టాటా సన్స్ చేతికి ఎయిర్ ఇండియా పగ్గాలు.. ఎయిర్ ఇండియాకి మళ్ళీ పూర్వ వైభవం రానుందా..!!

భారతదేశంలో ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ అయిన ఎయిర్ ఇండియా (Air India) ఇప్పుడు ప్రైవేటు సంస్ధ అయిన TATA చేతుల్లోకి చేరింది. దాదాపు ఏడు దశాబ్దాల క్రితం ఇదే సంస్థ ఆధ్వర్యంలో నడిచిన ఈ సంస్థను కేంద్ర ప్రభుత్వం జాతీయీకరణ పేరుతో స్వాధీనం చేసుకుంది.

టాటా సన్స్ చేతికి ఎయిర్ ఇండియా పగ్గాలు.. ఎయిర్ ఇండియాకి మళ్ళీ పూర్వ వైభవం రానుందా..!!

ఎయిర్ ఇండియాను 68 ఏళ్ల క్రితం టాటా సన్స్ నుంచి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అదే సంస్ధకు దాన్ని విక్రయించేసింది. ఈరోజు ఎయిర్ ఇండియా బిడ్ టాటా సన్స్ గెలుచుకుంది. టాటా సన్స్ రూ. 18,000 కోట్లకు బిడ్డింగ్ ద్వారా ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో వాటాలను కొనుగోలు చేసింది.

టాటా సన్స్ చేతికి ఎయిర్ ఇండియా పగ్గాలు.. ఎయిర్ ఇండియాకి మళ్ళీ పూర్వ వైభవం రానుందా..!!

టాటా సన్స్ యూనిట్ Talace Pvt Ltd (తలాస్ ప్రైవేట్ లిమిటెడ్) శుక్రవారం ఎయిర్ ఇండియా విజేతగా నిలిచింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి డీల్ పూర్తవుతుందని భావిస్తున్నారు. టాటా గ్రూప్ మరియు స్పైస్ జెట్ యొక్క అజయ్ సింగ్ ఎయిర్ ఇండియా కోసం బిడ్ చేసారు. కానీ ఇది చివరకు టాటా సన్స్ చేతిలో పడింది.

టాటా సన్స్ చేతికి ఎయిర్ ఇండియా పగ్గాలు.. ఎయిర్ ఇండియాకి మళ్ళీ పూర్వ వైభవం రానుందా..!!

దేశ వైమానిక రంగంలో కీలకంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్ధ ఎయిర్ ఇండియా నష్టాల్లో కూరుకుపోవడంతో కేంద్ర ప్రభుత్వం దాన్ని నిర్వహించలేక చేతులెత్తేసింది. ప్రస్తుతం అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిర్ ఇండియా మరియు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లలో కేంద్ర ప్రభుత్వం తన మొత్తం వాటాను విక్రయిస్తోంది.

టాటా సన్స్ చేతికి ఎయిర్ ఇండియా పగ్గాలు.. ఎయిర్ ఇండియాకి మళ్ళీ పూర్వ వైభవం రానుందా..!!

ఎయిర్ ఇండియా ఇప్పుడు తన కొత్త యజమానికి రూ. 23,000 కోట్లతో బదిలీ చేయబడుతుంది. అంతే కాకుండా వంద శాతం పెట్టుబడుల్ని ప్రైవేటీకరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుగుణంగా జరిగిన వేలంలో టాటా సన్స్ సంస్ధ ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసింది. దీంతో టాటా సన్స్ చేతికి ఎయిర్ ఇండియా వెళ్లిపోయింది.

టాటా సన్స్ చేతికి ఎయిర్ ఇండియా పగ్గాలు.. ఎయిర్ ఇండియాకి మళ్ళీ పూర్వ వైభవం రానుందా..!!

బిడ్డింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ Ratan Tata (రతన్ టాటా) ట్విట్టర్‌లో ఒక ఫోటోను షేర్ చేసి "వెల్‌కమ్ బ్యాక్ ఎయిర్ ఇండియా" అన్నారు. JRD టాటా నాయకత్వంలో ఎయిర్ ఇండియా ప్రపంచ ప్రఖ్యాత విమానయాన సంస్థలలో ఒకటి. టాటా సన్స్ చేతుల్లోకి చేరిన ఎయిర్ ఇండియా తిరిగి తన పూర్వ వైభవం పొందుతుంది. మళ్ళీ ఎయిర్ ఇండియా అందించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు అన్నారు.

టాటా సన్స్ చేతికి ఎయిర్ ఇండియా పగ్గాలు.. ఎయిర్ ఇండియాకి మళ్ళీ పూర్వ వైభవం రానుందా..!!

1932 లో టాటా ఎయిర్‌లైన్స్‌ను 'జహంగీర్ రతంజీ దాదాభాయ్' (JRD) టాటా స్థాపించారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో భారతదేశం నుండి విమాన సేవలు నిలిపివేయబడ్డాయి. విమానయాన సంస్థలు పునరుద్ధరించబడినప్పుడు, టాటా ఎయిర్‌లైన్స్ పేరు 29 జూలై 1946 న ఎయిర్ ఇండియా లిమిటెడ్‌గా మార్చబడింది.

టాటా సన్స్ చేతికి ఎయిర్ ఇండియా పగ్గాలు.. ఎయిర్ ఇండియాకి మళ్ళీ పూర్వ వైభవం రానుందా..!!

1947 లో స్వాతంత్రం వచ్చిన తరువాత భారత ప్రభుత్వం ఎయిర్ ఇండియాలో 49 శాతం వాటా తీసుకుంది. ఆ తర్వాత 1953 లో ఇది జాతీయం చేయబడింది. ఇప్పుడు ఏకంగా 68 సంవత్సరాల తర్వాత ఎయిర్ ఇండియా స్వదేశానికి తిరిగి రాబోతోంది. ఎయిర్ ఏషియా ఇండియా ద్వారా టాటా గ్రూప్ ఎయిర్ ఇండియా కోసం బిడ్ చేసింది.

టాటా సన్స్ చేతికి ఎయిర్ ఇండియా పగ్గాలు.. ఎయిర్ ఇండియాకి మళ్ళీ పూర్వ వైభవం రానుందా..!!

కేంద్ర ప్రభుత్వం 2017 నుండి ఎయిర్ ఇండియాను విక్రయించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. టాటా సన్స్ మరియు స్పైస్ జెట్ ఆసక్తి చూపిన 15 డిసెంబర్ 2020 వరకు ప్రభుత్వం బిడ్డింగ్ కంపెనీలను స్వాగతించింది. అయితే, అన్ని నిబంధనలు మరియు షరతులను నెరవేర్చడంలో టాటా సన్స్ విజయం సాధించింది. మొత్తానికి కోల్పోయిన తమ సంస్థ మళ్ళీ తన చేతుల్లోకి వచ్చేసింది.

టాటా సన్స్ చేతికి ఎయిర్ ఇండియా పగ్గాలు.. ఎయిర్ ఇండియాకి మళ్ళీ పూర్వ వైభవం రానుందా..!!

దాదాపు 70 సంత్సరాల క్రితం టాటా గ్రూప్ ప్రారంభించిన ఎయిర్ లైన్స్ సంస్ధ కేంద్రం స్వాధీనం చేసుకోవడం దగ్గరి నుంచి తిరిగి వారికి అప్పగించడం వరకూ జరిగిన పరిణామాలు నిజంగా మొత్తం ఒక సినిమా చూస్తున్నట్లు అనిపిస్తోంది. కొన్నేళ్లుగా దాన్ని నిర్వహించలేక ఇప్పటి కేంద్ర ప్రభుత్వం పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు.

టాటా సన్స్ చేతికి ఎయిర్ ఇండియా పగ్గాలు.. ఎయిర్ ఇండియాకి మళ్ళీ పూర్వ వైభవం రానుందా..!!

టాటా సంస్థ భారతదేశంలో దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన సంస్థ. టాటా కంపెనీ ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఎన్నోన సంస్ధల్ని కొనుగోలు చేసి వాటిని లాభాల బాట పట్టించిన చరిత్ర ఉంది. కాబట్టి ఇప్పుడు టాటా కంపెనీ కొనుగోలు చేసిన ఎయిర్ లైన్స్ కి మళ్ళీ తప్పకుండా పూర్వ వైభవం రానుందని భావిస్తున్నాము.

Most Read Articles

English summary
Tata sons wins bid for air india for rs 18000 crore ratan tata tweets
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X