110 కి.మీ వేగంతో డివైడర్‌ను ఢీకొట్టిన టాటా టియాగో కారు.. ఏ ఫీచర్‌ కాపాడిందో తెలుసా?

కారు కొనుగోలు చేసే సమయంలో ఇతర భద్రతా ఫీచర్లు సహా బిల్డ్‌ క్వాలిటీ ఎంత ముఖ్యమో ఇప్పుడిప్పుడే వినియోగదారులు గుర్తిస్తున్నారు. టాటా మరియు మహీంద్రా సంస్థలు నాణ్యమైన బిల్డ్‌ క్వాలిటీ కలిగిన వాహనాలను అందిస్తున్నారు. ఇటీవల జరుగుతున్న కొన్ని ప్రమాదాల నుంచి క్షేమంగా బయటపడిన వారు కార్ల బిల్డ్‌ క్వాలిటీని మెచ్చుకుంటున్నారు.

తాజాగా ఎక్స్‌ప్రెస్‌ హైవేపై జరిగిన ప్రమాదంలో ఓ టాటా టియాగో కారు డ్రైవర్‌ వైపు భారీగా దెబ్బతింది. అయితే కారులోని ప్రయాణికులు చిన్న చిన్న గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఈ వీడియోను ప్రతీక్‌సింగ్‌ తన యూట్యూబ్‌ ఛానల్‌లో షేర్‌ చేశారు. పూర్తి వివరాలు మీ కోసం.

Tata Tiago car crashes road divider

ఈ రోడ్డు ప్రమాదం హర్యానాలోని KMP ఎక్స్‌ప్రెస్‌వే పైన జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన టాటా టియాగో కారు వెనుక ఉన్న వాహనంలోని ప్రయాణికులు ఈ వీడియోను రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ఆ ప్రయాణికులు ఈ ప్రమాదంలో ఎలా జరిగిందో, కారణమేంటో తెలిపారు.

కేఎంపీ ఎక్స్‌ప్రెస్‌వే పైన టాటా టియాగో వాహనం సుమారు 100-110 కి.మీ వేగంలో ప్రయాణిస్తోంది. హిల్ స్టేషన్‌ అయిన రిషికేష్‌ నుంచి ఓ జంట ఆ కారులో ప్రయాణం చేస్తున్నారు. అకస్మాత్తుగా టాటా టియాగో కారు కుడివైపున ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో వెంటనే కారు ఫ్రంట్‌ యాక్సిల్‌ విరిగిపోయింది. డ్రైవర్‌కు కారును నియంత్రించే సమయం లేకుండా పోయింది. ఢీకొట్టిన వెంటనే కారు సుమారు 8 సార్లు బోల్తా పడింది.

డ్రైవర్‌ కూర్చున్న వైపు కారుకు భారీగా ప్రమాదం జరిగింది. డ్రైవర్‌ వైపు రూఫ్‌, పిల్లర్‌, డోర్‌ మరియు ఇతర ప్యానళ్లు దెబ్బతిన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు.. కారులో ఉన్నవారిని రక్షించేందుకు పరిగెత్తడం మనం గమనించవచ్చు. అయితే ప్రమాదానికి గల స్పష్టమైన కారణం తెలియలేదు. కారులోపలి భాగం, ఏసీ వెంట్‌, విండ్‌ షీల్డ్‌ కూడా దెబ్బతిన్నాయి.

అయితే ప్రమాదం జరిగిన సమయంలో కారులోని ప్రయాణికులు సీట్‌ బెల్డ్‌లు ధరించారు. డ్రైవర్‌ నిద్రమత్తులో ఉన్నాడా లేదా దేనినైనా తప్పించే క్రమంలో కారు ప్రమాదానికి గురైందా అనేది తెలియలేదు. ప్రమాదం జరిగిన అనంతరం లోపల ఉన్నవారు వెంటనే బయటకు వచ్చేసినట్లు తెలుస్తోంది.

కారులో ఉన్న వారు చిన్న చిన్న గాయాలతో బయటపడినట్లు స్థానికులు చెప్పారు. ఈ ఘటనతో కారు బిల్డ్‌ క్వాలిటీ ఎంత ముఖ్యమో తెలుసుకోవచ్చు. ప్రమాద తీవ్రతను కారు తట్టుకోలేకుంటే.. లోపలున్న ప్రయాణికులు తీవ్రంగా గాయపడే అవకాశం ఉండేది. దాంతో పాటు ప్రమాదం జరిగిన సమయంలో కారు వెనుక లేదా ముందు వైపు ఎటువంటి వాహనాలు లేవు. ఆ సమయంలో ఎటువంటి వాహనాలు ఉన్నా.. ప్రమాదంలో ఎక్కువ మంది గాయపడే అవకాశం ఉండేది.

దూర ప్రయాణాలు చేస్తున్న సమయంలో దారి మధ్యలో కొంత విరామం తీసుకోవడం ఉత్తమం. ఎక్కువగా అలిసిపోకుండా లేదా నిద్రపోకుండా ఉండేందుకు విరామం అవసరం. మరియు అ‌న్ని సీట్లలో కూర్చున్న వారు కూడా సీట్‌ బెల్ట్‌లు ధరించాలి. ఫలితంగా ఎంత ప్రమాదం అయినా క్షేమంగా బయటపడే అవకాశం ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, June 14, 2023, 13:13 [IST]
English summary
Tata tiago car crashes road divider with 110 kmph speed in kmp expressway
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+