Tata Punch వాహనానికి భారీ ప్రమాదం.. వాహనం సేఫ్టీ ఫీచర్లపై యజమాని కీలక వ్యాఖ్యలు!
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశాల్లో భారత్ కూడా ఉంది. అయితే ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అయితే చాలా ప్రమాదాల్లో కార్ల సేఫ్టీ ఫీచర్లు, బిల్డ్ క్వాలిటీ కారణంగా భారీ ప్రమాదాల్లోనూ సురక్షితంగా గాయపడిన సంఘటనలు అనేకం ఉన్నాయి. తాజాగా అటువంటి ఘటన జరిగింది.
టాటా పంచ్ వాహనంలో గుజరాత్‌లోని అంక్లేశ్వర్ మరియు బార్డోలీ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్నాడు. ప్రయాణంలో ఉండగా టాటా పంచ్ కారు తప్పిందని యజమాని తెలిపారు. అయితే అందుకు గల కారణాలను వెల్లడించలేదు. ఈ ప్రమాదంపై ఇచ్చిన నివేదికలోనూ పంచ్ వాహనం నియంత్రణ కోల్పోవడానికి సరైన కారణం వెల్లడించలేదు.

అయితే ఈ ఘటనకు సంబంధించిన ఫోటోల ఆధారంగా.. వాహనం నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడినట్లు తెలుస్తోంది. దీంతో పంచ్ వాహనం భారీగా డ్యామేజీ అయినట్లు కనిపిస్తోంది. కారు ముందు చక్రం విరిగిపోవడం సహా సస్పెన్షన్ సిస్టమ్ బయటకు రావడం గమనించవచ్చు.
ఈ ప్రమాద సమయంలో టాటా పంచ్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్‌లు సరైన సమయానికి తెరుచుకున్నట్లు కారు యజమాని తెలిపారు. ఘటన సమయంలో సీట్ బెల్ట్ ధరించినట్లు చెప్పాడు మరియు బిల్డ్ క్వాలిటీ కారణంగా సురక్షితంగా బయటపడినట్లు సంతోషం వ్యక్తం చేశారు. వాహనాలను కొనుగోలు చేసే సమయంలో ఫీచర్లు, డిజైన్ కంటే సురక్షితమైన కారును కొనుగోలు చేయడం ఉత్తమం అని సూచించాడు.

టాటా పంచ్ 2021లో గ్లోబల్ NCAP క్రాష్ పరీక్షలను ఎదుర్కొంది. పెద్దల రక్షణలో 17 పాయింట్లకు గానూ 16.45 పాయింట్లను సాధించి, దేశంలో అందుబాటులో ఉన్న అత్యంత సురక్షితమైన కారుగా నిలిచింది. అదే విధంగా చిన్నారుల రక్షణలో 49 పాయింట్లకు 40.89 స్కోర్‌ను సొంతం చేసుకుంది.
మైక్రో ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో టాటా పంచ్ 2021 నవంబర్‌లో విడుదల అయింది. నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ప్యూర్, అడ్వెండర్, అకాంప్లిష్డ్, క్రియేటివ్ వేరియంట్లలో లభిస్తుంది. పంచ్ మైక్రో ఎస్‌యూవీ 1.2 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను అందిస్తుంది. మరియు 5-స్పీడ్ మాన్యువల్, 5- స్పీడ్ AMT గేర్‌బాక్స్‌లో లభిస్తుంది. ఈ ఇంజిన్ గరిష్ఠంగా 86PS శక్తి, 113Nm గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

Bharat NCAP క్రాష్ టెస్ట్ నుంచి లీక్ అయిన వివరాల ఆధారంగా టాటా పంచ్ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. క్రాష్ టెస్టుల్లో పాల్గొంది బేస్ వేరియంట్‌గా తెలుస్తోంది. అయితే ఈ టాటా పంచ్ అన్ని వేరియంట్లు కూడా కీలక భద్రతా ఫీచర్‌లతో వస్తాయని తెలుస్తోంది.
టాటా పంచ్ వాహనం మరిన్ని స్టాండర్డ్ భద్రతా ఫీచర్లతో వస్తుంది. ABS- యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, EBD, రియర్ పార్కింగ్ సెన్సార్లు, సెంట్రల్ లాకింగ్ వంటి కీలక ఫీచర్లను కలిగి ఉంటాయి. అదే హై ఎండ్ మోడళ్లు హోం హెడ్‌ల్యాంప్, యాంటీ గ్లేర్ రియర్‌వ్యూ మిర్రర్, రివర్స్ పార్కింగ్ కెమెరా, ట్రాక్షన్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








