అతివేగంతో బోల్తాపడిన Tata Nexon కారు.. ప్రయాణికులను కాపాడిన ఫీచర్‌ ఇదే..!

భారత్‌లో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా ఉంటోంది. ఇందుకు అతివేగం, నిర్లక్ష్యమైన డ్రైవింగ్ సహా మరెన్నో కారణాలు ఉన్నాయి. తాజాగా చత్తీస్‌గఢ్‌లో కారు ప్రమాదం జరిగింది. Tata Nexon కారు నియంత్రణ కోల్పోయింది. అనంతరం అనేకసార్లు బోల్తా పడింది. కారు ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తోంది.

ఈ వీడియోను నిఖిల్‌ రానా తన యూట్యూబ్‌లో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది. ఛత్తీస్‌గడ్‌లోని NH43 బైకుంత్‌పూర్‌ రోడ్‌ రైల్వేస్టేషన్‌ పరిధిలో ప్రమాదం జరిగింది. వీడియో ఆధారంగా అతివేగంగా ప్రయాణిస్తున్న టాటా నెక్సాన్‌ కారు అదుపు తప్పింది. అనంతరం రోడ్డు నుంచి జారిపడి.. అనేకసార్లు బోల్తా పడింది. అయితే కారులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారని సమాచారం.

Tata Nexon car rollsover

వర్షం కారణంగా రోడ్డు తడిగా ఉన్నట్లు తెలుస్తోంది. అయినా నెక్సాన్‌ డ్రైవర్‌ అతివేగంగా కారును నడపడం కారణంగా నియంత్రణ కోల్పోయింది. రోడ్డుపై నుంచి పక్కకు దూసుకెళ్లి, బోల్తా పడింది. అయితే ఆ సమయంలో సమీపంలో వాహనాలు లేకపోవడంతో ఇతర వాహనాలను ఢీకొట్టలేదు.

ఈ ప్రమాదంలో కారు బానెట్‌, రూఫ్‌, డోర్లు, టెయిల్‌గేట్‌ సహా భారీగా డ్యామేజీ అయింది. ముందు, వెనుక ఉన్న విండ్‌ షీల్డులు కూడా దెబ్బతిన్నాయి. అయితే టాటా సంస్థ బిల్ట్‌ క్వాలిటీ కారణంగా ప్రయాణికులు సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది. వీడియో ఆధారంగా కారు క్యాబిన్‌లో భారీ డ్యామేజీ కాలేదు. ప్రమాదం అనంతరం క్రేన్ సాయంతో కారును బయటకు తీశారు.

Tata Nexon car rollsover

ఈ ప్రమాదంతో టాటా కార్ల బిల్ట్‌ క్వాలిటి (Tata Build Quality) మరోసారి వార్తల్లో నిలిచింది. కారు అనేకసార్లు బోల్తాపడినా.. పిల్లర్లు చెక్కుచెదరలేదు. క్యాబిన్‌ భారీగా డ్యామేజీ కాలేదు. ఈ కారు నెక్సాన్‌ తొలి వెర్షన్‌గా తెలుస్తోంది. ఈ కారు గ్లోబల్‌ NCAPలో నెక్సాన్ మెరుగైన రేటింగ్‌ను కలిగి ఉంది. ప్రస్తుతం నెక్సాన్ 2023 వెర్షన్‌ విడుదల అయింది. డెలివరీలు కూడా ప్రారంభం అయ్యాయి.

డ్రైవర్‌ అతివేగం కారణంగానే ప్రమాదానికి కారణం అని తెలుస్తోంది. రోడ్డు తడిగా ఉన్నా.. వాహనాన్ని అతివేగంగా నడిపినట్లు తెలుస్తోంది. తడిరోడ్లపై ప్రయాణం చేస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ప్రవర్తించాలో ఈ ఘటన మంచి ఉదాహరణ. ఇలాంటి రోడ్లపై ఆక్వాప్లానింగ్‌కు ఎక్కువ అవకాశాలు ఉంటాయి.

Tata Nexon car rollsover

ఎప్పుడైనా వర్షం కురుస్తున్న సమయంలో డ్రైవింగ్‌ చేయాల్సి వస్తే.. ఆ రోడ్లపై అనుమతించిన వేగం కంటే 50 శాతం తక్కువ వేగంతోనే ప్రయాణం చేయడం సురక్షితం. మరియు ఇలాంటి రోడ్లపై ప్రమాదాలకు టైర్ల పరిస్థితి కూడా కారణంగా కావచ్చు. టైర్లు త్రెడ్డింగ్‌ సరిగా లేకున్నా బ్రేకింగ్‌కు ఎక్కువ సమయం తీసుకుంటాయి. ఫలితంగా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Saturday, September 30, 2023, 14:01 [IST]
English summary
Tata nexon car rollsover due to high speed tata build quality saves lives
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+