విన్యాసాలు చేద్దామని ఒకచోటికి చేరారు... కానీ అనుకోకుండా..!!
అప్పుడప్పుడు విన్యాసాలు చేయడం భలే సరదాగా ఉంటుంది. కానీ అనుకోకుండా ఏదైనా జరిగినప్పుడు సరదాగా చేసిన పనులే ప్రమాదాలకు దారితీస్తాయి. ఈ తాజా ఘటనలో టాటా సఫారీ స్టోర్మ్ మరియు హ్యుందాయ్ శాంత్రో పరస్పరం ఢీకొట్టిన ఘటనలో శాంత్రో ముందు భాగం దెబ్బతింది.
అయితే ఈ ఘటనలో ఎవరు గాయపడలేదు. విన్యాసాలు చేయడం ఎంత ప్రమాదకరమో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. విన్యాసాలు చేస్తున్నప్పుడు వాహనం డ్రైవింగ్ చేసే వ్యక్తి నైపుణ్యాలను పరీక్ష చేస్తున్నట్లు అనిపిస్తుంది. టాటా సఫారి డ్రైవర్, హ్యుందాయ్ శాంత్రో కారు నడుపుతున్న వ్యక్తి బహుశా పరస్పం ఢీకొడతామని ఊహించి ఉండరు.

సాధారణంగా విన్యాసాలు చేసేటప్పుడు డ్రైవర్ చాలా అప్రమత్తంగా ఉండాలి. యాక్సిలరేటర్, బ్రేక్, క్లచ్‌పై పూర్తి నియంత్రణ ఉండాలి. లేదంటే ప్రమాదాలు జరగడం ఖాయం. ఈ వీడియోను హ్యుందాయ్ శాంత్రో యాజమాని షేర్ చేశారు. విన్యాసాలు చేసేందుకు కొందరు తమ కార్లను ఈ ప్రాంతానికి తీసుకొచ్చారు. టాటా సఫారీ స్మార్మ్ కారు అదుపుతప్పి శాంత్రోను ఢీకొట్టింది.
అయితే ఇలాంటి ప్రయత్నాలు కూడా ప్రమాదాలుగా మారతాయి. రెండు కార్లు పరిమిత వేగంతో ప్రయాణిస్తుండడం వల్ల ఎవరికీ గాయాలు కాలేదు. అందువల్లనే పబ్లిక్ రోడ్లపై ఇలాంటి విన్యాసాలు చేయడం నేరం, మరియు ఉల్లంఘనలకు పాల్పడితే భారీ జరిమానాలతోపాటు జైలు శిక్ష అనుభవించాల్సి రావచ్చు. ఇలాంటి విన్యాసాలు చేసి వీడియోలు తీసుకోవాలనుకుంటే ప్రైవేటు ప్రదేశాలు లేదా రేస్ ట్రాక్, ఫాం హౌస్‌లో చేసుకోవాలి.
ప్రస్తుతం అన్ని మెట్రోపాలిటన్ నగరాల్లో సీసీ టీవీ కెమెరాలు ఉన్నాయి. పోలీసు ప్రత్యేక బృందాలు సీసీ టీవీ వీడియోలను ఎప్పుడూ పరిశీలిస్తునే ఉంటారు. రోడ్లుపై ఎక్కడైనా విన్యాసాలు చేయడం మరియు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వీడియోల ఆధారంగా చలాన్లు సహా చట్టపరమైన చర్యలను పోలీసులు తీసుకుంటారు.
సీసీ టీవీ వీడియోలతో పాటు, ఎవరైనా ఇలాంటి విన్యాసాలు చేసి వాటిని సోషల్ మీడియాల్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. పోలీస్, నిఘా బృందాలు ఆయా వీడియోలను సేకరించి, చలాన్ వేసే అవకాశం కూడా ఉంటుంది. ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లోని పోలీసులు.. రోడ్లపై ఉన్న సీసీటీవీ కెమెరాల వీడియోలను ఉపయోగించి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసేవారిని గుర్తించి చర్యలు తీసుకుంటారు.
రోడ్లపై సిగ్నల్ జంప్ చేయడం, జీబ్రా క్రాసింగ్ వద్ద స్టాప్ లైన్ దాటి వెళ్లడం, నో స్టాప్ జోన్లలో వాహనాలు నిలపడం సహా స్పీడ్ లిమిట్‌కు మించి వేగంతో వాహనాలు డ్రైవింగ్ చేయడం వంటి నేరాలకు కూడా శిక్షలు వేస్తుంటారు.
భారత్ దేశంలో ప్రస్తుతం అధిక సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రపంచంలో మొత్తం ప్రమాదాల రేట్ అధికంగా ఉన్న దేశాల్లో భారత్ ఉండడం ఆందోళనకర అంశం. రోడ్లపై నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం కారణంగా అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇందులో అధిక శాతం ప్రాణాలు కోల్పోతున్నారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








