రోడ్డుపైన పల్టీలు కొట్టిన Tata Punch: అయినా సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు

ప్రముఖ దేశీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ (Tata Motors) గత సంవత్సరం టాటా పంచ్ (Tata Punch) అనే కొత్త మైక్రో SUV లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ SUV భారత మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి కూడా మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ఈ కారణంగానే అమ్మకాల్లో అగ్రస్థానంలో నిలిచింది.

ఈ మైక్రో SUV ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల ఇది వినియోగదారులకు మంచి భద్రతను కల్పిస్తుంది. దీనికి నిదర్శనంగా ఇటీవల ఒక సంఘటన జరిగింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

రోడ్డుపైన పల్టీలు కొట్టిన Tata Punch: సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు

సాధారణంగా టాటా మోటార్స్ యొక్క వాహనాలు ఎక్కువ సంఖ్యలో సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటాయి. కావున ఇవి ప్రమాదాల్లో చిక్కుకున్నప్పటికీ ఎటువంటి ప్రాణహాని కలిగించలేదు, అంతటి పటిష్టమైన సేఫ్టీ ఫీచర్స్ ఇందులో ఉంటాయి. టాటా పంచ్ లో కూడా కంపెనీ ఇటువంటి సేఫ్టీ ఫీచర్స్ అందించింది.

రోడ్డుపైన పల్టీలు కొట్టిన Tata Punch: సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు

నివేదికల ప్రకారం, నిఖిల్ రానా ఛానెల్‌లో ఒక వీడియో అప్లోడ్ చేయబడింది. ఈ వీడియోలో టాటా పంచ్ కారు ప్రమాదం చిక్కుకున్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఈ సంఘటన గుజరాత్‌లో జరిగినట్లు తెలిసింది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, టాటా పంచ్ గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెల్తూ గుజరాత్‌లోని హైవేపై డివైడర్‌ను ఢీకొట్టింది.

రోడ్డుపైన పల్టీలు కొట్టిన Tata Punch: సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు

ఢీకొట్టి దాదాపు రెండు పల్టీలు కొట్టినట్లు కూడా తెలిపారు. అయితే ఈ ఘర్షణకు ప్రధాన కారణం తెలియదు, కానీ అత్యధిక వేగం ఈ ప్రమాదానికి కారణం అయి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ప్రమాద సమయంలో కారులో 5 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. వీరిలో ఎవరికీ ప్రాణహాని జరగలేదు, కాలం స్వల్ప గాయాలు అయ్యాయి. ఇది నిజంగా గొప్ప విషయం, కారు ఎక్కువ దెబ్బ తిన్నప్పటికీ ప్రయాణికులు మాత్రం చాలా సురక్షితంగా ఉన్నారు.

రోడ్డుపైన పల్టీలు కొట్టిన Tata Punch: సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు

ఈ ప్రమాదంలో ఈ కారు యొక్క వెనుక చక్రాలలో ఒకటి ఊడిపోవడం కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. ప్రమాదానికి గురైన ఈ కారు కంపెనీ యొక్క టాప్ స్పెక్ క్రియేటివ్ వేరియంట్‌ అని తెలుస్తుంది. ఎందుకంటే వైట్ రూఫ్‌తో టొర్నాడో బ్లూ యొక్క డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్ ఇందులో మాత్రమే అందుబాటులో ఉంది. కానీ ఇది మాన్యువల్ లేదా AMT వేరియంట్ అనేది స్పష్టంగా తెలియలేదు.

రోడ్డుపైన పల్టీలు కొట్టిన Tata Punch: సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు

టాటా పంచ్ అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ABS విత్ EBD, చైల్డ్ సీట్ల కోసం ISOFIX మౌంట్‌లు, బ్రేక్ స్వే కంట్రోల్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు మరియు రియర్ కెమెరా వంటి సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే AMT వేరియంట్ ట్రాక్షన్ ప్రో ఫీచర్‌ను కూడా పొందుతుంది.

రోడ్డుపైన పల్టీలు కొట్టిన Tata Punch: సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు

టాటా మోటార్స్ యొక్క టాటా పంచ్ మైక్రో SUV అత్యంత సురక్షితమైన వాహనం. ఇటీవల గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఈ కారు సేఫ్టీ విషయంలో 5 స్టార్ రేటింగ్‌ పొంది అత్యంత సురక్షితమైన వాహనంగా నిలిచింది. కావున మార్కెట్లో ఈ కారుకి మరింత డిమాండ్ పెరిగింది.

రోడ్డుపైన పల్టీలు కొట్టిన Tata Punch: సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు

Tata Punch మైక్రో SUV కంపెనీ కొత్త ఎజైల్ లైట్ ఫ్లెక్సిబుల్ అడ్వాన్స్‌డ్ (ALFA) ఆర్కిటెక్చర్‌పై ఆధారపడింది. ఈ SUV పరిమాణం పరంగా కూడా అద్బుతంగా ఉంటుంది. ఈ కాంపాక్ట్ SUV పొడవు 3,827 మిమీ, 1,742 మిమీ వెడల్పు మరియు 1,615 మిమీ ఎత్తు, 2,445 మిమీ వీల్‌బేస్ మరియు 187 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంటుంది.

రోడ్డుపైన పల్టీలు కొట్టిన Tata Punch: సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు

కొత్త Tata Punch అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ కొత్త SUV లో సిగ్నేచర్ గ్రిల్ చూడవచ్చు. ఇందులోని టాటా బ్రాండ్ లోగో ఎల్ఈడీ డిఆర్ఎల్ కి కనెక్ట్ చేయబడి మధ్యలో ఉంటుంది. హెడ్‌లైట్ ఇరువైపులా ఉంది. ఫాగ్ లైట్ దాని క్రింద ఉంచబడింది. Tata Punch యొక్క సైడ్ ప్రొఫైల్ ఫోర్-స్పోక్ 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ORVM లపై టర్న్ ఇండికేటర్‌లు, డ్యూయల్ టోన్ ఎక్స్‌టీరియర్ ఉన్నాయి.

రోడ్డుపైన పల్టీలు కొట్టిన Tata Punch: సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు

Tata Punch యొక్క ఇంటీరియర్ డ్యూయల్-టోన్ థీమ్‌లో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో బ్లాక్ అండ్ వైట్ కలర్ ఉపయోగించబడింది. ఇదే డ్యూయెల్ టోన్ కలర్ దాని డాష్‌బోర్డ్‌లో కనిపిస్తుంది. ఇది కాకుండా, దానిలో కనిపించే AC వెంట్‌లపై బ్లూ హైలైట్‌లు మరియు లోపలి డోర్ హ్యాండిల్స్‌లో వైట్ ఇన్సర్ట్‌లు ఉపయోగించబడ్డాయి. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

Tata Punch 1.2-లీటర్, త్రీ-సిలిండర్, రివోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పి పవర్ మరియు 3,300 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్స్ పొందుతుంది.

రోడ్డుపైన పల్టీలు కొట్టిన Tata Punch: సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త టాటా పంచ్ ధర రూ. 5.49 లక్షల నుంచి రూ. 9.09 లక్షల మధ్యలో ఉంది. Tata Punch నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి ప్యూర్, అడ్వెంచర్, ఆకాంప్లిస్డ్ (Accomplished) మరియు క్రియేటివ్‌ వేరియంట్స్. ఈ నాలు వేరియంట్లు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో అందించబడతాయి. దేశీయ మార్కెట్లో ఆవిష్కరించబడిన కొత్త Tata Punch మొత్తం 7 కలర్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి ఓర్క్స్ వైట్, అటామిక్ ఆరెంజ్ ,డేటోనా గ్రే, మెటోర్ బ్రాంజ్, కాలిప్సో రెడ్, ట్రాపికల్ మిస్ట్ మరియు టోర్నాడో బ్లూ కలర్స్.

More from DriveSpark

Article Published On: Sunday, January 9, 2022, 8:00 [IST]
English summary
Tata punch micro suv rolls over but saved passengers details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+