ప్రమాదంలో పల్టీలు కొట్టిన టాటా నెక్సాన్.. ప్రయాణికులు సేఫ్

వాహనాలను కొనుగోలు చేసే వాహన వినియోగదారులు కేవలం ఫీచర్స్, మైలేజ్ వంటివి మాత్రమే కాకుండా ఫీచర్స్ కూడా గమనించి కొనుగోలు చేస్తున్నారు. ఈ కారణంగా వాహన తయారీదారులు కూడా దాదాపు అన్ని సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో తీసుకువస్తున్నారు. సేఫ్టీ విషయంలో ఏది ఎలా ఉన్న టాటా మోటార్స్ మాత్రం ఇప్పటికి చాలా నమ్మికైనదిగా ఉంది.

ప్రమాదంలో పల్టీలు కొట్టిన టాటా నెక్సాన్.. ప్రయాణికులు సేఫ్

టాటా మోటార్స్ భారతదేశంలో అత్యంత సురక్షితమైన కార్లను అందిస్తున్న కంపెనీలలో ఒకటి. టాటా మోటార్స్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ ఇప్పటికే చాలా సంఘటనల వల్ల వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి సంఘటన ఇటీవల కూడా ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇందులో ఒక టాటా నెక్సాన్ కారు ఒక ప్రమాదంలో చిక్కుకుంది. అయినప్పటికీ అందులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎటువంటి ప్రాణ హాని జరగలేదు.

ప్రమాదంలో పల్టీలు కొట్టిన టాటా నెక్సాన్.. ప్రయాణికులు సేఫ్

నివేదికల ప్రకారం ప్రమాదానికి గురైన టాటా నెక్సాన్ కార్ ఓనర్ రవిరాజ్ సింగ్ ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని, టాటా నెక్సన్ ఓనర్స్ గ్రూప్ ద్వారా నివేదించారు. ఇటీవల అతను తన నెక్సాన్ కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది.

ప్రమాదంలో పల్టీలు కొట్టిన టాటా నెక్సాన్.. ప్రయాణికులు సేఫ్

రోడ్డుపై కారు వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న ఒక మోటారుసైకిల్ రైడర్ నెక్సాన్ ని ఢీ కొట్టింది. బైక్ ను తప్పించుకునే సమయంలో కారు అదుపుతప్పి పక్కన ఉన్న సరస్సులో పడింది. సరస్సులో నీరు తక్కువగా ఉండటం వల్ల అదృష్టవశాత్తు కారు పూర్తిగా మునిగిపోలేదు. కావున కారు లోపల ఉన్నవారికి ఎటువంటి ప్రాణహాని జరగేలేదు.

ప్రమాదంలో పల్టీలు కొట్టిన టాటా నెక్సాన్.. ప్రయాణికులు సేఫ్

ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారునికి, మరియు కారులోని వారికీ స్వల్ప గాయాలైనట్లు తెలిసింది. చికిత్స కోసం హాస్పిటల్ లో చేరారు. ఈ సంఘటనలో నెక్సాన్ కారు అదుపుతప్పి పల్టీలు కొట్టి పక్కన ఉన్న వంతెనపై నుంచి కిందికి పడింది. దీన్ని బట్టి చూస్తే కారు చాలా వేగంగా వస్తున్నట్లు తెలుస్తుంది.

ప్రమాదంలో పల్టీలు కొట్టిన టాటా నెక్సాన్.. ప్రయాణికులు సేఫ్

టాటా నెక్సాన్ కారులో అనేక సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. టాటా నెక్సాన్ కారు గ్లోబల్ ఎన్‌సిఎపి యొక్క క్రాష్ టెస్ట్ ద్వారా 5 స్టార్ రేటింగ్‌ సొంతం చేసుకుని, వాహనదారులు ప్రయాణించడానికి సురక్షితమైన వాహనం అని అధికారికంగా ధృవీకరించబడింది.

ప్రమాదంలో పల్టీలు కొట్టిన టాటా నెక్సాన్.. ప్రయాణికులు సేఫ్

టాటా నెక్సాన్ దేశీయ మార్కెట్లో పెట్రోల్ మరియు డీజిల్ అనే రెండు వేరియంట్లలో విక్రయించబడుతోంది. ఈ కారు ఎలక్ట్రిక్ వెర్షన్‌లో కూడా లభిస్తుంది. ఇది ఇటీవల టాటా నెక్సాన్ కారులో సరికొత్త డార్క్ ఎడిషన్ ఆల్-బ్లాక్ ట్రిమ్‌గా కూడా ప్రవేశపెట్టబడింది.

ప్రమాదంలో పల్టీలు కొట్టిన టాటా నెక్సాన్.. ప్రయాణికులు సేఫ్

టాటా నెక్సాన్ ప్రారంభ ధర రూ. 7.19 లక్షలు. అయితే దీని గరిష్ట ధర రూ. 11.29 లక్షలు. అదేవిధంగా టాటా నెక్సాన్ యొక్క బ్లాక్ వెర్షన్ ధర రూ. 10.39 లక్షలు కాగా, ఎలక్ట్రిక్ వెర్షన్ ధర రూ. 13.99 లక్షల రూపాయల ధరలకు అమ్మకానికి అందుబాటులో ఉంది. ఏది ఏమైనా నిక్సన్ మంక్హి సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు వెళ్తోంది. ఏది ఏమైనా వాహనదారులు కూడా ప్రమాదాలు జరగకుండా కొంత జాగ్రత్త వహించాలి.

Most Read Articles

English summary
Tata Nexon Falls Off Bridge After Accident. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X