టాటా నెక్సాన్‌ ఈవీ డ్రైవింగ్‌లో ఉండగా విరిగిపోయిన యాక్సిలరేటర్‌ పెడల్..!

కార్ల తయారీ సంస్థలు వందల సంఖ్యలో కారు విడిభాగాలను తయారు చేస్తుంటాయి. కొన్నిసార్లు వాటిలో లోపాలు ఉండే అవకాశం ఉంది. నాణ్యత నియంత్రణలో ఎంత ఖచ్చితంగా వ్యవహరించినా కొన్నిసార్లు కారు విడిభాగాల్లో నాసిరకం బయటపడవచ్చు. కానీ నాసిరకం విడిభాగాల సంఖ్య ఎక్కువగా ఉంటే మాత్రం రీకాల్‌ చేయాల్సి ఉంటుంది.

తాజాగా టాటా నెక్సాన్‌ ఈవీ కారు యాక్సిలరేటర్‌ పెడల్‌ విరిగిపోయిందని కారు యాజమాని ఫిర్యాదు చేశారు. అయితే గతంలోనూ ఇలాంటి సమస్యలు కొన్ని వెలుగులోకి వచ్చాయి. అయితే తన సమస్యకు పరిష్కారం చూపాలని టాటా మోటార్స్‌ను నెక్సాన్‌ కారు యాజమాని కోరారు.

Tata nexon EV car accelerator pedal breaks while in driving

టాటా నెక్సాన్ కారు డ్రైవింగ్‌లో ఉండగా యాక్సిలరేటర్‌ పెడల్‌ రెండుగా విరిగిపోయిందని కారు యాజమాని తెలిపారు. అయితే పెడల్‌పై ఎటువంటి ఒత్తిడి చేయలేదని చెప్పారు. టాటా కార్లలో ఇటువంటి ఘటన జరుగుతుందని ఊహించలేదని కారు యాజమాని తెలిపారు. టాటా కార్లు సాధారంగా గ్లోబర్‌ NCAP క్రాష్‌ టెస్టులో 5 స్టార్‌ రేటింగ్‌ను కలిగి ఉంటాయి. అందువల్లనే ఈ కార్లను కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తారు.

Tata nexon EV car accelerator pedal breaks while in driving

అయితే క్రాష్‌ టెస్ట్ రేటింగ్‌కు, కారులోపల విడిభాగాల నాణ్యతను సరిపోల్చలేం. యాక్సిలరేటర్‌ పెడల్‌ విరిగిపోవడానికి దాన్ని తయారుచేసిన మెటీరియల్ లోపం కావొచ్చు. మరియు నాసిరకం పనితీరు వల్ల కూడా ఇలా జరగవచ్చు. విరిగిపోయిన యాక్సిలరేటర్‌ పెడల్‌ను ఓసారి గమనిస్తే.. పెడల్‌ను కారులోని మరో భాగాన్ని కలిపే ప్రాంతంలో విరిగిపోయినట్లు కనిపిస్తోంది.

దీనిని బట్టి టాటా నెక్సాన్‌ కారు యాక్సిలరేటర్‌ పెడల్‌ విరిగిపోవడానికి కనెక్టింగ్‌ మెకానిజం ఒక కారణం కావచ్చు. లేదా పెడల్‌ను సరిగా ఇన్‌స్టాల్ చేయకపోవడం వల్ల కూడా ఇలా జరిగి ఉండవచ్చు. యాక్సిలరేటర్‌ పెడల్‌పై ఒత్తిడి కారణంగా కూడా విరిగిపోయి ఉండవచ్చు.

Tata nexon EV car accelerator pedal breaks while in driving

ఈ ఘటనపై టాటా మోటార్స్‌ సంస్థ లేదా టాటా ప్యాసింజర్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ లిమిటెడ్‌ సంస్థ దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది. విరిగిపోయిన యాక్సిలరేటర్‌ పెడల్‌ను తిరిగి బాగుచేయడం చాలా సులభం. కానీ, అసలు సమస్యకు గల మూలకారణాన్ని కనుక్కోవడం చాలా ముఖ్యం. ఇటువంటి సమస్య ఈ ఒక్క కారులోనే ఉందా లేదా మిగిలిన కార్ల యాజమానులు ఇటువంటి సమస్యలతో అవస్థలు పడుతున్నారా గుర్తించాల్సి ఉంటుంది.

టాటా నెక్సాన్‌ కారు డ్రైవింగ్‌లో ఉన్న సమయంలో యాక్సిలరేటర్‌ పెడల్‌ విరిగిపోయింది. కానీ ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలుస్తోంది. చాలా సందర్భాల్లో ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నప్పుడు ప్రమాదాలకు కారణం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఉదాహరణకు కారు వేగంగా ప్రయాణించినప్పుడు అకస్మాత్తుగా పెడల్‌ విరిగిపోయి ఉంటే, కారు నియంత్రణ కోల్పోయి ప్రమాదం జరిగే అవకాశం ఉండేది. ఈ సందర్భంగా అలాంటి ఘటనలు నమోదు కాలేదు. అయితే ఈ సమస్యకు టాటా నెక్సాన్‌ ఈవీ యాజమాని త్వరగా పరిష్కారం పొందుతారని ఆశిస్తున్నాం.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, June 21, 2023, 13:00 [IST]
English summary
Tata nexon ev car accelerator pedal breaks while in driving car owner complaints to tata
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+