ఎదురెదురుగా ఢీకొన్న టాటా నెక్సాన్, ట్రాక్టర్.. రెండు ముక్కలైన ట్రాక్టర్.. అదే వారిని కాపాడింది..

దేశంలో తరచూ రోడ్లపై ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, నిర్లక్ష్య డ్రైవింగ్, డ్రైవింగ్‌పై అవగాహన లేకపోవడం ఇలా తరచూ ఎన్నో కారణాల వల్ల యాక్సిడెంట్లకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. వీటిపై ట్రాఫిక్ పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా ప్రమాదాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు.

అయితే దేశంలో ప్రముఖ వాహనాల తయారీదారు టాటా మోటార్స్ తమ సంస్థ తయారుచేసే వాహనాల నిర్మాణ నాణ్యతలో ది బెస్ట్‌గా నిరూపించింది. ఇటీవల టాటా కార్లు భయంకరమైన ప్రమాదాల్లోనూ ప్రయాణీకుల ప్రాణాలను కాపాడిన ఉదాహరణలను మనం సామాజిక మాధ్యమాల్లో చూసే ఉంటాం. ఇప్పుడు మరోసారి దాని నిర్మాణ నాణ్యతను నిరూపించే ఘటన జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Tata-Nexon-Breaks-Tractor

ఇటీవల బీహార్‌లో ఓ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. టాటా నెక్సాన్‌ కారు ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో ట్రాక్టర్‌ రెండు ముక్కలైంది. దీనికి సంబంధించిన వీడియో యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేశారు. అయితే వీడియోలో ప్రమాదం జరిగిన తీరును స్పష్టంగా చూపించలేదు. ప్రమాదానికి ఖచ్చితమైన కారణం వెల్లడి కానప్పటికీ, వీడియోలో ట్రాక్టర్ మరియు ట్రైలర్ రెండుగా విడిపోయి రోడ్డు పక్కన పడి ఉన్నాయి. ట్రాక్టర్ ముందు చక్రాలు పక్కకు పడిపోయి ఉన్నాయి.

ఈ ప్రమాదంలో ట్రాక్టర్ నడుపుతున్న డ్రైవర్ గాయపడ్డాడా లేదా అనే విషయం తెలియరాలేదు. ఇంత పెద్ద ప్రమాదంలో అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదం జరిగిన తీరు చూస్తే నెక్సాన్ తీవ్రంగా దెబ్బతిన్నట్లు అనిపిస్తుంది. కానీ టాటా నెక్సాన్‌లో కేవలం ఫ్రంట్ ఫెండర్, బంపర్ మరియు కుడి వైపు హెడ్‌ల్యాంప్‌లో కొంత భాగం మాత్రమే దెబ్బతిన్నాయి. రెండింటికీ జరిగిన డ్యామేజీని పరిశీలిస్తే.. ట్రాక్టర్, నెక్సాన్ వాహనాలు రెండు కుడివైపులా ఢీకొన్నట్లు కనిపిస్తోంది.

Tata-Nexon-Breaks-Tractor

రెండూ ఢీకొన్న తర్వాత ట్రాక్టర్‌ అదుపు తప్పి పడిపోవడంతో పాటు ట్రైలర్ విడిపోయినట్లుగా తెలుస్తోంది. అదృష్టవశాత్తూ, ట్రైలర్ నెక్సాన్‌ను ఢీకొట్టకపోవడంతో హెవీ డ్యామేజ్ తప్పిందనే చెప్పవచ్చు. ప్రమాదం జరిగిన సమయంలో ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకున్నాయా, లేదా ఆ సమయంలో నెక్సాన్‌లో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారు, అనే దానిపై ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.

దేశంలో రోడ్లపై ఇలాంటి సంఘటనలు జరగడం కొత్తేమీ కాదు. గతంలో భారతీయ రోడ్లపై అనేక టాటా నెక్సాన్ ప్రమాదాలు జరిగాయి. కానీ ఆశ్చర్యమేమంటే ఇప్పటివరకు ప్రాణనష్టం జరగకపోవడం కారు నిర్మాణ నాణ్యతకు నిదర్శనం. నెక్సాన్ మాత్రమే కాదు టాటా బ్రాండ్ యొక్క అన్ని కార్లు మంచి నిర్మాణ నాణ్యతను కలిగి ఉన్నాయి. ప్రయాణికులకు హై సేఫ్టీని ఇస్తుంది.

Tata-Nexon-Breaks-Tractor

కారును కొనుగోలు చేసేటప్పుడు చాలా మంది కొనుగోలుదారులకు ఇప్పుడు వాహన నిర్మాణ నాణ్యత చాలా ముఖ్యమైన అంశం. టాటా నెక్సాన్ గ్లోబల్ NCAPక్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్‌ను పొందింది. దాని విభాగంలో ఇది సురక్షితమైన వాహనాల్లో ఒకటిగా నిలిచింది. టాటా ప్రస్తుతం నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్‌ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. రాబోయే SUV అనేక పరీక్షలను ఫేస్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇందులో కొత్త టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కొత్త హెడ్‌ల్యాంప్‌లు, స్టీరింగ్ వీల్‌పై షైనింగ్ లోగో, ఫ్రంట్ గ్రిల్ వంటి అనేక మార్పులను ఈ కారులో ప్రవేశపెట్టాలని కంపెనీ భావిస్తోంది. రాబోయే నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ కోసం DCT ట్రాన్స్‌మిషన్ ఎంపికను అందించాలని టాటా యోచిస్తోంది. టాటా కొత్త 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌ని పరిచయం చేసే అవకాశం ఉంది.

Tata-Nexon-Breaks-Tractor

నిర్లక్ష్యపు డ్రైవింగ్ తరచుగా దేశంలో ఈ తరహాప్రమాదాలకు దారితీస్తుంది. రోడ్డుకు రాంగ్ సైడ్‌లో వెళ్లే ద్విచక్రవాహనదారులు, సరిగ్గా పార్కింగ్ చేయని వాహనాలు, జాయ్‌వాకర్లు
ఇంకా విచ్చలవిడి జంతువులు కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు వాహనదారులు అప్రమత్తంగా, ఏకాగ్రతతో డ్రైవింగ్ చేయాలి.

More from DriveSpark

Article Published On: Saturday, August 19, 2023, 18:33 [IST]
English summary
Tata nexon and tractor collided tractor breaks into two pieces video gone viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+