Tata Nexon: 108 కి.మీ స్పీడ్‌లో హైవేపై కారు.. రోడ్డు దాటుతుండగా రెప్పపాటులో తప్పిన ప్రమాదం, వీడియో వైరల్
రోడ్లపై వాహనాలు నడపడం అంత సులభం కాదు.. సేఫ్ డ్రైవింగ్ చేయాలంటే దానికి స్కిల్స్, అవగాహన ఉండాలి. పబ్లిక్ రోడ్లపై ప్రయాణించేటప్పుడు ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయినా ప్రమాదాలు(Road Accidents) తప్పవు. రోడ్డు దాటేటప్పుడు పాదచారులు కూడా మరింత జాగ్రత్తగా ఉండాలి. తాజాగా ఓ పాదచారి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.
ఓ పాదచారి(Pedestrian Crossing Road) రోడ్డు దాటుతూ క్షణకాలంలో యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డ్రైవర్ అప్రమత్తత, సమయస్ఫూర్తితో పెద్ద ప్రమాదం తప్పింది. కారులోని డ్యాష్ బోర్డు కెమెరాలో ఇందుకు సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఓ వ్యక్తి తన టాటా నెక్సాన్(Tata Nexon SUV) సబ్-కాంపాక్ట్ SUVలో జాతీయ రహదారిపై వెళ్తున్నాడు. 108 కి.మీ వేగంతో నాలుగు లేన్ల హైవేపై డ్రైవర్ ఎస్‌యూవీ నడుపుతున్నాడు. సాధారణంగా హైవేలు సిటీలో, నగరాల్లో రోడ్ల మాదిరిగా రద్దీగా ఉండవు. హైవే రోడ్లు విశాలంగా ఉండటంతో ట్రాఫిక్ అసలు ఉండే అవకాశం ఉండదు.
ఈ కారణంగానే ట్రక్కులు, కార్లు 100 కి.మీ కు మించి వేగంతోనే వెళ్తుంటాయి. కారులో డ్యాష్ బోర్డు కెమెరాలో రికార్డయిన దృశ్యాల ద్వారా ఇతర వాహనాలు వేగంగా వెళ్తుండటాన్ని చూడవచ్చు. ఈ క్రమంలో ఓ వ్యక్తి తలపై ఓ బస్తా పెట్టుకుని రోడ్డు దాటేందుకు యత్నిస్తాడు. అతను రోడ్డుపై వస్తున్న వాహనాలను చూడకుండా హైవే దాటుతుండటాన్ని వీడియోలో గమనించవచ్చు.

ఈ క్రమంలో టాటా నెక్సాన్ రోడ్డు దాటుతున్న వ్యక్తిని గమనించాడు. పాదచారి అప్పటికే రోడ్డు మధ్యలోకి వచ్చాడు. దీంతో డ్రైవర్ సమయస్ఫూర్తితో కారును వెంటనే కుడివైపునకు మళ్లించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. లేదంటే 108 కి.మీ వేగంతో వెళ్తున్న కారు హఠాత్తుగా మనిషిని ఢీకొంటే తీవ్ర నష్టం వాటిల్లి ఉండేది. కారును కుడివైపునకు మళ్లించే క్రమంలో పాదచారిని కొద్దిగా ఢీకొనగా అతని భుజంపై బస్తా కిందపడింది.
ఇదంతా డ్యాష్ బోర్డు కెమెరాలో రికార్డయింది. ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడం అదృష్టం. అయితే రోడ్డు దాటే సమయంలో పాదచారి నిర్లక్ష్యమే ఇందుకు కారణంగా స్పష్టంగా తెలుస్తోంది. రోడ్డు దాటేటప్పుడు వాహనాలు స్లోగా వస్తున్నప్పుడు లేదంటే రోడ్డు ఖాళీగా ఉన్నప్పుడు దాటేందుకు యత్నించాలి. ఎందుకంటే అతి వేగంగా వస్తున్న వాహనాలు ఒక్కసారిగా సడెన్ బ్రేక్ వేస్తే.. ఏదో ఒకదానిని ఢీకొట్టే అవకాశం ఉంటుంది.

ఈ ఘటనలో డ్రైవర్ సమయస్ఫూర్తి కారణంగానే ప్రమాదం తప్పింది. అంత తక్కువ గ్యాప్‌లోనూ కారు డివైడర్‌ను ఢీకొట్టకపోవడం ఆశ్చర్యం. కారు, వ్యక్తి మరియు డివైడర్ మధ్య మిగిలి ఉన్న మార్జిన్ చాలా తక్కువగా ఉంది. స్పీడ్‌గా వెళ్తున్న కారు ఒకవేళ డివైడర్‌ను ఢీకొని ఉంటే, అది ఎగిరి పడిపోయి భారీ ప్రమాదం జరిగి ఉండేది. డ్రైవర్‌తో పాటు వాహన ప్రయాణికులకు ప్రాణాపాయం కలిగేది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








