సేఫ్టీలో మళ్ళీ తనకు తానే సాటిగా నిలిచిన Tata Nexon.. ప్రమాదంలో నుజ్జు నుజ్జు అయినా ప్రయాణికులు సేఫ్

భారతదేశంలో అత్యంత సురక్షితమైన కార్ల తయారీ సంస్థల్లో ఒకటి 'టాటా మోటార్స్'. టాటా మోటార్స్ యొక్క 'నెక్సాన్' (Nexon) దేశీయ మార్కెట్లో మొట్టమొదటి 5 స్టార్ రేటింగ్ పొందిన కారు.

ఇప్పటికే ఈ కారు (టాటా నెక్సాన్) చాలా ప్రమాదాల నుంచి ప్రయాణికులను కాపాడింది. దీనికి సంబంధించిన సంఘటనలు గతంలో కూడా చాలానే వెల్లడయ్యాయి, కాగా ఇప్పుడు కూడా ఇలాంటి సంఘటనే మళ్లీ వెలుగులోకి వచ్చింది.

సేఫ్టీలో మళ్ళీ తనకు తానే సాటిగా నిలిచిన Tata Nexon

నివేదికల ప్రకారం, ఈ సంఘటన మహారాష్ట్రలో జరిగింది. ఈ సంఘటనలో టాటా నెక్సాన్ కారు దాదాపు నుజ్జునుజ్జు అయిపోయింది. అయినప్పటికీ అందులోని ప్రయాణికులు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. నిజానికి ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలను చూస్తే తప్పకుండా అందరూ భయానికి గురవుతారు, ఇంత పెద్ద ప్రమాదానికి గురైనప్పటకి అందులోని ప్రయాణికులు బయటపడటం అనేది గొప్ప విషయం.

టాటా నెక్సాన్ (Tata Nexon) భద్రతలో తిరుగులేని కారుగా మళ్ళీ ఒక సారి నిరూపించుకుంది. ఈ ఘనత మొత్తమ్ టాటా మోటార్స్ వారికే చెందుతుంది. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఆ సమయంలో కూడా అందులోని ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు.

Tata Nexon

అసలు విషయానికి వస్తే, ఈ సంఘటన జరిగినప్పుడు నాలుగురు కుటుంభ సభ్యులు హైవేపైన వేగంగా ప్రయాణిస్తున్నారు. వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో టర్న్ తీసుకోవాల్సి వచ్చింది, ఆ సమయంలో కారు డ్రైవ్ చేసే వ్యక్తి కారుని ఆ టర్నింగ్ లో కంట్రోల్ చేయలేకపోయాడు. ఈ కారణంగానే కారు బోల్తాపడిపోయింది.

ప్రమాదానికి గురైన టాటా నెక్సాన్ ముందు భాగం చాలా వరకు దెబ్బతినింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ఇక్కడ చూడవచ్చు. ఈ ఘటనలో ప్రయాణికులకు కొన్ని గాయాలయ్యాయి, వారందరిని ప్రధమ చికిత్స కోసం స్థానిక హాస్పిటల్ లో చేర్పించారు. కానీ ఎవరికీ ఎటువంటి తీవ్రమైన గాయాలు కాలేదు.

ప్రమాదంలో కారులోని ఎయిర్ బ్యాగులు ఓపెన్ కావడం వల్ల ముందు ప్రయాణికులకు ఎటువంటి పెద్ద గాయాలు కాలేదు. అయితే ఇందులో ప్రయాణిస్తున్న అందరు ప్రయాణికులు సీట్ బెల్ట్ ధరించరా..? లేదా అనేది ఖచ్చితంగా తెలియదు. మొత్తానికి ఎవరికీ పెద్ద గాయాలు కాలేదు.

2016 లో టాటా నెక్సాన్ క్రాష్ టెస్ట్ లో 4 స్టార్ రేటింగ్ పొందింది. ఆ తరువాత మరింత భద్రతను కల్పించాలని కంపెనీ ఇందులో కూడా కొన్ని అప్డేట్స్ తీసుకురావడం జరిగింది. ఆ తరువాత జరిగిన క్రాష్ టెస్ట్ లో ఇది ఏకంగా 5 స్టార్ రేటింగ్ సాధించి అత్యంత సురక్షితమైన కారుగా మార్కెట్లో రికార్డ్ బద్దలు కొట్టింది. ఇప్పటికి కూడా సేఫ్టీలో టాటా నెక్సాన్ అగ్రగామిగానే ఉంది.

మొదట టాటా నెక్సాన్ సేఫ్టీలో మొత్తమ్ 17 పాయింట్లకు గాను 16.06 పాయింట్లను సంపాదించి బెస్ట్ సేఫ్టీ కార్ల జాబితాలో చేరింది. ఆ తరువాత 2018 లో చేసిన క్రాస్ టెస్ట్ లో ఇది మరింత మంచి స్కోర్ సాధించింది. సేఫ్టీలో అత్యధిక భద్రతా ఫీచర్స్ కలిగి ఉన్న కారణంగా ఈ కారుని ఎక్కువమంది కొనుగోలుదారులు కొనుగోలు చేస్తున్నారు.

నిజానికి SUV లను సాధారణ ప్రయాణానికి మాత్రమే వినియోగించాలి, అయితే హై స్పీడ్ వద్ద ప్రయాణించడానికి దానికి తగిన కార్లనే వినియోగించాలి. ఎందుకంటే SUV లు హై స్పీడ్ వద్ద లేన్ లను షిఫ్టింగ్ చేయడం లేదా అధిక వేగంతో టర్న్ తీసుకోవడం వల్ల డ్రైవర్ కంట్రోల్ చేయలేకపోవచ్చు. ఈ కారణంగా ప్రమాదాలు ఎదురవుతాయి.

Most Read Articles

English summary
Tata nexon car met with accident in maharashtra build quality saved 4 people details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X