ఒక్క నిమిషం ఆలస్యమై ఉంటే?.. భయపెడుతున్న వీడియో!
భారతదేశంలో అనేక సంఘటన వల్ల వాహనాలు ప్రమాదాల్లో చిక్కుకుంటాయి. ఈ ప్రమాదాలలో వాహనాలు దెబ్బ తినొచ్చు లేదా ప్రయాణికుల ప్రాణాలు కూడా పోవచ్చు. అయితే కొన్ని ఘటనలు మాత్రం చూడగానే ఒక్కసారిగా భయాన్ని కలిగిస్తుంటాయి. అలంటి ఘటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో టాటా పంచ్ మైక్రో SUV లోయలోకి పడిపోతుంది. ఆ సమయంలో కారు నుంచి డ్రైవర్ కిందికి పడటం కూడా చూడవచ్చు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది? ప్రమాదంలో ఎవరైనా గాయాలయ్యాయా.. అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ టాటా పంచ్ కారును ఇద్దరు వ్యక్తులు నెట్టడం చూడవచ్చు. అదే సమయంలో కారు లోపల ఒక వ్యక్తి స్టీరింగ్ పట్టుకుని ఉన్నారు. కానీ ఆ ప్రాంతం మొత్తం ఏటవాలుగా ఉండటం వల్ల.. నియంత్రణ కోల్పోయి లోయలోకి జారుతుంది. ఆ సమయంలో స్టీరింగ్ దగ్గర ఉన్న వ్యక్తి ప్రాణాలు కాపాడుకోవడం కోసం బయటకు దూకేస్తాడు.

లోయలోకి పడిన కారు నెంబర్ ప్లేట్ జేకే అని ఉండటం వల్ల ఈ ప్రమాదం జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో జరిగినట్లు భావిస్తున్నాము. ఏదో అనుకోని ప్రమాదంలో రోడ్డు మీద నుంచి జారీ వాలులో ఇరుక్కున్నట్లు తెలుస్తోంది. దీనిని ఇద్దరు మనుషులు నెట్టే సమయంలో కంట్రోల్ తప్పిపోయి కిందికి జారిపోతుంది. ఇదంతా వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియో చూస్తే ఎవ్వరికైనా ఒకింత భయం కలుగుతుంది.
నిజానికి టాటా పంచ్ ప్రమాదంలో ఇరుక్కున్నప్పుడు.. దాన్ని సురక్షితంగా బయటకు నెట్టడానికి ప్రయత్నించారు. అయితే ఫ్రంట్ వీల్ డ్రైవ్ పంచ్ వాలుపైన వదులుగా ఉండటం వల్ల వెనక్కు వచ్చేసింది. ఈ సమయంలో డ్రైవర్ కూడా ఏమి చేయలేడు, కాబట్టి అది లోయలోకి జారిపోయింది. గ్రావిటీ తన పని తీను చేయడం వల్ల.. కారు కిందికి వెళ్ళింది. డ్రైవర్ సమయస్ఫూర్తితో తప్పించుకోగలిగాడు.

వీడియోలో కనిపించే కారుతో వారు నిజంగా ఆఫ్ రోడ్ ప్రయత్నించారా? లేక అనుకోకుండా ప్రమాదంలో చిక్కుకుందా? అనే విషయం స్పష్టంగా తెలియడం లేదు. కానీ ఈ ప్రమాదంలో ఎవరికీ పెద్దగా ప్రమాదం జరగలేదు. డ్రైవర్ సరైన సమయానికి కిందికి దూకేయడం వల్ల ప్రాణాలతో బయటపడ్డాడు. నిమిషం ఆలస్యమైనా.. కారుతో పాటు అతడు కూడా లోయలోకి పడే అవకాశం ఉండేది. అయితే అలాంటివేవీ జరగలేదు.
పంచ్ లోయలోకి పడే సమయంలో దొర్లుకుంటూ వెళ్ళిపోతుంది. మొత్తానికి అందరూ సురక్షితంగా బయటపడగలిగారు. నిజానికి ఫ్రంట్ వీల్ డ్రైవ్ కార్లను ఇలాంటి భూభాగాల్లో డ్రైవ్ చేయడం చాలా కష్టం. ఆల్ వీల్ డ్రైవ్ లేదా 4×4 సిస్టం కలిగిన కార్ ఇలాంటి ప్రదేశాల్లో డ్రైవ్ చేయడానికి కొంత అనుకూలంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ.. ఇలాంటి ఏటవాలుగా ఉండే ప్రదేశంలో కారును నడపడం ప్రమాదం.
నిజానికి దేశీయ విఫణిలో అందుబాటులో ఉన్న టాటా పంచ్ అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటి. ఇది ఆఫ్-రోడింగ్ కెపాసిటీ కూడా కలిగి ఉంటుంది. ఈ కారు ప్రస్తుతం ఎలక్ట్రిక్ రూపంలో కూడా అందుబాటులో ఉంది. ఈ మైక్రో SUV దేశీయ మార్కెట్లో లాంచ్ .. విపరీతమైన అమ్మకాలు పొందగలిగింది. అయితే ఏటవాలుగా ఉండే ప్రదేశాల్లో ఎలాంటి కార్లయినా పట్టు తప్పుతాయి. కాబట్టి ఇలాంటి ప్రదేశాల్లో కార్లతో ఎలాంటి సాహసాలు చేయకూడదు.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








