ఐపీఎల్‌ ఫ్యాన్స్‌కు టాటా పవర్‌ గుడ్‌ న్యూస్‌.. ఉప్పల్‌ స్టేడియం నుంచి ఈ రూట్లలో ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లు

దేశవ్యాప్తంగా ఐపీఎల్‌ సీజన్‌(IPL Season 2024) అట్టహాసంగా ప్రారంభమైంది. లక్షలాది మంది క్రికెట్‌ అభిమానులతో క్రికెట్‌ స్టేడియంలు కోలాహలంగా మారాయి. ఈ క్రమంలో రోడ్లపై ట్రాఫిక్‌ జామ్‌ కూడా ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌లో ఎలక్ట్రిక్‌ వాహన వినియోగదారులకు టాటా పవర్‌ గుడ్‌న్యూస్‌ తీసుకువచ్చింది. అదేంటంటే..

దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం పెరుగుతోంది. ఐసీఈ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ప్రజలకు ఈవీలవైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం పెరుగుతున్నప్పటికీ.. వాటికి ఛార్జింగ్‌ సమస్య కూడా ప్రధానంగా మారుతుంది. కాగా ప్రస్తుతం భారత్‌లో ఐపీఎల్‌ సీజన్‌ నడుస్తుండటంతో.. ఈవీ యజమానులకు ఛార్జింగ్‌ సమస్య తలెత్తకూడదని టాటా పవర్‌(Tata Power) ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

Tata-Power-EV-Charging-Stations-2024

IPL మ్యాచ్‌లను వీక్షించేందుకు చాలా మంది వాహనాలపై వస్తుంటారు. వాటిలో ఎలక్ట్రిక్‌ వాహనాలు కూడా ఉంటాయి. అయితే మ్యాచ్‌ చూడటానికి(Tata Power EV Charging Stations) స్టేడియంకు వెళ్లే క్రమంలో కానీ.. లేదా స్టేడియం నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో కానీ.. ఈవీ యజమానులకు ఛార్జింగ్‌ సమస్య తలెత్తకూడదనే ఉద్దేశంతో టాటా పవర్‌ ఓ సొల్యూషన్‌ను తీసుకువచ్చింది.

ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరిగే స్టేడియంల సమీపంలో EV ఛార్జింగ్ స్టేషన్‌లను టాటా పవర్‌ ఏర్పాటు చేసింది. దీని ద్వారా ఈవీ ఓనర్లు తమ వాహనాలను సులభంగా ఛార్జింగ్‌ చేసుకోవచ్చు. క్రికెట్‌ ఔత్సాహికులకు తమ ఎలక్ట్రిక్‌ వాహనాల విషయంలో ఛార్జింగ్‌ సమస్య తలెత్తకుండా అంతరాయం లేని ప్రయాణ అనుభవాన్ని అందించడానికి ఈ ఛార్జింగ్‌ స్టేషన్లను తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా ఈ EV Charging Stations అందుబాటులో ఉన్నాయి.

టాటా పవర్ పబ్లిక్ ఛార్జర్‌లు.. ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్ మొదలైన దేశంలోని ప్రధాన నగరాల్లోని కీలకమైన స్టేడియాల సమీపంలో ఏర్పాటయ్యాయి. ఈ ఛార్జింగ్ స్టేషన్ల ద్వారా వాహనదారులు సౌకర్యవంతంగా తమ ఈవీలకు ఛార్జింగ్‌ చేసుకోవచ్చు. EV వినియోగదారులు టాటా పవర్ EZ ఛార్జ్ యాప్‌ని ఉపయోగించి సమీపంలోని ఛార్జింగ్ పాయింట్‌లను తెలుసుకోవచ్చు. స్లాట్‌ బుక్‌ చేసుకుని EZ ఛార్జ్ RFID కార్డ్‌తో చెల్లించి, ఛార్జింగ్‌ చేసుకోవచ్చు.

ఈ ఛార్జింగ్ స్టేషన్‌లు విశ్వసనీయమైన మరియు సమర్థవంతమైన సేవలను అందిస్తాయని టాటా పవర్‌ తెలిపింది. EV యజమానులు రేంజ్‌ విషయంలో ఆందోళన లేకుండా క్రికెట్‌ను ఆస్వాదించడానికి వీలు కల్పించేలా వీటిని ఏర్పాటు చేశారు. ఈ సౌలభ్యం అభిమానులకు ఊరటనిస్తుందని.. టాటా పవర్ తెలిపింది.

టాటా పవర్ తన సమగ్ర నెట్‌వర్క్ ద్వారా 490 నగరాలు మరియు పట్టణాలను కవర్ చేస్తూ దేశవ్యాప్తంగా EV ఛార్జింగ్ యాక్సెస్‌ను పెంచడానికి అంకితభావంతో పనిచేస్తోంది. గృహ వినియోగదారులు, పబ్లిక్ మరియు సెమీ పబ్లిక్ మరియు బస్ ఫ్లీట్‌ల అవసరాలను తీర్చడానికి వివిధ రకాల ఛార్జింగ్ సొల్యూషన్‌లను టాటా పవర్‌ ఏర్పాటు చేసింది.

కాగా 80,000 హోమ్ ఛార్జర్‌లు, 5,300 పైగా పబ్లిక్, సెమీ పబ్లిక్ మరియు ఫ్లీట్ ఛార్జింగ్ పాయింట్‌లు మరియు 850+ బస్ ఛార్జింగ్ స్టేషన్‌లతో, టాటా పవర్ ఇ-మొబిలిటీ సొల్యూషన్స్‌లో ఛార్జ్‌లో ముందుంటుందని టాటా పవర్ వెల్లడించింది. ఇక హైదరాబాద్‌లో టాటా పవర్‌ ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్‌ను ఎక్కడ ఏర్పాటు చేసిందంటే..

హైదరాబాద్‌లో ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియం వేదికగా ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. కాగా స్టేడియంకు వచ్చే ఐపీఎల్‌ ఫ్యాన్స్‌ కోసం అక్కడి నుంచి పలు రూట్లలో మూడు ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి. మొదటిది.. క్రోమా యూనిట్‌ నెం 2&3, ప్రగతి నగర్‌, రామాంతపూర్‌ మెయిన్‌రోడ్‌. రెండవది టాటా మోటార్స్‌- సెలెక్ట్‌ కార్‌, అల్కాపురి. మూడవది ఆరెంజ్‌ ఆటో, సికింద్రాబాద్‌.

More from DriveSpark

Article Published On: Sunday, March 24, 2024, 14:13 [IST]
English summary
Tata power set up new ev charging stations near cricket stadiums for ipl fans
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+