మీకు తెలుసా.. హెచ్‌పిసిఎల్ పెట్రోల్ బంకుల్లో టాటా పవర్ ఈవి ఛార్జింగ్ స్టేషన్స్

భారతదేశంలో ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఏకంగా 100 రూపాయలు దాటేశాయి. పెరిగిన పెట్రోల్ మరియు డీజిల్ ధరలు సామాన్య మానవుడిపై పెనుభారాన్ని మోపుతున్నాయి. ఈ కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని వాహనదారులు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు. అయితే ధరలు తగ్గే సూచనలు ఏ మాత్రం కనిపించడం లేదు.

మీకు తెలుసా.. హెచ్‌పిసిఎల్ పెట్రోల్ బంకుల్లో టాటా పవర్ ఈవి ఛార్జింగ్ స్టేషన్స్

పెరిగిన ఇంధన ధరల కారణంగా వాహన వినియోగదారులు పెట్రోల్, డీజిల్‌ వాహనాలకు బదులుగా, ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి కనపరుస్తున్నారు. అయితే దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు కావలసిన మౌలిక సదుపాయాలు (ఛార్జింగ్ స్టేసన్స్) అందుబాటులో లేదు. దీనిపై వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.

మీకు తెలుసా.. హెచ్‌పిసిఎల్ పెట్రోల్ బంకుల్లో టాటా పవర్ ఈవి ఛార్జింగ్ స్టేషన్స్

అయితే ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే వారు ఇకపై ఇలాంటి భయాందోళనలకు గురి కాకూడదని, టాటా పవర్ ఒక గుడ్ న్యూస్ తీసుకువచ్చింది. ఇందులో భాగంగానే టాటా పవర్ సంస్థ హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్) తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది.

మీకు తెలుసా.. హెచ్‌పిసిఎల్ పెట్రోల్ బంకుల్లో టాటా పవర్ ఈవి ఛార్జింగ్ స్టేషన్స్

ఈ రెండు కంపెనీల ఒప్పందం ప్రకారం, హెచ్‌పిసిఎల్ పెట్రోల్ బంకర్లలో టాటా పవర్ ఈవి ఛార్జింగ్ స్టేషన్లను ఓపెన్ చేయనుంది. భారతదేశంలోని వివిధ నగరాలు మరియు ప్రధాన రహదారులలోని హెచ్‌పిసిఎల్ పెట్రోల్ బంకర్లలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఉపయోగకరంగా ఉండేదుకు మరిన్ని ఛార్జింగ్ స్టేషన్లను ప్రారంభించడానికి తగిన సన్నాహాలు జరుగుతున్నాయి.

మీకు తెలుసా.. హెచ్‌పిసిఎల్ పెట్రోల్ బంకుల్లో టాటా పవర్ ఈవి ఛార్జింగ్ స్టేషన్స్

టాటా పవర్ ఇప్పటివరకు 100 కి పైగా నగరాల్లో 500 కి పైగా పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను ప్రారంభించింది. టాటా పవర్, మెట్రో స్టేషన్, షాపింగ్ మాల్, సినిమా హాల్ మరియు హైవే వాటి ప్రాంతాల్లో ఈ ఛార్జింగ్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.

మీకు తెలుసా.. హెచ్‌పిసిఎల్ పెట్రోల్ బంకుల్లో టాటా పవర్ ఈవి ఛార్జింగ్ స్టేషన్స్

ఇప్పుడు హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, తమ పెట్రోల్ బంకర్ల వద్ద లేటెస్ట్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను కల్పిస్తాయి. నగరాల్లో మరియు వెలుపల ప్రయాణించే ఎలక్ట్రిక్ వాహనదారులకు ఈ ఛార్జింగ్ సౌకర్యం చాలా బాగా ఉపయోగపడుతుంది.

మీకు తెలుసా.. హెచ్‌పిసిఎల్ పెట్రోల్ బంకుల్లో టాటా పవర్ ఈవి ఛార్జింగ్ స్టేషన్స్

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచడానికి మౌలిక సదుపాయాలు చాలా అవసరం, కావున ఛార్జింగ్ స్టేషన్ సదుపాయాలను పెంచాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రజలు ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు.

మీకు తెలుసా.. హెచ్‌పిసిఎల్ పెట్రోల్ బంకుల్లో టాటా పవర్ ఈవి ఛార్జింగ్ స్టేషన్స్

టాటా పవర్ మరియు హిందూస్తాన్ పెట్రోలియం మధ్య ఏర్పడిన భాగస్వామ్యానికి గల ప్రధాన కారణం ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచడం. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం మరియు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక చర్యలు తీసుకుంటున్నాయి.

మీకు తెలుసా.. హెచ్‌పిసిఎల్ పెట్రోల్ బంకుల్లో టాటా పవర్ ఈవి ఛార్జింగ్ స్టేషన్స్

టాటా పవర్, హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ వంటి వాటికీ కూడా ప్రభుత్వాలు సహకరిస్తాయి. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాలు పెంచడానికి ప్రభుత్వాలు భారీ రాయితీలను కూడా కల్పిస్తున్నారు. ఎందుకంటే రాబోయే కాలంలో మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగంలో ఉండాలనే ఉద్దేశ్యంతో.

NOTE: ఇక్కడ ఉపయోగించిన ఫోటోలు కేవలం రిఫరెన్స్ కోసం మాత్రమే.

Most Read Articles

English summary
Tata Power To Setup Electric Vehicle Charging Stations At Hpcl Petrol Bunks. Read in Telugu.
Story first published: Monday, July 19, 2021, 9:53 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X