కూడా కలిగి ఉండగా.. ఢిల్లీలో కొత్తగా స్థాపించింది ఐదో ప్లాంట్.
ఢిల్లీలో టాటా మోటార్స్ స్థాపించిన ఈ ప్లాంట్ పూర్తిగా డిజిటలైజ్డ్ వెహికల్ స్క్రాపింగ్ విధానంతో ఉంటుంది. ఈ ప్లాంట్‌లో రెండు విభాగాలు ఉంటాయి. వాణిజ్య వాహనాలను స్క్రాప్ చేయడానికి ప్రత్యేక సెల్-రకం విభాగం ఉంటుంది. రెండోది కార్లు, ఆటోలు వంటి ప్యాసింజర్ వాహనాలను స్క్రాప్ చేయడానికి లైన్-రకం విభాగం. ఇది పూర్తిగా డిజిటలైజ్‌డ్ కావడంతో ఈ ప్లాంట్‌కు సంబంధించి అన్ని కార్యకలాపాలు పేపర్‌లెస్ ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తారు.

ఇక టైర్లు, బ్యాటరీలు, ఇంధనం, చమురు, ద్రవాలు మరియు వాయువులను వెలికితీసేందుకు ఫ్యాక్టరీలోని ప్రతి స్టేషన్‌కు వాహనాలను రవాణా చేస్తారు. అయితే ఇలా వాహనాలను ఎందుకు ధ్వంసం చేస్తున్నారు.. అనే డౌట్ మీకు రావచ్చు. ఏ వాహనమైనా సరే నిర్ణీత వ్యవధి సంవత్సరాలు పూర్తయిన తర్వాత పర్యావరణానికి హాని కలగకుండా ఉండేందుకు ఇలా స్క్రాపింగ్ విధానాన్ని తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం..
ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం 2021 ఆగస్టులో వెహికల్ స్క్రాపేజ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. 20 ఏళ్లు దాటిన వాణిజ్య వాహనాలు, 15 ఏళ్లు పైబడిన కార్లను ధ్వంసం చేయాలని ఈ పాలసీలో కేంద్రం పేర్కొంది. ఈ విధానం ప్రకారం, టాటా యొక్క ఈ కొత్త స్క్రాపింగ్ ఫ్యాక్టరీ పని చేస్తుంది.
నిర్ణీత వ్యవధి పైబడిన పాత వాహనాలు.. కొత్త వాటి కంటే ఎక్కువ కాలుష్య కారకాలను వెదజల్లుతున్నాయని ఒక అధ్యయనంలో వెల్లడైంది. దీంతో పర్యావరణ హితం లక్ష్యంగా.. కేంద్రం ఈ వినూత్న పథకాన్ని తీసుకువచ్చింది. వెహికల్ స్క్రాపింగ్ ప్రాజెక్ట్‌కు టాటా మోటార్స్ మద్దతు పలకడంతో అనతి కాలంలోనే ఈ సంస్థ ఐదు ప్లాంట్లను ఏర్పాటు చేసింది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








