Tata Sumo 12 ఏళ్లుగా నిరుపయోగంగా టాటా సుమో.. విజయవంతంగా స్టార్ట్.. ఎలా అంటే!!

'టాటా సుమో' వాహన ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. 90 లలో టాటా స్థాపించిన ఈ సుమో ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌గానే కొనసాగుతోంది. గత దశాబ్దాలుగా సుమో అనేక మోడళ్లలో విడుదల చేయబడ్డాయి. అయినప్పటికీ, మొదటి తరం సుమో అత్యంత విజయవంతమైనదిగా పేరొందింది. అందుకే 12 ఏళ్లుగా మూలన పడి ఉన్నా.. కేరళకు చెందిన యువకులు ఎంతో కష్టపడి ఆ వాహనం మళ్లీ స్టార్ట్‌ అయ్యేలా చేశారు.

12 ఏళ్లుగా నిరుపయోగంగా పడి ఉన్న టాటా సుమో కారును పునరుద్ధరించేందుకు కేరళకు చెందిన కొంతమంది యువకులు ప్రయత్నించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 12 ఏళ్లుగా నిరుపయోగంలో అంటే ఆ కారు కండిషన్‌ ఎలా ఉందో ఊహించుకోవచ్చు.. అలాంటి కండిషన్‌ నుంచి ఆ కారును విజయవంతంగా స్టార్ట్‌ చేయడం చూస్తే ఆశ్చర్యపోవడం మీ వంతు. ఆ కారును పునరుద్ధరించడంలో వాళ్లు చేసిన ప్రయత్నాలను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు.

Tata Sumo

డ్యామేజ్‌ స్థితిలో ఉన్న కారును తిరిగి స్టార్ట్‌ చేసేందుకు వారు చాలా ప్రయత్నాలు చేశారు. కొన్నేళ్లుగా నిరుపయోగంగా ఉన్న ఏ వాహనంలోనైనా చాలా భాగాలు పనికి రాకుండా పోయి ఉంటాయి. కానీ ఈ టాటా సుమోను వారు పెద్దగా మార్చలేదు. కేవలం బ్యాడ్‌ కండిషన్‌లో ఉన్న బ్యాటరీ మాత్రమే మార్చడంతో టాటా సుమో స్టార్ట్‌ అయింది.

కానీ ఈ సమస్య కేవలం బ్యాటరీ మార్చడంతోనే తీరలేదు. సుమో అయితే స్టార్ట్‌ అయింది కానీ.. ఆ తర్వాత మళ్లీ కొన్ని చిక్కులు ఎదురయ్యాయి. ఆ కారులో రేడియేటర్ నీటితో ఫుల్‌గా నిండిపోయి ఉంది.. అందులోని ఇంజన్ ఆయిల్‌ను కూడా పరిశీలించారు. దీంతో వారు సుమోలోని పాత డీజిల్‌ను బయటకు తీసి కొత్తగా కొనుగోలు చేసిన డీజిల్‌తో నింపారు.

Tata Sumo

ఇలా ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత సుమోను స్టార్ట్‌ చేయడానికి యువకులు ప్రయత్నించారు. కానీ అది స్టార్ట్‌ కాలేదు. ఇంధన పైపుల నుండి అన్ని అడ్డంకులను తొలగించిన తర్వాత.. కారు కండిషన్‌ సెట్‌ అయినట్లు నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత సుమో స్టార్ట్‌ అయింది. ఇన్నేళ్ల తర్వాత కూడా ఈ కారు విజయవంతంగా నడుస్తుండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

భారతీయుల ఫేవరెట్‌ సుమో : ఇండియాలో టాటా సుమో 90లలో టాటా మోటార్స్ అందించిన అత్యుత్తమ కార్ మోడళ్లలో ఒకటి. ఈ కారును టాటా మోటార్స్ 1994లో తొలిసారిగా భారత మార్కెట్లోకి విడుదల చేసింది. అమ్మకానికి వెళ్లిన కొద్ది రోజుల్లోనే భారతీయుల ఫేవరెట్‌ వాహనంగా మారింది. సాధారణ ప్రజల నుంచి రాజకీయ నాయకులు, ప్రభుత్వ శాఖల వినియోగానికి ఎంతో దోహదపడింది.

Tata Sumo

కొత్త మోడళ్ల నుంచి పోటీ ఎక్కువ కావడంతో కొన్ని సంవత్సరాల క్రితం సుమోను టాటా నిలిపివేసింది. ఇప్పటికీ ఈ టాటా సుమోలు రోడ్లపై కనిపిస్తూనే ఉన్నాయి. ఆ వాహనానికి అంత క్రేజ్‌ ఉంది కాబట్టే.. కేరళకు చెందిన యువకులు 12 ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్న సుమోను ఎంతో కష్టపడి బ్యాడ్‌ కండిషన్‌ నుంచి గుడ్‌ కండిషన్‌కు తీసుకువచ్చి సుమోను విజయవంతంగా స్టార్ట్‌ చేశారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, May 16, 2023, 8:40 [IST]
English summary
Tata sumo restarts by kerala youth after unused for 12 years video viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+