పల్టీలు కొట్టి బోల్తా పడినా చిన్న గాయం కాకుండా బయటపడ్డ ప్రయాణికులు.. టాటా సేఫ్టీ ఫీచర్లకు సలాం కొట్టాల్సిందే.!
దేశంలో రోడ్డు ప్రమాదాలు జరగడం సర్వ సాధారణం. నిత్యం వందల సంఖ్యలో ప్రమాదాల బారిన పడటం, మృత్యవాత పడటం చూస్తుంటాం. కానీ యాక్సిడెంట్ సమయంలో కారు నుజ్జునుజ్జయినా ప్రయాణికులకు ఒక్క గాయం కూడా కాకుండా ఉండటం చూశారా.. టాటా టియాగో ప్రమాద ఘటనలో అదే జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
దేశీయ బ్రాండ్ టాటా కార్లు నాణ్యతకు ప్రసిద్ధి చెందాయి. ఘోర ప్రమాదాలకు గురైనా ప్రయాణికులను సురక్షితంగా ఉంచిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ క్రమంలో ఒక్క స్క్రాచ్ కూడా లేకుండా రోడ్డు ప్రమాదాలు జరిగిన ఘటనలు మీరు ఎక్కడా చూసి ఉండరు. కానీ ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ యాక్సిడెంట్‌లో టాటాకు చెందిన కారు తన బ్రాండ్‌ను మరోసారి సుస్థిరం చేసుకుంది.

యూపీలోని నోయిడాలో జరిగిన ఓ ప్రమాదంలో వృద్ధ దంపతులు తమ టాటా టియాగో కారులో ప్రయాణిస్తున్నారు. ప్రమాదవశాత్తు కారు బోల్తా కొట్టినా ఇద్దరూ ఎటువంటి గాయాలు కాకుండా బయటపడ్డారు. కాగా ఈ సంఘటన పగటిపూట జరిగినట్లుగా సమాచారం. అయితే ఈ కారు ఎలా పల్టీలు కొట్టింది.. ఎలా బోల్తా పడింది అనే సమాచారం స్పష్టంగా తెలియదు. కానీ వృద్ధ దంపతులకు మాత్రం ఎలాంటి గాయాలు కాలేదు.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం వీడియోను పరిశీలించినట్లయితే కారు బోల్తా(Car Accident) పడినట్లుగా కనిపిస్తోంది. కారులోని దంపతులిద్దరూ కారు బయట కూర్చున్నారు. కారు బోల్తా పడినా.. పిల్లర్లు స్థిరంగా ఉన్నాయి. కూలిపోయినట్లుగా కనిపించడం లేదు. హ్యాచ్‌బ్యాక్‌లు దాని రూఫ్‌పై స్థిరంగా ఉండటం అంటే సాధారణ విషయం కాదు.

అయితే జరిగిన ప్రమాదాన్ని పరిశీలిస్తే.. టాటా టియాగో(Tata Tiago) కారు అదుపు తప్పి బోల్తా పడింది అంటే.. దాన్ని అధిక వేగంతో ఇతర వాహనం ఏదైనా ఢీకొట్టే అవకాశం ఉండొచ్చు. ఈ సమయంలో ప్రయాణీకులను కాపడటానికి వెంటనే ఎయిర్ బ్యాగులు తెరుచుకున్నట్లుగా వీడియో ద్వారా తెలుస్తోంది.
కాగా గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్‌లో టాటా టియాగో కారు ఫోర్-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించింది. దాని విభాగంలో అది సురక్షితమైన కారుగా ప్రజాదరణ పొందింది. కానీ ఫుట్‌వెల్, వాహనం యొక్క నిర్మాణం అంతగా సంతృప్తి స్థాయిలో లేదని తేలింది. కాగా టాటా మోటార్స్.. ప్రయాణికులకు సేఫ్టీ పరంగా ప్రతిసారీ నెం.1 గా నిరూపించుకుంది.

టాటా టియాగో, టిగోర్‌లు గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్‌లో రెండూ 4-స్టార్ రేటింగ్‌లను సాధించాయి. టాటా ఆల్ట్రోజ్ మరియు టాటా నెక్సాన్ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌లను సాధించాయి. కాగా ఇటీవల, టాటా మోటార్స్ కొత్త సఫారీ, హారియర్‌లను కూడా ఆవిష్కరించింది. ఈ రెండు కార్లూ గ్లోబల్ NCAP నుంచి టాప్ 5 స్టార్ రేటింగ్‌తో అత్యంత సేఫ్టీ వెహికల్స్‌గా నిలిచాయి.
ఏదేమైన ఈ ప్రమాద సంఘటనను పరిశీలిస్తే.. భారతీయ రహదారులపై భద్రతను నిర్ధారించడానికి, ఎల్లప్పుడూ స్పీడ్ లిమిట్‌కు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. రోడ్లు ఖాళీగా ఉన్నప్పుడు జంతువులు లేదా పశువులు సంచరించే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో వాహనదారులు అప్రమత్తంగా డ్రైవ్ చేయాల్సి ఉంటుంది.
అంతేకాకుండా హైవేల పక్కగా ఎక్కువగా ఊర్లు కూడా ఉంటాయి. ఈ క్రమంలో జనావాసాలు ఉన్న రోడ్లపై వెళ్తున్నప్పుడు వేగాన్ని తగ్గించి నడపాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ. స్పీడ్ లిమిట్‌ను మెయింటెయిన్ చేస్తూ.. ట్రాఫిక్ రూల్స్‌ను పాటించడం ద్వారా చాలా వరకు రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చు.


Click it and Unblock the Notifications








