కొత్త కారు కొని చెత్త డ్రైవింగ్ చేస్తే ఇలానే ఉంటది.. వీడియో చూడండి

సాధారణంగా ఒక మధ్యతరగతి కుటుంబానికి కారు కొనడం ఒక పెద్ద కల. ఈ కలను నిజం చేసుకోవానికి నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. అయితే కొంతమంది ఎంతో కస్టపడి నచ్చిన కారుని కొనుగోలు చేస్తారు, అయితే సరైన డ్రైవింగ్ రాకపోతే అనుకోని అనర్థాలు ఎదురవుతాయి. దీనికి నిలువెత్తు నిదర్శనమే ఇప్పుడు ఇక్కడ వెలుగులోకి వచ్చిన వీడియో. ఇంతకీ ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. రండి.

కొత్త కారు కొని చెత్త డ్రైవింగ్ చేస్తే ఇలానే ఉంటది.. వీడియో చూడండి

నివేదికల ప్రకారం, ఇక్కడ వెలువడిన వీడియోలో ఒక కొత్త టాటా నెక్సాన్ కారు అమాంతం పార్కింగ్ చేసిన బైకులపైకి దూసుకెళ్ళిపోయింది. ఈ సంఘటనలో అక్కడున్న బైకులు చాలా వరకు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అంతే కాకూండా ఆ కొత్త కారు కూడా ఎక్కువగా దెబ్బతిన్నట్లు అనిపిస్తోంది.

కొత్త కారు కొని చెత్త డ్రైవింగ్ చేస్తే ఇలానే ఉంటది.. వీడియో చూడండి

మనం వీడియోలో గమనించినట్లయితే కొత్త టాటా నెక్సాన్ ఒక రెసిడెన్షియల్ సముదాయంలోకి ప్రవేశించే ముందు, ఒక వ్యక్తి గేటుని తీసి నెక్సాన్ కారుని డ్రైవ్ చేసే వ్యక్తిని లోపలి రమ్మన్నట్లు పిలుస్తాడు. అయితే నెక్సాన్ కారుని డ్రైవ్ చేసే వ్యక్తి కారుని లోపలి డ్రైవ్ చేసుకుంటూ వస్తాడు. అయితే అంతలో ఏమి జరిగిందో తెలియదు, ఆ కొత్త కారు అక్కడున్న బైకుల మీద నుంచి వెళ్ళింది. ఆ సమయంలో డ్రైవర్ బ్రేక్ కూడా వేయలేకపోయాడని ఈ వీడియో చూస్తేనే అర్థమవుతుంది. దీనికి సంబంధించిన వీడియో అక్కడున్న సిసిటివి ద్వారా రికార్డ్ చేయబడింది.

కొత్త కారు కొని చెత్త డ్రైవింగ్ చేస్తే ఇలానే ఉంటది.. వీడియో చూడండి

ఈ వీడియో మనం చూసినట్లయితే ఈ డ్రైవర్ కి డ్రైవింగ్ లో ఎక్కువ అనుభవం లేదని తెలుస్తుంది. ఈ కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. ఇదే ప్రమాదం రొడ్డిపైనా జరిగి ఉంటే అక్కడ జరిగే నష్టం ఊహాతీతం అనే చెప్పాలి. ఎందుకంటే ప్రజా రహదారులు ఎప్పుడూ చాలా రద్దీగా ఉంటాయి, కావున ప్రాణనష్టం కూడా జరిగే అవకాశం ఉంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రాణహాని జరగలేదు. అయితే అక్కడున్న బైకులతో పాటు కారు కూడా ఎక్కువ దెబ్బతిన్నట్లు తెలిసింది.

కొత్త కారు కొని చెత్త డ్రైవింగ్ చేస్తే ఇలానే ఉంటది.. వీడియో చూడండి

నిజానికి టాటా నెక్సాన్ అనేది టాటా మోటార్స్ యొక్క పాపులర్ బ్రాండ్. కావున ఇది సేఫ్టీలో కూడా అత్యంత సురక్షితమైన కారు. ఇందులో ఎయిర్ బ్యాగులు, రివర్స్ పార్కింగ్ అసిస్ట్, హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మరియు ఆటో డిమ్మింగ్ ఐఆర్విఎమ్ వంటి సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. కావున ఇది సేఫ్టీ విషయంలో 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది. కావున ఇది భారతదేశంలో లభించే అత్యంత సురక్షితమైన వాహనాల్లో ఇప్పటికీ ఒకటిగా ఉంది.

కొత్త కారు కొని చెత్త డ్రైవింగ్ చేస్తే ఇలానే ఉంటది.. వీడియో చూడండి

భారతీయ మార్కెట్లో ప్రస్తుతం టాటా నెక్సాన్ ధరల విషయానికి వస్తే, బేస్ వేరియంట్ ధర రూ.7.59 లక్షలు (ఎక్స్-షోరూమ్), కాగా టాప్-వేరియంట్ ధర రూ.14.08 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఇది అద్భుతమైన డిజైన్ మరియు అధునాతన ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల దేశీయ మార్కెట్లో ఈ SUV విడుదలైనప్పటి నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది.

కొత్త కారు కొని చెత్త డ్రైవింగ్ చేస్తే ఇలానే ఉంటది.. వీడియో చూడండి

టాటా నెక్సాన్ రెండు ఇంజిన్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి 1.2-లీటర్ టర్బోఛార్జ్డ్ త్రీ-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ మరియు 1.5-లీటర్ టర్బోఛార్జ్డ్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్.

కొత్త కారు కొని చెత్త డ్రైవింగ్ చేస్తే ఇలానే ఉంటది.. వీడియో చూడండి

టాటా నెక్సాన్ యొక్క 1.2-లీటర్ టర్బోఛార్జ్డ్ త్రీ-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ 120 పిఎస్ గరిష్ట పవర్ మరియు 170 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ (1.5-లీటర్ టర్బోఛార్జ్డ్ ఫోర్ సిలిండర్ డీజిల్) ఇంజిన్ విషయానికి వస్తే ఇది 110 పిఎస్ పవర్ మరియు 260 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజిన్లు 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ పొందుతాయి. ఇందులో సిటీ, ఎకో మరియు స్పోర్ట్స్ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్ కలిగి ఉంటుంది.

కొత్త కారు కొని చెత్త డ్రైవింగ్ చేస్తే ఇలానే ఉంటది.. వీడియో చూడండి

ఇక టాటా నెక్సాన్ యొక్క మైలేజ్ విషయానికి వస్తే, నెక్సాన్ పెట్రోల్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ 17.57 కిమీ/లీ మైలేజ్ ఇవ్వగా, ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ 16.35 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది.

నెక్సాన్ డీజిల్ వేరియంట్స్ విషయానికి వస్తే, మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ 21.19 కిమీ/లీ మైలేజ్ ఇవ్వగా, ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ 22.07 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. మొత్తం మీద ఇది మంచి మైలేజ్ కూడా అందిస్తుంది.

కొత్త కారు కొని చెత్త డ్రైవింగ్ చేస్తే ఇలానే ఉంటది.. వీడియో చూడండి

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

ఇది వరకు చెప్పుకున్నట్లుగా టాటా మోటార్స్ యొక్క నెక్సాన్ కారు దేశీయ మార్కెట్లో లభించే అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటి. అయితే సరైన డ్రైవింగ్ రాకుండా డ్రైవింగ్ చేస్తే ఎలా ఉంటుందో మీరు ఈ వీడియోలో చూడవచ్చు. ఎన్నో రోజులనుంచి కలలు కని ఒక కొత్త కారు తీసుకువస్తే మొదట్లోనే ఇలా జరగటం నిజంగా బాధాకరం, అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమి కాలేదు కాబట్టి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలతోపాటు, కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు అప్డేటెడ్ సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Tuesday, October 11, 2022, 7:00 [IST]
English summary
Tata nexon running over several parked two wheelers viral video
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+