మంటల్లో కాలిపోయిన టాటా సఫారీ కారు.. టాటా మోటార్స్‌ కీలక ప్రకటన!

ఇటీవల పంజాబ్‌ లూథియానాలో టాటా సఫారీ SUV అగ్నిప్రమాదానికి గురైంది. ఇంజిన్‌ బే, కారు ముందు భాగంలో మంటలు చెలరేగిన వీడియో అప్పట్లో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. అయితే కారులో మంటలు చెలరేగడానికి కారణం ఏంటనే ప్రశ్న తలెత్తింది. అయితే ఈ ఘటనపై టాటా మోటార్స్ సంస్థ స్పందిందింది. ఈ ఘటనపై తన పరిశోధన నివేదికను వెల్లడించింది.

గత వారం లూథియానాలో ఓ హౌసింగ్ సొసైటిలో పార్కింగ్ చేసిన ప్రాంతంలోనే గ్రే కలర్ సఫారీ ఎస్‌యూవీ అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ఘటనపై టాటా సఫారీ యజమాని గతంలోనే స్పందించారు. తాను టాప్‌ ఎండ్‌ వేరియంట్‌ను కలిగి ఉన్నట్లు చెప్పారు. టాటా డీలర్‌ ద్వారా మాత్రమే సర్వీస్ చేసినట్లు తెలిపారు. దాంతోపాటు కారులో ఎటువంటి మార్పులు చేయలేదని వెల్లడించారు.

Tata motors on safari fire accident in ludhiana

సాధారణంగా కారును కొనుగోలు చేసుకున్నాక.. కొందరు యాజమానులు వాహనాల్లో మార్పులు చేస్తారు. ఇవే కొన్నిసార్లు ప్రమాదాలకు కారణం అవుతుంటాయి. అయితే తాజా ఘటనపై టాటా మోటార్స్‌ సంస్థ దర్యాప్తు చేపట్టింది. నివేదికలోని వివరాలను వెల్లడించింది. కారులో ఎటువంటి సమస్య లేదని గుర్తించినట్లు తెలిపింది.

సరైన ప్రాంతంలో పార్కింగ్ చేయకపోవడమే అగ్నిప్రమాదానికి కారణమని టాటా మోటార్స్‌ సంస్థ తెలిపింది. వేడిగా ఉన్న సైలెన్సర్‌కు సమీపంలో ఉన్న అండర్ బాడీ ఇంజిన్‌ గార్డు పైన ఉన్న ఆకులు, పేపర్‌ కప్పులు ఈ ప్రమాదానికి కారణమని తమ దర్యాప్తులో గుర్తించినట్లు టాటా మోటార్స్‌ ప్రకటన విడుదల చేసింది. వారి కారణంగానే మంటలు అంటుకున్నట్లు పేర్కొంది.

Tata motors on safari fire accident in ludhiana

కారును సురక్షిత ప్రాంతాల్లో పార్కింగ్‌ చేయడం ఎంత ముఖ్యమో ఈ ఘటన తెలియజేస్తోంది. కొన్నిసార్లు ఎండలోనే వాహనాలను పార్కింగ్ చేయాల్సి వస్తుంది. అలాంటి సమయంలో పరిసరాలను గమనించడం కూడా ఎంతో ముఖ్యం. లేకుంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల వాహనాలను పార్కింగ్‌ చేసేముందు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుండా భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది.

టాటా సఫారీ SUV ప్రస్తుతం డీజిల్‌ ఇంజిన్‌ ఆప్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ కారు 2.0 డిజిల్‌ ఇంజిన్‌ను మాత్రమే కలిగి ఉంది ఈ కారు 6- స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌ లేదా 6- స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌లను కలిగి ఉంటుంది.

Tata motors on safari fire accident in ludhiana

ఈ ఇంజిన్‌ 3,750 rpm వద్ద 168 bhp శక్తిని, 1750-2500 rpm వద్ద 350 rpm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 15.85 లక్షలుగా (ఎక్స్‌షోరూం) ఉంది. ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌లో ఇతర ఇంజిన్ల ఆప్షన్లు వచ్చే అవకాశం ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Monday, September 25, 2023, 14:20 [IST]
English summary
Tata motors key statement on safari fire accident in ludhiana
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+