టాటా "సర్‌ పంచ్‌ జీ".. కారు యజమాని క్రియేటివిటీకి మెచ్చి మాంచి గిఫ్ట్‌ ఇచ్చిన పోలీసులు

సాధారణంగా కొందరు తమ వాహనాలపై వారి పేరు లేదా దేవుడి పేర్లను స్టిక్కర్లుగా అతికించుకోవడం చూస్తూ ఉంటాం. ఇది ట్రాఫిక్‌ నిబంధనలకు విరుద్ధం కాదు. కానీ ఇక్కడ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా కారు పేరునే మార్చేశాడు. టాటా పంచ్‌ కారు వెనుక నేమ్‌ ప్లేట్‌కు రెండు వైపులా ఓ పేరును రాసుకున్నాడు.

ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పోలీసుల దృష్టికి వెళ్లింది. ఇంకేముంది మోటారు వాహన చట్టం నిబంధనలను ఉల్లంఘించినందుకు సదరు వ్యక్తికి ట్రాఫిక్‌ పోలీసులు జరిమానా విధించారు. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ చోటుచేసుకుంది. అతను ఏం చేశాడు.. పూర్తి వివరాలు ఈ కథనంలో..

Tata-Punch-SUV-Owner-Creativity

ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాకు చెందిన ఓ కారు యజమాని ఏకంగా తన టాటా పంచ్(Tata Punch SUV) SUV పేరును మార్చేశాడు. అదెలా అంటే.. 'Punch' లోగోకు ఎడమ వైపున హిందీలో 'సర్' అని, కుడి వైపున 'జీ' అని రాశారు. ఈ మొత్తాన్ని కలిపి చదివితే..'సర్పంచ్ జీ' అవుతుంది. ఇంకా అంతటితో వదిలేయకుండా ఆ పేరు కింద కుడివైపు హిందీలో 'గుర్జర్‌' అని రాయించారు.

దీనిని ఫొటో తీసి కొందరు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇంకేముంది అప్పటి నుంచి ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌ అవ్వడంతో పాటు.. దీనిపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందించారు. ఈ వైరల్‌ ఫొటో గ్రేటర్‌ నోయిడా ట్రాఫిక్‌ పోలీసుల దృష్టికి వెళ్లడంతో కారు యజమాని సందీప్ భాటిపై చర్యలు తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇలా పేరు రాసినందుకు అతనికి రూ. 500 జరిమానా విధించారు.

ఇక టాటా పంచ్ ఎస్‌యూవీ విషయానికొస్తే.. ఈ కారు బేస్‌ వేరియంట్‌ ధర దేశీయ మార్కెట్లో రూ. 6 లక్షల ఎక్స్‌షోరూమ్‌ ధరతో ప్రారంభమవుతుంది. టాప్‌ ఎండ్‌ వేరియంట్‌ ధర రూ. 10.10 లక్షలు. టాటా పంచ్‌ ఎస్‌యూవీ పెట్రోల్ మరియు CNG ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు.

టాటా పంచ్‌ ఎస్‌యూవీ.. వేరియంట్ ఆధారంగా 20.09 kmpl మైలేజ్‌ని అందిస్తుంది. ఇక ఇందులో ఆకర్షణీయమైన, అధునాతన ఫీచర్లు ఉన్నాయి. 7-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, ఎయిర్ కండిషన్, క్రూయిజ్ కంట్రోల్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్‌లు ఇంకా డజన్ల కొద్దీ ఇతర ఫీచర్లతో ఈ కారును టాటా రూపొందించింది.

కాగా గతంలోనూ కొందరు కార్ల యజమానులు తమ కార్లపై కుల, మతాలకు సంబంధించి పేర్లు, గుర్తు వాడటంతో యూపీ పోలీసు అధికారులు వారిపై చర్యలు తీసుకున్నారు. కార్లు లేదా బైక్‌లు ఇలా ఏ వాహనాలు అయినా ముందు, వెనుక భాగంలో కులం పేర్లను రాస్తే జరిమానా విధించాలని.. గత ఆగష్టులో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు.

సీఎం ఆదేశాల ప్రకారం ఘజియాబాద్, నోయిడా పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన దాదాపు 2300 మంది వాహన యజమానులకు జరిమానా విధించారు. ఇంకా ఇలాంటి చర్యలకు పాల్పడితే మోటారు వాహనాల చట్టం కింద కేసు నమోదు యూపీ ప్రభుత్వం కేసు నమోదు చేయనుంది.

More from DriveSpark

Article Published On: Friday, October 13, 2023, 18:23 [IST]
English summary
Tata punch owner creativity with suv name on his car police issued challan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+