Just In
- 1 hr ago
3 కి.మీ ట్రక్కుని రివర్స్ గేర్‌లో నడిపిన డ్రైవర్.. ఎందుకనుకుంటున్నారా, అయితే ఇది చూడండి
- 1 hr ago
దేశంలోనే అతిపెద్ద మల్టీ-బ్రాండ్ కార్ సర్వీస్ సెంటర్‌ను ఓపెన్ చేసిన బాష్
- 2 hrs ago
టీవీఎస్ ఎక్స్ఎల్ 100 విన్నర్ ఎడిషన్ లాంచ్ : ధర & వివరాలు
- 16 hrs ago
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
Don't Miss
- News
నాన్సీ ల్యాప్‌టాప్ చోరీ? రష్యా ఇంటలిజెన్స్‌కు చేరవేసే ప్లాన్.. ఎఫ్‌బీఐ అఫిడవిట్లో సంచలనాలు..
- Sports
వికెట్ కీపర్‌గా పంత్ అరుదైన రికార్డు.. ధోనీ కన్నా వేగంగా!!
- Finance
Gold prices today : స్థిరంగా బంగారం ధరలు, వెండి ధరలు జంప్
- Lifestyle
మీరు ఎప్పుడూ ఎందుకు అలసిపోతున్నారు?అందుకు సాధారణ కారణాలు ఇక్కడ ఉన్నాయి..
- Movies
Master box office: 6వ రోజు కూడా పవర్ఫుల్ కలెక్షన్స్.. విజయ్ మరో బిగ్గెస్ట్ రికార్డ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసిన కేరళ ప్రభుత్వం.. ఎందుకో తెలుసా ?
భారత మార్కెట్లో టాటా మోటార్స్ యొక్క నెక్సాన్ చౌకైన ఎలక్ట్రిక్ కారు అని గొప్పగా చెప్పుకుంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారును కేరళ ప్రభుత్వం అనేక విభాగాల ఉపయోగం కోసం కొనుగోలు చేసింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 45 యూనిట్ల టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసింది. టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కార్లను అప్పగించే కార్యక్రమం గత నెల తిరువనంతపురంలో జరిగింది. ఇప్పుడు నెక్సాన్ ఈవి కారును కేరళ రాష్ట్రంలో చాలా మంది అధికారులు ఉపయోగిస్తున్నారు.

కేరళ రాష్ట్రంలో ఇంతకు ముందు టయోటా ఇన్నోవా, మహీంద్రా బొలెరో, సుజుకి జిప్సీ కార్లను ఉపయోగించిన అధికారులు ఇప్పుడు టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారును ఉపయోగిస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ కారులో కొత్త తరం కారుకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఉన్నాయి.
MOST READ:మోటో గుజ్జి వి7 మోటార్‌సైకిల్ ఆవిష్కరణ; సరికొత్త ఫీచర్లు, వివరాలు

ఈ కారు కేరళ ప్రభుత్వ అధికారులకు ఏమి చేయదలచారో అని చూపించే వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. అధికారులు ఈ కారులో రోజుకు కనీసం 8 గంటలు ప్రయాణం చేస్తారు. అంటే అధికారులు ఆఫీసులో కంటే నెక్సాన్ కారులో ఎక్కువ సమయం గడుపుతారు.

నెక్సాన్ ఈవి క్లచ్ లేని ఆటోమేటిక్ కారు. కారును నడిపిన పోలీసు అధికారుల ప్రకారం, ఎక్కువ డ్రైవ్ చేయవలసిన అవసరం లేదు. టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారు స్టాండర్డ్ కారు మాదిరిగానే ఉంటుం. ఈ కారులో అధికారులు రోజుకు సగటున 75 నుండి 100 కి.మీ ప్రయాణిస్తారు.
MOST READ:నిజంగా ఈ బైకర్స్ అదృష్టవంతులే సుమీ.. ఎందుకో వీడియో చూడండి

ఈ కారులో ప్రయాణించడానికి ఎక్కువ ఖర్చు అవుతుందనే భయం లేదు. ఈ కారులో 30.2 కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీ అమర్చారు. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ చేయబడిన తరువాత దాదాపు 312 కి.మీ ప్రయాణించగల సామర్త్యాన్ని కలిగి ఉంటుంది.

ఈ కారులో ప్రయాణించిన ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ, ఈ కారు ప్రజల దృష్టిని ఎంతగానో ఆకర్షించింది. దీనికి కారణం ఏమిటంటే, నెక్సాన్ ఈవి కారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది ప్రజల దృష్టిని ఆకర్శించడంలో ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
MOST READ:గురుగ్రామ్‌లో 55 శాతం తగ్గిన ట్రాఫిక్ ఫైన్స్.. దీనికి కారణం ఇదే

టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారులో అమర్చిన ఎలక్ట్రిక్ మోటారు 127 బిహెచ్‌పి మరియు 245 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారును జిప్‌ట్రాన్ టెక్నాలజీ అందిస్తోంది. నెక్సాన్ ఎలక్ట్రిక్ కారు ఎక్స్ఎమ్, ఎక్స్ఎమ్ ప్లస్ మరియు ఎక్స్‌జెడ్ ప్లస్ మోడళ్లలో విక్రయించబడుతోంది. నెక్సాన్ ఎలక్ట్రిక్ కారు ధర ఎక్స్ షోరూమ్ ప్రకారం సుమారు రూ. 13.99 లక్షలు.

టాటా మోటార్స్ నుండి వచ్చిన ఈ నెక్సాన్ ఎలక్ట్రిక్ కారు దేశీయ మార్కెట్లో ఎంజిజెడ్ మరియు హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కార్లకు ప్రత్యర్థిగా ఉంటుంది. రోజు రోజుకి ఎలెక్ట్రిక్ కార్లకు డిమాండ్ ఎక్కువగా పెరుగుతోంది. ఈ క్రమంలో కేరళ ప్రభుత్వం ఈ ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసింది.
Image Courtesy: Motorhead Girl