టాటా పంచ్ ఢీకొట్టడంతో బోల్తా పడిన లారీ.. ఘోర ప్రమాదంలోనూ ప్రయాణికులు సేఫ్, డ్యాష్‌క్యామ్ వీడియో వైరల్
ఎదురుగా వస్తున్న లారీని టాటా పంచ్ కారు ఢీకొట్టడంతో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అయినప్పటికీ ప్రయాణికులంతా ప్రాణాలతో బయటపడ్డారు. ఇంత ఘోర ప్రమాదంలోనూ ప్రయాణికులను కాపాడిన టాటా కార్ల నాణ్యతను చూసి కారు యజమాని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ఇంతకీ ఈ ప్రమాదం ఎక్కడ, ఎలా జరిగింది.. పూర్తి సమాచారం ఈ కథనంలో..
దేశంలో రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణమైపోయాయి. దేశ వ్యాప్తంగా ప్రతి రోజూ యాక్సిడెంట్లు వందలకొద్దీ యాక్సిడెంట్లో చోటుచేసుకుంటూనే ఉన్నాయి. నిర్లక్ష్య డ్రైవింగ్, అతి వేగం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, డ్రైవింగ్‌పై అవగాహన లేకపోవడం తదితర కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవించడం, మరణాలు పెరగుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్యను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం సైతం కీలక చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా కార్లలో స్టాండర్డ్ ఫీచర్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లను అందించాలని ఆటో మేకర్లకు నిర్దేశించింది. అందుకే కేవంల సేఫ్టీ ఫీచర్లే కాకుండా ప్రయాణికులకు మరింత భద్రత అందించేందుకు.. టాటా మోటార్స్ ఒక అడుగు ముందుకు వేసి తన కార్లను పటిష్ఠంగా నిర్మించింది.
అందువల్ల ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో టాటా కార్లు ప్రయాణికుల ప్రాణాలను కాపాడుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఉదాహరణలు అనేకం ఉన్నాయి. టాటా నెక్సాన్, టాటా సఫారీ ఇలా టాటాకు చెందిన ఏ కారు ఏ రోడ్డు ప్రమాదానికి గురైనా ప్రయాణికులను సురక్షితంగా ఉన్నాయి. తాజాగా టాటా పంచ్ మరోసారి తన బలాన్ని నిరూపించుకుంది.

ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. టాటా పంచ్ కారు యజమాని తన భార్య, ఐదేళ్ల కొడుకుతో కలిసి తిరుపతికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో పంచ్ కారు యజమాని ప్రమాదవశాత్తు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టాడు. దీంతో కారు ముందుభాగాన్ని ఢీకొన్న లారీ టైరు పగిలిపోవడంతో అదుపు తప్పి రోడ్డుపై బోల్తా పడింది.
కానీ ప్రమాదానికి కారణమైన టాటా పంచ్ కారు మాత్రం రోడ్డుపై స్థిరంగా నిలబడి ఉంది. కానీ లారీ ఢీకొట్టడంతో కారు ముందు భాగం మాత్రం పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదంలో లారీకి పెద్దగా నష్టం జరగకపోయినా.. అదుపు తప్పి రోడ్డుపై బోల్తా పడటంతో లారీలో లోడ్ చేసిన ఇసుక రోడ్డుపై పడిపోయింది.

ఘటనంలో ప్రమాదానికి పూర్తిగా పంచ్ కారు డ్రైవర్‌దే బాధ్యత. ఈ విషయాన్ని అతను కూడా స్వయంగా ఒప్పుకున్నారు. తన తప్పిదం వల్లనే ప్రమాదం జరిగిందని వెల్లడించాడు. కానీ ఈ ప్రమాదం నుంచి తన టాటా పంచ్.. కారులో ఎయిర్ బ్యాగులు సమయానికి తెరుచుకోవడంతో ప్రయాణికులను కాపాడిందని హర్షం వ్యక్తం చేశాడు.
ప్రమాదం జరిగిన సమయంలో లారీని చూసి పంచ్ కారు డ్రైవర్ కారును ఆపినట్లు చెప్పాడు. అయితే ఆగిపోయేలోపే కారు లారీకి అడ్డంగా వెళ్లడంతో ఢీకొట్టినట్లు చెప్పాడు. అయితే ఎదురుగా వస్తున్న కారును చూసి లారీ డ్రైవర్ బ్రేక్ వేశాడు. కానీ అప్పటికే లారీ కారును ఢీకొట్టింది. అందువల్ల, ఈ ప్రమాదంలో రెండు వాహనాలు కొంచెం తక్కువ వేగంతో ఢీకొట్టడంతో లారీ కూడా పెద్దగా డ్యామేజ్ అవ్వలేదు.

అయితే టైరు పగలడంతో లారీ అదుపు తప్పి రోడ్డుపై బోల్తా పడినట్లు.. కారులోని డ్యాష్‌బోర్డ్ కెమెరాలో రికార్డయిన విజువల్స్ ద్వారా తెలుస్తోంది. ఇలాంటి ప్రమాదాల సమయంలో టాటాకు సంబంధించిన ఇతర కారు మోడళ్లు లోపల ఉన్న ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈసారి టాటా పంచ్ కారు తన శారీరక బలంతో ప్రయాణికులను రక్షించింది. కార్ల భౌతికంగా ఎంత నాణ్యతగా ఉన్నా.. డ్రైవింగ్ చేసేటప్పుడు దృష్టి కేంద్రీకరించడం చాలా ముఖ్యం.


Click it and Unblock the Notifications








