బాలుడి తల తగిలి విండ్‌షీల్డ్‌ డ్యామేజ్‌.. టాటా పంచ్‌ కారు వీడియో వైరల్‌.. కానీ!

టాటా పంచ్‌ భద్రత పరంగా ఇప్పటికే అనేక ప్రశంసలు అందుకుంది. ఈ కారు అత్యంత భద్రతా ఫీచర్లను కలిగి ఉంది. గ్లోబల్‌ NCAP రేటింగ్‌లో 5 స్టార్‌ రేటింగ్‌ను కలిగి ఉంది. ప్రస్తుతం భారత్‌లో అందుబాటులో ఉన్న అత్యంత భద్రత కలిగిన కార్లలో టాటా పంచ్‌ కారు ఒకటి.

ప్రస్తుతం టాటా పంచ్‌ కారుకు సంబంధించి ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఫలితంగా కారు భద్రతపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ టాటా పంచ్ కారు వీడియోను ఓ Reddit యూజర్‌ పోస్టు చేశారు. టాటా పంచ్‌ కారులో కూర్చున్న బాలుడు తన తలతో అనుకోకుండా ఫ్రంట్‌ విండ్‌ షీల్డ్‌ను ఢీకొట్టడాన్ని ఈ వీడియోలో గమనించవచ్చు. ఫలితంగా విండ్‌ షీల్డ్‌ డ్యామేజీ అవుతుంది.

Tata punch windshield damage due to kid in front seat

అయితే ఈ ఘటనలో బాలుడికి ఎటువంటి గాయాలు కాలేదు. ప్రస్తుతం ఈ ఘటన ఆన్‌లైన్‌లో పలువురి మధ్య చర్చకు దారితీసింది. అయితే ఇలాంటి ఘటనలు కారు భద్రతపై ఎటువంటి అనుమానాలు కలిగించవని గుర్తుంచుకోవాలి. కారు విండ్‌షీల్డ్‌ చాలా సున్నితంగా ఉంటుంది. ఫలితంగా ఏదైనా వస్తువు, లేదా ప్రమాదం కారణంగా విరిగిపోయే అవకాశం ఉంటుంది.

సాధారణంగా అన్ని కార్లు వాటి నిర్మాణ డిజైన్‌ ఆధారంగా భద్రతను అంచనా వేస్తారు. విండ్‌ షీల్డ్‌, ఇతర బాడీ ప్యానల్‌లు డ్యామేజీ కావడం కారణంగా వాటి భద్రతను అనుమానించలేము. అయితే కొంత మంది డోర్ ప్యానల్, హుడ్‌ సహా ఇతర విభాగాలపై బలంగా కొట్టడం ద్వారా భద్రతా కోణంలో పరీక్షలు చేసేందుకు ప్రయత్నం చేస్తారు. భద్రతను తనిఖీ చేసేందుకు ఇది సరైన పద్దతి కాదు.

Tata punch windshield damage due to kid in front seat

గ్లోబల్‌ NCAP పరీక్షల్లో కారు బిల్డ్‌ క్వాలిటీ సహా ఇతర పరీక్షల ఆధారంగా భద్రత రేటింగ్‌ను ఇస్తారు. టాటా పంచ్‌ కారు ఈ సెగ్మెంట్‌లో గ్లోబల్‌ NCAP టెస్టింగ్‌లో 5 స్టార్‌ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. పెద్దల రక్షణలో ఈ టాటా పంచ్‌ కారు 17 పాయింట్లకు గానూ 16.49 పాయింట్లు సాధించింది. మరియు భారత మార్కెట్‌లో విక్రయించబడిన అత్యధిక స్కోరింగ్‌ కలిగిన కార్లలో ఒకటిగా నిలిచింది.

అయితే గ్లోబల్‌ NCAP తాజా మార్గదర్శకాల ప్రకారం 5 స్టార్‌ రేటింగ్‌ పొందేందుకు టాటా పంచ్‌ కారు అర్హత లేదని తెలుస్తోంది. గతంలో ఉన్న ప్రోటోకాల్స్‌ ఆధారంగా టాటా పంచ్‌ కారుకు రేటింగ్‌ ఇచ్చారు.
అయితే భారత్‌లో అక్బోబర్‌ 1 నుంచి BNCAP (భారత్‌ న్యూ కార్ అసెస్‌మెంట్‌ ప్రోగ్రాం) అమల్లోకి రానుంది. ఫలితంగా భారత్‌లో తయారయ్యే కార్లను BNCAP కింద రేటింగ్‌ ఇస్తారు.

BNCAP కూడా గ్లోబల్‌ NCAP కలిగిన ప్రోటోకాల్స్‌ను కలిగి ఉంది. ఫలితంగా కార్ల తయారీదారులు తమ ఉత్పత్తులను పరీక్షల కోసం ఇతర దేశాలకు పంపించాల్సిన అవసరం లేదు. దీంతో సమయం, డబ్బు రెండు ఆదా కానున్నాయి. BNCAP రేటింగ్‌ వ్యవస్థను కార్ల తయారీ సంస్థలు మారుతి సుజుకి, టాటా, టయోటా, కియా, స్కోడా, మహీంద్రా వంటి సంస్థలు స్వాగతించాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, August 14, 2023, 13:42 [IST]
English summary
Tata punch windshield damage after hits by kid in front seat
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+