డ్రైవర్ నిర్లక్ష్యం.. టాటా నెక్సాన్ కారును ఢీకొట్టిన రైలు.. చెక్కుచెదరని కారు క్యాబిన్...!
రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న దేశాల్లో భారత్ కూడా ఉంది. భారత్‌లో ప్రమాదాలకు నిర్లక్ష్యం, అధిక వేగం వంటివి కారణాలుగా ఉన్నాయి. తాజా ప్రమాదంలో ఓ టాటా నెక్సాన్ కారు (Tata Nexon) డ్రైవర్ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. రైలు వస్తుందని తెలిసి కూడా రైల్వే ట్రాక్ దాటేందుకు ప్రయత్నం చేశారు.
అయితే రైలు వచ్చే సమయానికి కారు రైల్వే ట్రాక్‌పైన నిలిచిపోయింది. దీంతో టాటా నెక్సాన్ కారును రైలు ఢీకొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందేనేది తెలియలేదు.

డ్రైవర్ నిర్లక్ష్యం : కొన్ని నివేదికల ప్రకారం టాటా నెక్సాన్ కారు అప్పుడే షోరూం నుంచి డెలివరీ అయినట్లు తెలుస్తోంది. అయితే మార్గమద్యంలో నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. రైలు వస్తుందని తెలిసి కూడా రైలు పట్టాలను దాటేందుకు ప్రయత్నం చేసినట్లు సమాచారం. కానీ ఎస్‌యూవీ రైలు పట్టాల మధ్య నిలిచినట్లు సమాచారం.
చెక్కు చెదరని క్యాబిన్ : ఈ విషయాన్ని లోకో పైలెట్ గుర్తించి, రైలు వేగాన్ని తగ్గించాడు. అయినా రైలు పట్టాల మధ్య కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు డోర్ భారీగా డ్యామేజీ అయింది. రైలు ఢీకొట్టినా టాటా కార్ల బిల్డ్ క్వాలిటీ కారణంగా కారు క్యాబిన్ మాత్రం చెక్కుచెదరలేదు. ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

ఇప్పటికే ఇలాంటి ఘటనలు చాలా వెలుగులోకి వచ్చాయి. ఆయా ఘటనల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే తాజా ఘటనలో రైలు లోకోపైలెట్ అప్రమత్తత, కారు బిల్డ్ క్వాలిటీ కారణంగా ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు. అయితే రైలు నెమ్మదిగా వచ్చినా.. ఎదురుగా ఉన్న వస్తువులను భారీగా డ్యామేజీ చేయగలదు.
కంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో టాటా నెక్సాన్ కారు మెరుగైన విక్రయాలను నమోదుచేసింది. ఆకర్షణీయమైన డిజైన్, బిల్డ్ క్వాలిటీ, భద్రత కారణంగా భారత్ మార్కెట్‌లో ఈ సెగ్మెంట్‌లో బెస్ట్ కారుగా నిలిచింది. దీంతోపాటు ఈ కారు కీలక ఫీచర్లను కలిగి ఉంటుంది. తాజాగా ఈ కారు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ విడుదల అయింది.

పాత మోడల్ టాటా నెక్సాన్ కంపాక్ట్ ఎస్‌యూవీ గ్లోబల్ NCAP నుంచి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించింది. అయితే ఇటీవల విడుదల అయిన టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ ఇంకా ఎటువంటి సేఫ్టీ టెస్ట్‌కు హాజరుకాలేదు. అయితే ఈ ఫేస్‌లిఫ్ట్ కూడా పాతతరం కాంపాక్ట్ ఎస్‌యూవీ మాదిరిగా మెరుగైన సేఫ్టీ రేటింగ్‌ను పొందే అవకాశం ఉంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








