భళా Tata Nexon; 1,900 కిమీ ప్రయాణానికి కేవలం రూ. 2,000 ఖర్చు

భారతీయ మార్కెట్లో రోజురోజుకి ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. అయితే ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించకపోవడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి. ఇందులో ఒకటి ఎలక్ట్రిక్ వాహనాలకు తగినన్ని ఛార్జింగ్ స్టేషన్స్ అందుబాటులో లేకుండా పోవడం మరియు ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువ దూరం ప్రయాణించడానికి అనుకూలంగా ఉండదు అనే అపోహ, ఇవి చాలా మంది వాహన వినియోగారులలో ఉంది.

భళా Tata Nexon; 1,900 కిమీ ప్రయాణానికి కేవలం రూ. 2,000 ఖర్చు

అయితే ప్రస్తుత కాలంలో అందుబాటులో ఉన్న కొన్ని ఎలక్ట్రిక్ కార్లు ఒక చార్జితో తక్కువ పరిధిని మాత్రమే అందిస్తాయి. కానీ కొన్ని ఎక్కువ పరిధిని అందించే హై రేంజ్ ఎలక్ట్రిక్ వాహనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. దీనితో పాటు ఎలక్ట్రిక్ వాహనాలకు కావాల్సిన ఛార్జింగ్ స్టేషన్స్ సంఖ్య కూడా క్రమంగా పెరుగుతున్నాయి. రానున్న కాలంలో ప్రస్తుతం పెట్రోల్ బ్యాంకులు ఏ విధంగా ఉన్నాయో ఆ రీతిలో ఛార్జింగ్ స్టేషన్స్ అందుబటులోకి రానున్నాయి, అనటంలో ఎటువంటి సందేహం లేదు.

భళా Tata Nexon; 1,900 కిమీ ప్రయాణానికి కేవలం రూ. 2,000 ఖర్చు

ఇదిలా ఉండగా ఇటీవల 'ఆంజనేయ్ సైని' అనే వ్యక్తి తన Tata Nexon కారులో దేశ రాజధాని నగరం ఢిల్లీ నుంచి హిమాచల్ ప్రదేశ్ లోని గాజాకు ప్రయాణించాడు. ఆంజనేయ్ సైని తన ఇద్దరి స్నేహితులతో కలిసి గాజా ప్రయాణం ప్రారంభించాడు. ఈ పర్యటన ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

భళా Tata Nexon; 1,900 కిమీ ప్రయాణానికి కేవలం రూ. 2,000 ఖర్చు

'ఆంజనేయ్ సైని' తన Tata Nexon ఎలక్ట్రిక్ కారును కర్నల్, నార్కండ, జాబ్లి, రేకాంగ్ పియో మరియు చాంగో వంటి కొన్ని ప్రదేశాలలో ఛార్జ్ చేసాడు. దేశంలో ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య పెరుగుతున్న సమయంలో సైనీ మరియు ఆమె స్నేహితులు ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. అతడు మొత్తం 1,900 కిమీ ప్రయాణించాడు.

భళా Tata Nexon; 1,900 కిమీ ప్రయాణానికి కేవలం రూ. 2,000 ఖర్చు

మొత్తం 1,900 కిలోమీటర్లు ప్రయాణించడానికి కేవం 2,000 రూపాయలు మాత్రమే కహ్హ్ర్చు చేసినట్లు తెలిసింది. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. ఈ ధరను పరిశీలించినట్లయితే 1,900 కిలోమీటర్లు ప్రయాణించడానికి అంటే ఒక కిలోమీటరు ప్రయాణించడానికి కేవలం 01 రూపాయి మాత్రమే ఖర్చు అయినట్లు తెలుస్తుంది.

భళా Tata Nexon; 1,900 కిమీ ప్రయాణానికి కేవలం రూ. 2,000 ఖర్చు

1,900 కిలోమీటర్లు ప్రయాణించడానికి ఒక వేళా పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలైతే ఈ ఖర్చు మరింత ఎక్కువగా ఉండేది. ఆ విషయం ప్రస్తుతం వాహన వినియోగదారులందరికీ తెలుసు. ప్రయాణానికి ముందు, తాను మరియు అతని స్నేహితులు సమీపంలో ఉండే హోటల్స్ మరియు ఛార్జింగ్ స్టేషన్స్ గురించి ఆరా తీశారు. దీని కోసం యాప్ లను ఉపయోగించారు. మొత్తానికి 1,900 కిలోమీటర్లు కేవలం 2,000 రూపాయల్లో ప్రయాణించారు.

భళా Tata Nexon; 1,900 కిమీ ప్రయాణానికి కేవలం రూ. 2,000 ఖర్చు

Tata Motors యొక్క Tata Nexon విషయానికి వస్తే, ఇది భారతదేశంలో ఎక్కువగా విక్రయించబడిన ఎలక్ట్రిక్ కారు. ఇది Ziptron టెక్నాలజీపై ఆధారపడిన మొట్టమొదటి వాహనం. భారతదేశంలో ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో, నెక్సాన్ EV 6.8%పైగా మార్కెట్ వాటాను పొందింది.

భళా Tata Nexon; 1,900 కిమీ ప్రయాణానికి కేవలం రూ. 2,000 ఖర్చు

Tata Nexon ఎలక్ట్రిక్ కారులో ఆటోమేటిక్ క్లెయిమ్ కంట్రోల్, సన్‌రూఫ్, రెయిన్ సెన్సింగ్, ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్, ఆల్ పవర్ విండోస్, కీలెస్ ఎంట్రీ అండ్ గో, కూల్ గ్లోవ్ బాక్స్, హ్యాండ్స్ ఫ్రీ టెయిల్‌గేట్, ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు మరియు ఎల్‌ఈడీ టెయిల్‌ల్యాంప్స్ వంటివి ఉన్నాయి.

భళా Tata Nexon; 1,900 కిమీ ప్రయాణానికి కేవలం రూ. 2,000 ఖర్చు

Tata Nexon లో మంచి సేఫ్టీ ఫీచర్స్ కూడా అన్హుబాటులో ఉన్నాయి. ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్, ఎబిఎస్ విత్ ఇబిడి, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ సిస్టమ్, రియర్ పార్కింగ్ కెమెరా మరియు ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ వంటివి ఉన్నాయి.

భళా Tata Nexon; 1,900 కిమీ ప్రయాణానికి కేవలం రూ. 2,000 ఖర్చు

Tata Nexon కారులో సింక్రోనస్ మోటార్ ఉంటుంది. ఇది 30.2 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది గరిష్టంగా 127 బిహెచ్‌పి మరియు 245 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు కేవలం 9.9 సెకన్లలో గంటకు 100 కిమీ వేగవంతం అవుతుంది. ఏఆర్ఏఐ ద్రువీకరించినదాని ప్రకారం Tata Nexon గరిష్టంగా 312 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.

భళా Tata Nexon; 1,900 కిమీ ప్రయాణానికి కేవలం రూ. 2,000 ఖర్చు

Nexon ఎలక్ట్రిక్ కారు సాధారణ నెక్సాన్ కాంపాక్ట్ SUV యొక్క స్టైలింగ్ పొందుతుంది. అయితే ఇది ఒక ఎలక్ట్రిక్ కారు కావడం వల్ల కొన్ని కాస్మెటిక్ అప్‌గ్రేడ్‌లు ఉన్నాయి. కావున చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. Nexon ఎలక్ట్రిక్ కారు భారతదేశంలో మొదటిసారిగా జనవరి 2020 లో ప్రవేశపెట్టబడింది. Tata Nexon ఎలక్ట్రిక్ కాంపాక్ట్ SUV భారత మార్కెట్లో హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ మరియు MGZS ఎలక్ట్రిక్ SUV లకు ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Tata nexon ev attains record of first electric car to reach kaza details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X