Live Video కొబ్బరిచెట్టును ఢీకొట్టిన Tata Nano కారు.. బైక్‌ రైడర్‌ తప్పించుకొనే లోపలే..!

భారత్‌లో గతంతో పోలిస్తే రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు భారీగా మెరుగుపడ్డాయి. ఇవే కొన్నిసార్లు ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. అతివేగం, నిర్లక్ష్యం కారణంగాను ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫలితంగా భారత్‌లో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కొన్ని ప్రమాదాల్లో ప్రాణనష్టం జరుగుతుండగా.. మరికొన్ని ఘటనలో తీవ్రంగా గాయపడుతున్నారు. కొన్నిసార్లు ఒకరి తప్పులకు మరొకరు బాధితులుగా మారుతున్నారు.

తాజాగా జరిగిన ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. టాటా నానో కారు (Tata Nano Car) డ్రైవర్‌ నిర్లక్ష్యం, అతివేగం కారణంగా ప్రమాదం జరిగింది. రోడ్డుపైన ఉన్న మలువు వద్ద నానో కారు డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయాడు. అనంతరం అటుగా వచ్చిన బైక్‌ను ఢీకొట్టాడు. ఈ వీడియో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.

Tata nano car loses control and hits coconut tree

అయితే ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే సమాచారం తెలియలేదు. ఈ ప్రమాదం జరుగుతున్న సమయంలో అదో రోడ్డుపైన ప్రయాణం చేస్తున్న కారులోని డ్యాష్‌ క్యామ్‌లో ఈ వీడియో రికార్డు అయింది. 20 సెకన్లపాటు ఉన్న వీడియో వైరల్‌ అవుతోంది. గ్రామీణ ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మరియు ఆ సమయంలో రోడ్డుపైన రద్దీ తక్కువగానే ఉంది.

టాటా నానో కారు నియంత్రణ కోల్పోయి అటు ఇటు తిరగడం, వాహనాన్ని నియంత్రించేందుకు డ్రైవర్ ప్రయత్నం చేయడం వీడియోలో చూడవచ్చు. అయితే సరైన సమయంలో వాహనాన్ని నియంత్రించడంతో డ్రైవర్‌ విఫలం అయ్యారు. అనంతరం రోడ్డుపక్కనున్న కొబ్బరి చెట్టును ఢీకొట్టాడు. తర్వాత వెనక్కి వచ్చిన కారు.. బైక్‌ను ఢీకొట్టింది.

Tata nano car loses control and hits coconut tree and bike

కారు నుంచి తప్పించుకొనేందుకు బైక్‌ రైడర్‌ యత్నించారు. కానీ కొబ్బరి చెట్టును ఢీకొట్టి వెనక్కి వచ్చిన టాటా నానో.. బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదం కేవలం కొన్ని సెకన్లలో జరిగిపోయింది. కారు ఢీకొట్టిన వెంటనే బైక్‌ రైడర్‌ రోడ్డుపై పడిపోయారు. అనంతరం కారు మరింత వెనక్కి రావడం చూసి.. దూరంగా వెళ్లారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు అక్కడకు చేరుకోవడం వీడియోలో గమనించవచ్చు.

ఈ వీడియో ఆధారంగా టాటా నానో కారు డ్రైవర్‌ తప్పుచేసినట్లు తెలుస్తోంది. రోడ్డు మలుపు వద్ద ఓవర్‌ టేక్‌ చేసేందుకు కొంచెం తొందరపడినట్లు కనిపిస్తోంది. సాధారణంగా టాటా నానో కార్లు సులభంగా నియంత్రణ కోల్పోతాయి. ఇక్కడ ఇదే జరిగింది. నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేసిన.. అక్కడ ఉన్న వారందరినీ ఇబ్బందులకు గురిచేశాడు.

Tata nano car drives causes accident

ఈ ప్రమాద సమయంలో చిన్న గాయాలతోనే బైక్‌ రైడర్ బయటపడినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో వాహనాల రద్దీ తక్కువగా ఉండడం కారణంగా ఇతరులు ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలగలేదు. అందువల్ల వాహనాల సామర్థ్యాన్ని బట్టి డ్రైవింగ్‌ ఉండాలి. దీంతోపాటు రోడ్డు భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటించాలి. లేకుంటే వాహనాలు దెబ్బతినడంతోపాటు తీవ్రంగా గాయపడే అవకాశం ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Saturday, October 14, 2023, 11:08 [IST]
English summary
Tata nano car crashed coconut tree during overtake and hits bike
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+