సీట్ బెల్ట్ ధరించకపోవడం వల్లనే సైరస్ మిస్త్రీ చనిపోయారా? ముందు సీట్లోని ఇద్దరూ బ్రతికారు, కానీ మిస్త్రీ మాత్రం

టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ (Cyrus Mistry) ఆదివారం జరిగిన కారు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసినదే. వెనుక సీటులో కూర్చున్న సైరస్ మిస్త్రీ సీటు బెల్ట్ ధరించలేదని కారణంగానే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసు వర్గాల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

సీట్ బెల్ట్ ధరించకపోవడం వల్లనే సైరస్ మిస్త్రీ చనిపోయారా? ముందు సీట్లోని ఇద్దరూ బ్రతికారు, కానీ మిస్త్రీ మాత్రం..

ప్రమాద సమయంలో సైరస్ మిస్త్రీతో పాటుగా మరో ముగ్గురు ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ ఎస్‌యూవీలో ప్రయాణిస్తున్నారు. అతివేగంగా ప్రయాణిస్తున్న కారుపై డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడం వల్లనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదంలో వెనుక సీటులో కూర్చున్న సైరస్ మిస్త్రీ మరియు జహంగీర్ పండోల్ మరణించారు. వీరిద్దరూ కూడా వెనుక సీటులో సీటు బెల్టును ధరించలేదని అధికారులు ధృవీకరించారు.

సీట్ బెల్ట్ ధరించకపోవడం వల్లనే సైరస్ మిస్త్రీ చనిపోయారా? ముందు సీట్లోని ఇద్దరూ బ్రతికారు, కానీ మిస్త్రీ మాత్రం..

సైరస్ మిస్త్రీ గుజరాత్‌లోని ఉద్వాడ నుంచి ముంబైకి బయలుదేరారు. కారులో ఆయనతో పాటుగా జహంగీర్ పండోల్ (వెనుక సీటులో ప్రయాణీకుడు), అనహిత పండోల్ (డ్రైవింగ్ సీటులో ఉన్నవారు), డారియస్ పండోల్‌ (ఫ్రంట్ ప్యాసింజర్ సీటులో ఉన్నవారు)తో కలిసి ప్రయాణిస్తుండగా ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వెనుక సీటులో కూర్చున్న సైరస్ మిస్త్రీ మరియు జహంగీర్ పండోల్ ఇద్దరూ మరణించగా, అనాహిత పండోల్ మరియు ఆమె భర్త డారియస్ పండోల్ తీవ్రంగా గాయపడ్డారు.

సీట్ బెల్ట్ ధరించకపోవడం వల్లనే సైరస్ మిస్త్రీ చనిపోయారా? ముందు సీట్లోని ఇద్దరూ బ్రతికారు, కానీ మిస్త్రీ మాత్రం..

వెనుక సీట్లలో కూర్చున్న సైరస్ మిస్త్రీ, జహంగీర్ పండోలే ఇద్దరూ సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోలేదని అధికారులు తెలిపారు. ఘటనాస్థలికి సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన ఫుటేజీలను అధికారులు పరిశీలిస్తున్నారు. కారులో ఏదైనా మెకానికల్ లోపం వల్ల ప్రమాదం జరిగి ఉంటుందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. బెంజ్ కారులో అసెంబుల్ చేసిన చిప్ నుండి డేటాను పొందేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. ఇది విమానాల్లో బ్లాక్ బాక్స్ మాదిరిగా ఉంటుంది. ఫోరెన్సిక్ బృందం కూడా ప్రమాద స్థలం నుంచి నమూనాలను సేకరించింది.

సీట్ బెల్ట్ ధరించకపోవడం వల్లనే సైరస్ మిస్త్రీ చనిపోయారా? ముందు సీట్లోని ఇద్దరూ బ్రతికారు, కానీ మిస్త్రీ మాత్రం..

రతన్ టాటా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత డిసెంబర్ 2012లో సైరస్ మిస్త్రీ కొత్త చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. అయితే, కొన్ని కారణాల వలన టాటా సన్స్‌కు ఆరవ చైర్మన్‌గా ఎన్నికైన సైరస్ మిస్త్రీని అక్టోబర్ 2016లో పదవి నుంచి తొలగించారు. ఆయనను పదవి నుండి తొలిగించడాన్ని టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీలలో మాజీ స్వతంత్ర డైరెక్టర్ అయిన డారియస్ పండోల్ తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఆయన కూడా సైరస్ మిస్త్రీతో పాటు టాటా గ్రూప్‌ను కూడా విడిచిపెట్టాడు. ప్రమాదంలో మరణించిన జహంగీర్ పండోల్ డారియస్ పండోల్ కు స్వంత సోదరుడు. సైరస్ మిస్త్రీకి భార్య రోహికా, ఇద్దరు కుమారులు ఉన్నారు.

సీట్ బెల్ట్ ధరించకపోవడం వల్లనే సైరస్ మిస్త్రీ చనిపోయారా? ముందు సీట్లోని ఇద్దరూ బ్రతికారు, కానీ మిస్త్రీ మాత్రం..

ఏ సీటులో కూర్చున్నా సరే సీట్ బెల్టు ధరించడం తప్పనిసరి..

మనం ఎంత ఖరీదైన, సురక్షితమైన కారు నడుపుతున్నాం అనేది ముఖ్యం కాదు. కారులో పాటించాల్సిన కనీస భద్రతా నిబంధనలను పాటించకపోతే, ఇలానే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కారులో సీట్ బెల్ట్ ధరించకపోతే, అందులో వంద ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నా అవి మనల్ని రక్షించలేవు. సీట్ బెల్టుకి, ఎయిర్‌బ్యాక్‌కి చాలా దగ్గర సంబంధం ఉంది. సీట్ బెల్ట్ సెన్సార్లు ప్రమాదాన్ని గుర్తించి, ఎయిర్‌బ్యాగ్‌లను ఓపెన్ అయ్యేలా చేస్తాయి. అందుకే, కారులో ఏ సీటులో కూర్చున్నా సరే, తప్పనిసరిగా సీట్ బెల్టు ధరించాలి.

సీట్ బెల్ట్ ధరించకపోవడం వల్లనే సైరస్ మిస్త్రీ చనిపోయారా? ముందు సీట్లోని ఇద్దరూ బ్రతికారు, కానీ మిస్త్రీ మాత్రం..

ప్రభుత్వ నిబంధనల ప్రకారం, వాహన తయారీదారులు కారులోని అన్ని సీట్లకు తప్పనిసరిగా సీటు బెల్ట్‌లను అమర్చాలి. అలాగే, రోడ్డు రవాణా నిబంధనల ప్రకారం, కారులో ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా సీట్ బెల్టు ధరించాలి. అయితే, మనదేశంలో చాలా తక్కువ మంది మాత్రమే ఈ నిబంధనలను తూ.చ. తప్పకుండా పాటిస్తారు. కానీ, మెజారిటీ ప్రజలు వీటి గురించి అస్సలు పట్టించుకోరు. సేఫ్టీ విషయంలో వారికి ఉన్న నిర్లక్ష్యం కావచ్చు లేదా మాకెమవుతుందిలే అనే ధీమా కావచ్చు, ఈ నిబంధనలను గాలికి వదిలేస్తారు.

సీట్ బెల్ట్ ధరించకపోవడం వల్లనే సైరస్ మిస్త్రీ చనిపోయారా? ముందు సీట్లోని ఇద్దరూ బ్రతికారు, కానీ మిస్త్రీ మాత్రం..

చాలా మంది కార్లలో ముందు సీట్ల కన్నా వెనుక సీట్లు చాలా సురక్షితమని భ్రమ పడుతుంటారు. అందుకే, వెనుక సీట్లలో సీట్ బెల్ట్ సౌకర్యం ఉన్నా, వాటిని ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వేగంగా ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైనప్పుడు వెనుక సీటులో సీట్ బెల్ట్ ధరించకుండా కూర్చున్న వ్యక్తి కొన్నిసార్లు 40G శక్తితో (40 రెట్లు గురుత్వాకర్షణ, అంటే సుమారు 80 కేజీల బరువున్న వ్యక్తి 3200 కేజీల బరువున్న వ్యక్తిలా) విసిరివేయబడతాడు.

సీట్ బెల్ట్ ధరించకపోవడం వల్లనే సైరస్ మిస్త్రీ చనిపోయారా? ముందు సీట్లోని ఇద్దరూ బ్రతికారు, కానీ మిస్త్రీ మాత్రం..

అంటే, మీరే అర్థం చేసుకోండి, ప్రమాద తీవ్రత ఎలా ఉంటుంది. ముందు సీటులోని ప్రయాణీకుడు సీటు బెల్ట్ ధరించి మరియు వెనుక సీటులోని ప్రయాణీకుడు సీట్ బెల్ట్ ధరించకపోతే, క్రాష్ సమయంలో వెనుక సీటులో కూర్చున్న ప్రయాణీకుడు దాదాపు ఓ భారీ ఏనుగు బరువుతో ముందుకు పడిపోవడం వల్ల సదరు వెనుక ప్రయాణీకుడికే కాకుండా, ముందున్న ప్రయాణీకులు కూడా తీవ్రంగా గాయపడటం లేదా మరణించడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి కారులో ఏ సీటులో కూర్చున్న సరే తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించండి. ఇది పిలియన్ రైడర్‌ల యొక్క హెల్మెట్‌కి ఉన్న ప్రాముఖ్యత లాంటిదే అని గుర్తుంచుకోండి.

More from DriveSpark

Article Published On: Monday, September 5, 2022, 15:50 [IST]
English summary
Tata sons ex chariman cyrus mistry died in car crash due to not wearing the seat belt
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+