నెక్సాన్ విడుదల తేదీ వివరాలు వెల్లడించిన టాటా మోటార్స్ సిఇఒ

Written By:

మనీ కంట్రోల్ అనే ఆన్‌లైన్ వేదిక టాటా మేనేజింగ్ డైరెక్టర్ గుంటర్ బుట్స్‌చెక్‌తో ముఖాముఖి నిర్వహించింది. ఈ ఇంటర్వ్యూలో తమ తదుపరి మోడల్ నెక్సాన్ క్రాసోవర్ ఎస్‌యూవీ విడుదల వివరాలను వెల్లడించాడు. వచ్చే దీపావళిలోపే దీనిని విపణలోకి విడుదల చేయనున్నట్లు పేర్కొన్నాడు.

టాటా నెక్సాన్ విడుదల

టాటా మోటార్స్ ఈ ఏడాది మూడవ మోడల్‌గా నెక్సాన్ కాంపాక్ట్ క్రాసోవర్ ఎస్‌యూవీ. ఇప్పటికే విడుదల చేసిన టాటా హెక్సా మరియు త్వరలో విడుదల కానున్న టిగోర్ స్టైల్‌బ్యాక్ కాంపాక్ట్ సెడాన్‌లు ఈ ఏడాది యొక్క తొలి రెండు విడుదళ్లు.

టాటా నెక్సాన్ విడుదల

టియాగో హ్యాచ్‌బ్యాక్ మరియు శక్తివంతమైన ఎస్‌యూవీ హెక్సా విజయంతో అతి త్వరలో టిగోర్ సెడాన్ అదే విధంగా దీపావళి పండుగ సీజన్ నాటికి నెక్సాన్ ఎస్‌యూవీని విడుదలకు సిద్దం చేయడం ఆనందంగా ఉందని తెలిపాడు.

టాటా నెక్సాన్ విడుదల

భారీ అమ్మకాలు నమోదు చేసుకునే సామర్థ్యం ఉన్న ఈ సబ్ నాలుగు మీటర్ల క్రాసోర్ ఎస్‌యూవీని గత వారంలో జరిగిన 2017 జెనీవా మోటార్ షో వేదిక మీద ప్రొడక్షన్‌ రెడీ మోడల్‌గా టాటా ప్రదర్శించింది.

టాటా నెక్సాన్ విడుదల

దేశీయ మరియు అంతర్జాతీయ ఆసక్తిపరులను ఆకట్టుకొనేందుకు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, సిరామిక్ సైడా ఫినిషర్, కాంట్రాస్ట్ రూఫ్, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు, ఫాగ్ ల్యాంప్స్, గ్లాస్ బ్లాక్ ఫినిష్ గల విశాలమైన ఫ్రంట్ గ్రిల్ మరియు ఎల్ఇడి టెయిల్ ల్యాంప్స్ ఇందులో ఉన్నాయి.

టాటా నెక్సాన్ విడుదల

నెక్సాన్ లోని డీజల్ వేరియంట్ దాదాపు ఖాయమైనట్లే, ఇందులో 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న నాలుగు సిలిండర్ల టుర్బో డీజల్ ఇంజన్, 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ అనుసంధానంతో రానుంది.

టాటా నెక్సాన్ విడుదల

పెట్రోల్ ఇంజన్ ఇంకా ఖరారు కాలేదు, అయితే ఇందులో 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న రివట్రాన్ పెట్రోల్ ఇంజన్ రానుంది. టెర్రైన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టమ్ టాప్ ఎండ్ వేరియంట్లలో వచ్చే అవకాశం ఉంది.

టాటా నెక్సాన్ విడుదల

టాటా నెక్సాన్ క్రాసోవర్ ఎస్‍‌యూవీ ఫోటోల కోసం క్రింది గ్యాలరీ మీద క్లిక్ చేయండి....

 

English summary
Tata Nexon India Launch In October
Story first published: Saturday, March 11, 2017, 9:00 [IST]
Please Wait while comments are loading...

Latest Photos