రిపబ్లిక్ డే పరేడ్‌లో టాటా నెక్సాన్ ఈవీ; ఏం మెసేజ్ ఇచ్చిందంటే..

భారతదేశంలో 72వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని, ఇటీవల నిర్వహించిన రిపబ్లిక్ డే పరేడ్‌లో, ఈసారి వినూత్నంగా టాటా నెక్సాన్ కారును ప్రదర్శించడం అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఈ పరేడ్‌లో మొత్తం 32 విభిన్న ప్రచార రథాలు పాల్గొన్నాయి.

రిపబ్లిక్ డే పరేడ్‌లో టాటా నెక్సాన్ ఈవీ; ఏం మెసేజ్ ఇచ్చిందంటే..

భారతదేశంలో దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో వంటి ప్రభుత్వ ఛానెళ్లను నిర్వహిస్తున్న కేంద్ర సమాచార మరియు ప్రసారాల మంత్రిత్వ శాఖ 'వోకల్ ఫర్ లోకల్' అనే నినాదంతో స్థానికతకు ప్రాధాన్యత ఇస్తూ, దేశంలో గ్రీన్ వాహనాలను ప్రోత్సహించేలా ఈ ప్రచార రథాన్ని తయారు చేశారు.

రిపబ్లిక్ డే పరేడ్‌లో టాటా నెక్సాన్ ఈవీ; ఏం మెసేజ్ ఇచ్చిందంటే..

ఇదే ప్రచార రథంపై బ్రహ్మోస్ క్షిపణులను కూడా ప్రదర్శించారు. ఇందులోని టాటా నెక్సాన్ కారుపై గో గ్రీన్, గో ఎలక్ట్రిక్ అంటూ ప్రచారం చేశారు. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడం, తద్వారా పర్యావరణానికి హాని కలిగించే పెట్రోల్/డీజిల్‌తో నడిచే వాహనాలకు స్వస్తి పలకాలనుకోవటమే దీని ముఖ్య ఉద్దేశ్యం.

MOST READ:ప్రజలపై 'గ్రీన్ టాక్స్' మోతకు కేంద్రం గ్రీన్ సిగ్నల్; ఏప్రిల్ 1 నుండి..

రిపబ్లిక్ డే పరేడ్‌లో టాటా నెక్సాన్ ఈవీ; ఏం మెసేజ్ ఇచ్చిందంటే..

టాటా మోటార్స్ అందిస్తున్న నెక్సాన్ ఈవి ప్రస్తుతం దేశంలోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారుగా ఉంది. అంతేకాకుండా, భారతదేశంలోనే ఎక్కువగా ఇష్టపడే మరియు అత్యధికంగా విక్రయించబడే ఎలక్ట్రిక్ కారుగా మారింది. భారత మార్కెట్లోని ఎలక్ట్రిక్ వాహన విభాగంలో నెక్సాన్ ఈవీ 74 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది.

రిపబ్లిక్ డే పరేడ్‌లో టాటా నెక్సాన్ ఈవీ; ఏం మెసేజ్ ఇచ్చిందంటే..

టాటా మోటార్స్ గతేడాది జనవరి(2020)లో తమ నెక్సాన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో ఇది ఎక్స్ఎమ్, ఎక్స్‌జెడ్ ప్లస్ మరియు ఎక్స్‌జెడ్ ప్లస్ లగ్జరీ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. మార్కెట్లో దీని బేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ.13.99 లక్షలుగా (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉంది.

MOST READ:బైక్‌నే బస్సుపైకి తలపై మోసిన రియల్ బాహుబలి [వీడియో]

రిపబ్లిక్ డే పరేడ్‌లో టాటా నెక్సాన్ ఈవీ; ఏం మెసేజ్ ఇచ్చిందంటే..

టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారులో 95 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఈ మోటార్‌ను ఫ్రంట్ యాక్సిల్‌లో అమర్చబడి ఉంటుంది. ఇది 30.2 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఈ మోటర్ గరిష్టంగా 129 బిహెచ్‌పి పవర్‌ను మరియు 245 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ పేర్కొన్న ప్రకారం, నెక్సాన్ ఈవి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పూర్తి ఛార్జీపై 312 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది.

నెక్సాన్ ఈవీ స్టాండర్డ్ మరియు ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీలని సపోర్ట్ చేస్తుంది. హోమ్ ఛార్జర్ ద్వారా ఈ కారు పూర్తిగా ఛార్జ్ చేయటానికి సుమారు 7 నుండి 8 గంటల సమయం పడుతుంది. అదే ఫాస్ట్ ఛార్జర్ ద్వారా అయితే, కేవలం 60 నిమిషాల్లో బ్యాటరీని 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు.

MOST READ:ఎలక్ట్రిక్ కారుగా మారిన మారుతి డిజైర్ ; వివరాలు

రిపబ్లిక్ డే పరేడ్‌లో టాటా నెక్సాన్ ఈవీ; ఏం మెసేజ్ ఇచ్చిందంటే..

ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో బ్రేక్ రీజనరేషన్ టెక్నాలజీ కూడా ఉంటుంది. ఫలితంగా, బ్రేకింగ్ వేసిన ప్రతిసారి ఇందులోని బ్యాటరీ ఛార్జ్ అవుతుంది, తద్వారా డ్రైవింగ్ రేంజ్ కూడా పెరుగుతుంది. ఇంకా ఇందులో కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్, పూర్తి-ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలతో కూడిన 7-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మొదలైన ఫీచర్లు కూడా ఉన్నాయి.

రిపబ్లిక్ డే పరేడ్‌లో టాటా నెక్సాన్ ఈవీ; ఏం మెసేజ్ ఇచ్చిందంటే..

అంతేకాకుండా, నెక్సాన్ ఎలక్ట్రిక్ కారులో లెదర్‌తో చుట్టబడిన స్టీరింగ్ వీల్, రివర్స్ పార్క్ అసిస్ట్ కెమెరా, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్, ఈబిడి, స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ ద్వారా ఎస్‌యూవీని నియంత్రించడానికి బ్రాండ్ యొక్క కనెక్టెడ్ టెక్నాలజీ మరియు 35 రకాల కమాండ్స్ కూడా ఉన్నాయి.

MOST READ:కారు ఎక్కువ కాలం ఉపయోగించాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ తప్పక పాటించాలి

రిపబ్లిక్ డే పరేడ్‌లో టాటా నెక్సాన్ ఈవీ; ఏం మెసేజ్ ఇచ్చిందంటే..

టాటా మోటార్స్ తమ నెక్సాన్ ఈవి కోసం కంపెనీ గడచిన ఆగస్ట్ 2020 నెలలో ప్రవేశపెట్టిన చందా (సబ్‌స్క్రిప్షన్) ప్లాన్‌ను భారీగా తగ్గించింది. అప్పట్లో రూ.41,900లుగా ఉన్న ఈ ప్లాన్‌ను కంపెనీ రూ.29,500 లకు తగ్గించింది (36 నెలల కాల వ్యవధి కోసం, ఢిల్లీ ప్రాంతంలో). - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Tata Nexon EV Displayed In 72nd Republic Day Parade, Details. Read in Telugu.
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X