ట్రక్కును ఢీకొట్టిన Tata Punch మైక్రో SUV.. ప్రయాణికులను కాపాడిన ఫీచర్లు ఇవే!

టాటా మోటార్స్‌ సంస్థ బిల్డ్‌ క్వాలిటీ కారణంగా భారత ఆటోమొబైల్‌ మార్కెట్‌లో నమ్మకమైన సంస్థగా నిలదొక్కుకుంది. ఇప్పటికే అనేక ప్రమాదాల్లో ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా బిల్డ్‌ క్వాలిటీ సహా ఇతర ఫీచర్లు కాపాడాయి.

టాటా కార్లు (Tata Cars) చాలా వరకు 4 లేదా అంతకుమించిన సేఫ్టీ రేటింగ్‌తో కొనుగోలుకు అందుబాటుకు ఉంటాయి. ముఖ్యంగా టాటా చాలా ఉత్పత్తులు 5 స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ను కలిగి ఉంటాయి. తాజాగా జరిగిన ఓ ప్రమాదం టాటా కార్ల బిల్డ్‌ క్వాలిటీని మరోసారి రుజువుచేసింది.

Tata punch and ace truck accident in noida

టాటా పంచ్‌ మైక్రో SUV.. టాటా ఏస్‌ పికప్‌ ట్రక్‌ను (Tata Punch and Ace pickup truck Accident) ఢీకొట్టింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడాలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను స్వాతి జా తన ట్విట్టర్‌ (X) హ్యాండిల్‌ ద్వారా షేర్‌ చేశారు. ఈ ఘటన అక్టోబర్ 14న జరిగినట్లు తెలుస్తోంది.

ఘటన స్థలంలోని వీడియో, ఫొటోల ఆధారంగా టాటా పంచ్‌ వాహనం.. పికప్‌ ట్రక్‌ను ఢీకొట్టింది. దీంతో నియంత్రణ కోల్పోయిన పికప్‌ ట్రక్‌ బోల్తా పడింది. అయితే ఈ ఘటనలో టాటా పంచ్‌ వాహనం ముందు భాగం కొంత డ్యామేజీ అయింది. ఈ ప్రమాదంలో పంచ్‌, పికప్‌ ట్రక్‌లోని డ్రైవర్‌, ప్రయాణికులకు స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది.

Tata punch micro SUV accident latest news

బిల్డ్‌ క్వాలిటీ కారణంగా : టాటా పంచ్‌ కారు బంపర్‌, బానెట్‌, హెడ్‌లైట్‌ స్వల్పంగా దెబ్బతిన్నాయి. ప్రమాద సమయంలో పంచ్‌ మైక్రో ఎస్‌యూవీలోని ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకున్నాయి. ఈ ప్రమాదంలో కారు సెక్యూరిటీ ఫీచర్లు, బిల్డ్‌ క్వాలిటీ కారణంగా ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

టాటా పంచ్‌ కారు గ్లోబల్‌ NCAP క్రాష్‌ టెస్ట్‌లో 5 స్టార్‌ రేటింగ్‌ను సాధించింది. పెద్దల భద్రత కోసం 17 పాయింట్లకు 16.45 పాయింట్లను సాధించింది. భద్రత పరంగా టాటా పంచ్‌ కారు అత్యంత సురక్షితమైనది. మరియు డ్యూయల్‌ ఫ్రంట్‌ ఎయిర్‌బ్యాగ్‌, ABS (యాంటీ బ్రేకింగ్‌ సిస్టమ్‌), రియర్‌ పార్కింగ్‌ సెన్సార్‌, రియర్‌ వ్యూ కెమెరా సహా అనేక కీలక సెక్యూరిటీ ఫీచర్లను కలిగి ఉంటుంది.

Tata punch micro SUV hits ace pickup truck

ఈ కారు పెట్రోల్‌ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. 1.2 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్‌ 3 సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 86bhp శక్తి, 113Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. టాటా కారు ఇంజిన్‌ 5 స్పీడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ మరియు 5 స్పీడ్‌ AMT గేర్‌బాక్స్‌లతో లభిస్తుంది.

CNG వేరియంట్‌లోనూ అదే ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్‌ 74bhp శక్తి, 95Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే ఈ ఇంజిన్‌తో 5-స్పీడ్‌ మాన్యువల్ గేర్‌బాక్స్‌ ఆప్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. పెట్రోల్‌ వేరియంట్ 18.8 -20.09 kmpl మైలేజీని ఇస్తుంది. అదే సీఎన్‌జీ వేరియంట్‌ 26.9 km/kg మైలేజీని కలిగి ఉంటుంది.

Tata punch micro SUV build quality news

డిజైన్ పరంగా టాటా పంచ్‌ ఆకట్టుకుంటుంది. ఆకర్షణీయమైన హెడ్‌లైట్లు, ఫాగ్‌లైట్లు, సిగ్నేచర్‌ గ్రిల్‌ ఆకట్టుకుంటుంది. దీంతోపాటు 4 స్పోక్‌ 16 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు 7 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్‌ ఆటో, ఆపిల్‌ కార్‌ప్లే సహా ఇతర ఫీచర్లను కలిగి ఉంది.

ప్రస్తుతం టాటా పంచ్‌ మైక్రో ఎస్‌యూవీ కారు ధర రూ.6 లక్షల నుంచి రూ.10.10 లక్షల (ఎక్స్‌షోరూం) మధ్య ఉంది. ప్రస్తుతం ఆటోమొబైల్‌ మార్కెట్‌లో మైక్రో SUV సెగ్మెంట్‌లో హ్యుందాయ్‌ ఎక్స్‌టర్‌ మైక్రో ఎస్‌యూవీ, మారుతి ఇగ్నిస్‌లకు టాటా పంచ్‌ పోటీ ఇస్తోంది.

More from DriveSpark

Article Published On: Monday, October 23, 2023, 16:46 [IST]
English summary
Tata punch micro suv hits ace pickup truck in up noida
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+