టాటా నెక్సాన్ లోపల బెడ్‌రూమ్.. ఇదేంటనుకుంటున్నారా.. అయితే ఇది చూడండి

టాటా నెక్సాన్ టాటా మోటార్స్ కంపెనీ యొక్క ప్రసిద్ధ ఎస్‌యూవీ. అది మాత్రమే కాదు భారతదేశంలో అత్యంత సురక్షితమైన మోడళ్లలో ఒకటి. ఇటీవల ఒక వ్యక్తి తన టాటా నెక్సాన్ కారు వెనుక భాగాన్ని ట్రిప్‌కు వెళ్ళేటప్పుడు తమకు అనుకూలంగా ఉండే విధంగా ఒక బెడ్‌రూమ్‌గా మార్చారు. ఈ విధంగా అమర్చడం వల్ల ఈ నెక్సాన్ చాలా ఆకర్షణీయంగా మరియు సౌకర్యవంతంగా కనిపిస్తుంది.

టాటా నెక్సాన్ లోపల బెడ్ రూమ్.. ఇదేంటనుకుంటున్నారా.. అయితే ఇది చూడండి

ఇటీవల కాలంలో చాలా వరకు తమ వాహనాలను వాహనదారులు తమకు నచ్చినట్లు మార్చుకున్న సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు టాటా నెక్సాన్ కారు బెడ్ రూమ్ గా మారింది.

టాటా నెక్సాన్ లోపల బెడ్ రూమ్.. ఇదేంటనుకుంటున్నారా.. అయితే ఇది చూడండి

టాటా నెక్సాన్ సబ్ 4 మీటర్ ఎస్‌యూవీ. ఈ ఎస్‌యూవీ దేశీయ మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. టాటా నెక్సాన్ సౌకర్యవంతమైన, సురక్షితమైన మరియు శక్తివంతమైన కారు కావడంతో, చాలా మంది కస్టమర్లు ఇప్పుడు దీనిని ఉపయోగించడానికి ఆసక్తి కనపరుస్తున్నారు.

MOST READ:పరువునష్టం కేసులో ఓడిపోయిన ఎలోన్ మస్క్ ; వివరాలు

టాటా నెక్సాన్ లోపల బెడ్ రూమ్.. ఇదేంటనుకుంటున్నారా.. అయితే ఇది చూడండి

ఇటీవల వెలువడిన ఒక వీడియోలో, ఇందులో రాహుల్ చౌదరి అనే వ్యక్తి యాత్రకు వెళ్ళడానికి నెక్సాన్‌లో చాలా మార్పులు చేసాడు. వారు బయటి భాగంలో కొన్ని సాధారణ మార్పులు చేసారు, తద్వారా దాని వెనుక భాగాన్ని మంచంగా మార్చాడు. దీని కోసం అతడు వెనుక సీటు యొక్క బేస్ను ఎత్తివేసి, సీటును పూర్తిగా మడిచి, ఆ తరువాత దుప్పట్లు వేస్తాడు.

టాటా నెక్సాన్ లోపల బెడ్ రూమ్.. ఇదేంటనుకుంటున్నారా.. అయితే ఇది చూడండి

వెనుక సీటు మడతపెట్టడానికి అనుకూలంగా తయారుకావడం వల్ల, వెనుక భాగంలో చాలా స్థలం మిగులుతుంది. ఈ కారణంగా అక్కడ తుప్పట్లు పరుచుకోవడానికి అనుకూలంగా మారింది. ఈ స్థలంలో ఇద్దరు వ్యక్తులు లోపల నిద్రించడానికి తగినంత స్థలం ఉంది. రాత్రి సమయంలో మరింత ఆకర్షణీయంగా ఉండటానికి, వారు లోపల అద్భుత లైట్లను కూడా ఏర్పాటు చేశారు, వీటిని పవర్ బ్యాంక్‌కు అనుసంధానించారు.

MOST READ:కార్ రిపేర్ ఫీజు రూ. 9,900, పార్కింగ్ ఫీజు రూ. 91,000.. ఇది కోర్టు తీర్పు.. ఎందుకో మీరే చూడండి

అతను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఉదయం ఈ పవర్ బ్యాంకును తీసివేస్తాడు. దీనితో పాటు, వాటర్ బాటిల్ మరియు మొబైల్‌ను డోర్ హ్యాండిల్‌లో ఉంచడానికి తగినంత స్థలం ఉంది. రాత్రి సమయంలో వెంటిలేషన్ కోసం కిటికీలు కొద్దిగా ఓపెన్ చేయవచ్చు. ఈ మొత్తం సెటప్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

టాటా నెక్సాన్ లోపల బెడ్ రూమ్.. ఇదేంటనుకుంటున్నారా.. అయితే ఇది చూడండి

అయితే, మీకు లగేజ్ ఎక్కువ లేకపోవడం చాలామంచిది. లేకపోతే వెనుక భాగంలో లగేజ్ ఉంటె ఈ విధంగా సౌకర్యవంతంగా చేసుకోవడం కష్టం. నెక్సాన్ కొత్త అవతార్‌లో ప్రవేశపెట్టినప్పటి నుండి వినియోగదారుల నుండి మంచి స్పందన వస్తోంది. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఎంపికలలో, అలాగే మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ల ఎంపికలో కూడా అందుబాటులో ఉంది.

MOST READ:వామ్మో.. పెట్రోల్ బంకులో ఇంత మోసమా.. మీరే చూడండి

Image Courtesy: Rahul Choudhary

Most Read Articles

English summary
Tata Nexon Converted As A Bedroom. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X