సేఫ్టీలో మంచిగా ఉందని ఇలా చేయొచ్చా: టాటా పంచ్‌లో 700 కేజీల లోడ్.. అలాగే 125 కిమీ ప్రయాణం
సేఫ్టీలో 5 స్టార్ట్ రేటింగ్ పొందిన టాటా మోటార్స్ యొక్క టాటా పంచ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేశీయ మార్కెట్లో విడుదలైన అతి తక్కువ కాలంలోనే ఊహకందని అమ్మకాలతో దూసుకెళ్లింది. అయితే ఇటీవల ఒక వ్యక్తి ఈ టాటా పంచ్ SUV ని కమర్షియల్ వాహనంగా వినియోగించాడు.
నిజానికి టాటా పంచ్ మంచి గ్రౌండ్ కక్లియరెన్స్ కలిగి ఉండటం వల్ల ఎలాంటి రోడ్డులో అయినా సజావుగా ముందుకు సాగుతుంది. అయితే వ్యక్తిగత వినియోగం కోసం తాయారు చేయబడిన ఈ కారుని ఒక వ్యక్తి కమర్షియల్ పర్పస్ కింద ఉపయోగించాడు. ఇందులో భాగంగానే టాటా పంచ్ లోపల దాదాపు 700 కేజీల బరువును ఉంచాడు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇందులో టాటా పంచ్ యజమాని నారింజ, బొప్పాయి పండ్లు కొన్ని చెక్క ట్రేలలో నింపి ఉంచాడు. ఈ చెక్క ట్రేలన్నింటిని కూడా అతడు రెండవ వరుసలో, వెనుక ఉన్న బూట్ స్పేస్ లో కూడా ఉంచాడు. అయితే ఆ ట్రేలను అలాగే ఓపెన్ చేసి వదిలేసాడు. అయితే ప్రయాణించేటప్పుడు ఆ ట్రేలో ఉన్న పండ్లు కిందికి పడే అవకాశం ఉంటుంది. ఆ పండ్లు డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవర్ కాలికింద పడితే అప్పుడు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది.
మొత్తం 700 కేజీల బరువును టాటా పంచ్ SUV లో వేసుకుని అతడు దాదాపు 125 కిమీ దూరం ప్రయాణించాడు. ఈ ప్రయాణంలో టాటా పంచ్ ఒక లీటరుకి 18 కిమీ మైలేజ్ అందించిందని డ్రైవర్ పేర్కొన్నాడు. నిజంగా ఇది గొప్ప విషయమే. వ్యక్తిగత ఉపయోగానికి ఉపయోగించాల్సిన టాటా పంచ్ మైక్రో SUV 700 కేజీల లగేజ్ తీసుకెళ్లే సమయంలో కూడా మంచి మైలేజ్ అందించింది.

చెప్పాలంటే టాటా పంచ్ వంటి వాటిని వ్యక్తిగత ఉపయోగాల కోసం తయారు చేశారు. అయితే రవాణా కోసం వీటిని వినియోగిస్తే అనుకోను ప్రమాదం జరగవచ్చు, కావున టాటా పంచ్ వినియోగదారులు ఇలాంటి సాహసాలకు పాల్పడకుండా ఉండటం మంచిది. రవాణా కోసం దేశీయ మార్కెట్లో ప్రత్యేకించి కొన్ని వాహనాలు ఉన్నాయి. అలాంటి వాహనాలను మాత్రమే రవాణాకు వినియోగించాలి. లేకుంటే అనుకోని ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంటుంది, దీనిని తప్పకుండా గుర్తుంచుకోవాలి.
టాటా పంచ్ దేశీయ మార్కెట్లో లభిస్తున్న అత్యంత సురక్షితమైన వాహనాలలో ఒకటి. మనం వినియోగించే వాహనం సురక్షితం అయితే సరిపోదు, సురక్షితమైన డ్రైవింగ్ కూడా చాలా అవసరం, కావున వాహనం డ్రైవ్ చేసేటప్పుడు నిర్దేశించిన స్పీడ్ లిమిట్ ఉండాలి, టైర్ ప్రెజర్ మెయింటైన్ చేయడం వంటివి కూడా చేయాలి. వాహనంలో నిర్దేశించిన బరువు కంటే కూడా ఎక్కువ బరువుని మోసుకెళ్లకూడదు. ఇది కూడా ప్రమాదహేతువే.
టాటా పంచ్ విషయానికి వస్తే, ఇది దేశీయ మార్కెట్లో ఉన్న అత్యంత సేఫెస్ట్ వాహనం. ఇది మంచి డిజైన్ కలిగి ఉండటమే కాకుండా ఆధునిక ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇందులో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగులు, 90 డిగ్రీ ఓపెనింగ్ డోర్స్, రివర్స్ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మరియు ఏబీఎస్ విత్ ఈబిడి వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి.
టాటా పంచ్ 1.2-లీటర్, త్రీ-సిలిండర్, రివోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పి పవర్ మరియు 3,300 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్స్ పొందుతుంది. కావున మంచి పని తీరుని అందిస్తుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








