70 కి.మీ వేగంతో ఎద్దును ఢీకొట్టిన టాటా నెక్సాన్.. డ్యాష్ బోర్డు కెమెరాలో రికార్డయిన యాక్సిడెంట్ విజువల్స్
దేశంలో రహదారులపై నిత్యం ఏదో ఒకచోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. సీసీ కెమెరాల ద్వారా యాక్సిడెంట్ జరిగిన తీరును మనం తెలుసుకుంటున్నాం. కార్లలో ప్రవేశపెట్టిన డ్యాష్ బోర్డు కెమెరా ద్వారా కూడా ప్రమాదం తీరు మనకు తెలుస్తోంది. ఇటీవల ఓ ప్రమాదం డ్యాష్ బోర్డు కెమెరాలో రికార్డు కావడంతో వైరల్‌గా మారింది.
రహదారులపై వాహనాలు ఢీకొనడం ద్వారా జరిగే ప్రమాదం ఒక ఎత్తయితే.. రోడ్లపై సంచరించే జంతువుల ద్వారా కూడా అధిక సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల ద్వారా వాహనాలకు తీవ్రంగా నష్టం జరుగుతోంది. తాజాగా టాటా నెక్సాన్ కారు అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చిన ఎద్దును ఢీకొట్టింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రమాద దృశ్యాలు టాటా నెక్సాన్ డ్యాష్‌బోర్డ్ కెమెరాలో రికార్డయ్యాయి. కారు రాత్రిపూట సింగిల్ లేన్‌లో బాగా వెలుతురు ఉన్న రహదారిపై ప్రయాణిస్తోంది. ఇటీవలే రోడ్డును రీసర్వేషన్ కూడా చేశారు. టాటా నెక్సాన్ ముందుకు సాగుతుండగా ఒక ఎద్దు అకస్మాత్తుగా రోడ్డు మధ్యలోకి వచ్చింది. అప్పటికే 70 కి.మీ వేగంతో కారు వస్తుండగా.. అనుకోని సంఘటనతో డ్రైవర్ వేగాన్ని తగ్గించలేక ఎద్దును ఢీకొట్టాడు.
70 కి.మీ వేగంతో కారు ఎద్దును ఢీకొనడంతో అది కిందపడిపోయింది. ఎద్దుకు కొద్దిపాటి గాయాలు అయినట్లు వీడియో ద్వారా తెలుస్తోంది. ఘటనలో టాటా నెక్సాన్ ముందు భాగం డ్యామేజ్ అయింది. కారు హుడ్ పూర్తిగా ధ్వంసం కావడంతో పాటు ముందు భాగం నుజ్జునుజ్జయింది. రేడియేటర్ కూడా పాడైపోయినట్లు వీడియో ద్వారా తెలుస్తోంది. అదృష్టమేమిటంటో కారులోని ప్రయాణీకులకు ఎటువంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు.

ఈ సంఘటన దేశంలోని రహదారులపై విచ్చలవిడిగా సంచరించే జంతువుల వల్ల కలిగే నష్టాలను తెలుపుతుంది. అలాంటి ప్రాంతాల్లో డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని సూచిస్తుంది. రోడ్లపై జంతువల సంచారం తీవ్రమైన ఆందోళనగా మిగిలిపోయింది. ఈ సమస్యను పరిష్కరించడానికి అధికారులు పెద్దగా చర్యలు తీసుకోవడం లేదు.
గతంలో, ఉత్తరప్రదేశ్‌లో అధికారులు రాత్రిపూట వాటి దృశ్యమానతను మెరుగుపరచడానికి పశువులు, జంతువుల కొమ్ములకు హై రిఫ్లెక్టివ్ టేపులను అతికించారు. దీంతో వాహనాలు వాటిని గుర్తించే అవకాశం ఉంది. కానీ రహదారి ప్రమాదాన్ని తొలగించడానికి ఇప్పటి వరకు అవసరమైన చర్యలు తీసుకోకపోవడం బాధాకరం.

దేశంలో రోడ్లపై డ్రైవింగ్ చేసేటప్పుడు భద్రతను నిర్ధారించడానికి, డ్రైవర్లు డిఫెన్సివ్ డ్రైవింగ్ విధానాన్ని అవలంబించడం, ఓవర్‌టేక్ చేసేటప్పుడు జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. ఓవర్‌టేకింగ్ చేసేటప్పుడు రహదారిని క్షుణ్ణంగా అంచనా వేసి భద్రతను నిర్ధారించడం చాలా అవసరం. అనేక ప్రమాదాలు నిర్లక్ష్యపు ఓవర్‌టేకింగ్ ద్వారానే జరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
2021లో నిర్వహించిన గ్లోబల్ NCAP క్రాష్ పరీక్షల సమయంలో, టాటా నెక్సాన్ అసాధారణమైన భద్రతా పనితీరును ప్రదర్శించింది. వయోజన ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ కోసం 17కి 16.45 స్కోర్‌ను సంపాదించింది. ఈ విజయంతో ప్రస్తుతం భారతదేశంలో తయారు చేయబడిన అత్యంత సురక్షితమైన కారుగా నెక్సాన్ పేరు గాంచింది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








