Tata సఫారీని ఢీకొట్టిన బస్సు.. పిల్లర్, బస్సు మధ్య ఇరుక్కున్న కారు.. క్రాస్ సేఫ్టీ టెస్ట్ చేయించి ఉంటే!
కార్లు కొనుగోలు చేసేటప్పుడు డిజైన్, ఫీచర్లే కాకుండా సేఫ్టీ ఫీచర్లు కూడా ఎంతవరకు ఉన్నాయో ఓసారి పరిశీలించుకోవడం మంచిది. ఎలాంటి ప్రమాదాలు జరిగినా.. వాహనం లోపల ఉన్న ప్రయాణికులు క్షేమంగా బయటపడే సేఫ్టీ ఫీచర్లు ఉన్న వాహనాలను కొనుగోలుచేయడం మంచిది.
Tata సఫారీ కారును గవర్నమెంట్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు బాడీ చాలా వరకు దెబ్బతింది. జమ్ము రాజౌరి- పూంచ్ జాతీయరహదారి పైనున్న లంబేరీ ప్రాంతంలో జరిగింది. లంబేరీ ప్రాంతంలో అతివేగంగా వచ్చిన బస్సు.. ఎదురుగా వస్తున్న టాటా సఫారీ కారును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో నిర్మాణాలు జరుగుతున్నాయి. వాహనదారులు భద్రత కోసం అధికారులు అక్కడ బారికేడ్లు ఏర్పాటుచేశారు. ఫలితంగా ఆ రహదారి చిన్నగా మారింది.

అతివేగంతో ఉన్న బస్సును డ్రైవర్ నియంత్రించలేకపోయారు. అందువల్ల ఎదురుగా వచ్చిన టాటా సఫారీని ఢీకొట్టాడు. దీంతో ఆ కారు... బస్సు మరియు మరో వైపు నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ పిల్లర్‌కు మధ్య చిక్కుకుపోయింది. సఫారీ డ్రైవర్ చమన్‌లాల్ గాయాలతో బయటపడ్డారు. అతన్ని వెంటనే స్థానిక హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అయితే బస్సులో ఉన్న ప్రయాణికులు ఎవరికి గాయాలు కాలేదు.
ఈ ఘటనలో కారు ఎడమభాగం అంటే ఫ్లైఓవర్‌ను ఢీకొట్టిన భాగం భారీగా దెబ్బతింది. అదే బస్సు ఢీకొట్టిన చోట డ్రైవర్ కూర్చొనే సీట్ వద్ద కారు బాడీ కొంత లోపలికి వచ్చింది. Tata సఫారీ కారును బస్సు ఓవైపు నుంచి ఢీకొట్టింది. దీంతో ముందున్న ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోలేదు. అయితే ఈ కారుకు సైడ్ ఎయిగ్‌బ్యాగ్ వ్యవస్థ లేదు.
అధిక సంఖ్యలో ఉన్న Tata మోటార్స్ కార్లు.. గ్లోబల్ NCAP పరీక్షలు చేస్తున్నా.. క్రాస్ సేఫ్టీ టెస్ట్‌లకు పంపించలేదు. టాటా సఫారీ, హారియర్ రెండు కార్లను క్రాస్ టెస్ట్‌లకు పంపించలేదు. అయితే టాటా సఫారీని క్రాస్ టెస్ట్‌లకు పంపకపోవడానికి గల కారణాలను మాత్రం టాటా మోటార్స్ వెల్లడించలేదు.
మల్టీజెట్ ఇంజిన్ కలిగిన టాటా హారియర్ మాత్రం ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఇంజిన్ భాగం డ్రైవర్ సీటు వైపు వెళ్లిపోయే అవకాశం ఉంటుందని, ఫలితంగా డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యే ఛాన్స్ ఉంటుందని నిఫుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. టాటా హారియర్‌ను క్రాస్ టెస్ట్‌లకు పంపకపోవడానికి ఇది కూడా కారణం కావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హారియర్ మరియు సఫారీ రెండు కూడా 2.0 లీటర్ డీజిన్ ఇంజిన్‌ను కలిగి ఉన్నాయి.
అయినా టాటా హారియర్ కార్లు చాలా చోట్లు ప్రమాదాలకు గురైనా.. అధిక శాతం ప్రయాణికులు క్షేమంగానే బయటపడినట్లు సమాచారం. అయితే భవిష్యత్‌లో ప్రభుత్వాలు కార్లుకు క్రాస్ సేఫ్టీ టెస్టులు కచ్చితంగా చేయాలనే నిబంధనలు విధిస్తే, కార్ల తయారీదారులు ఆ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








