రెండు ట్రక్కుల మధ్య ఇరుక్కొని నుజ్జునుజ్జయిన కారు.. ప్రయాణికులు ప్రాణాలను కాపాడిన ఫీచర్ ఇదే!
ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశాల్లో భారత్ కూడా ఉండడం ఆందోళనకు గురిచేస్తుంది. భారత్‌లో రోడ్డు ప్రమాదాలకు అనేక కారణాలు ఉంటున్నాయి. అధిక వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ సహా అనేక కారణాలు ఉన్నాయి. అయితే చాలా ప్రమాదాల్లో కార్ల బిల్డ్ క్వాలిటీ ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన ఘటనలు అనేక ఉన్నాయి.
తాజాగా అటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. రెండు ట్రక్కుల మధ్య ఓ కారు ఇరుక్కుపోయింది. కారు నుజ్జునుజ్జయింది. ఇంత ఘోర ప్రమాదంలోనూ ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోను నిఖిల్ రానా తన యూట్యూబ్ ఛానల్‌లో షేర్ చేశారు.

కారు బిల్డ్ క్వాలిటీ సహా: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీంతోపాటు కారు బిల్డ్ క్వాలిటీ సహా భద్రతా ఫీచర్లు గురించి చర్చ జరుగుతోంది. అయితే ఈ ప్రమాదం ఎక్కడ, ఎప్పుడు జరిగిందనే సమాచారం తెలియలేదు.
ఓ రోడ్డుపై టాటా టియాగో (Tata Tiago car) అత్యంత వేగంతో ప్రయాణం చేస్తోంది. అతివేగం కారణంగా కారు నియంత్రణ కోల్పోయింది. అనంతరం అదుపుతప్పి బోల్తా పడింది. ఆ తర్వాత ఎదురుగా వస్తున్న రెండు ట్రక్కుల మధ్య ఇరుక్కుపోయింది. దీంతో కారు నుజ్జునుజ్జయింది. గుర్తుపట్టలేనంతగా తయారైంది. ప్రమాద సమయంలో కారులో ఇద్దరు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాద తీవ్రత చూసిన ఎవరైన ప్రయాణికులు ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని నిర్ధారణకు వచ్చేస్తారు. అయితే టాటా టియాగో కారు బిల్డ్ క్వాలిటీ కారణంగా ప్రయాణికులు ఇద్దరు గాయాలతో సజీవంగా బయటపడ్డారు. ప్రయాణికులు ఇద్దరు సీట్‌బెల్ట్‌లు పెట్టుకోవడం కారణంగా సరైన సమయానికి ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకున్నాయి.
ప్రారంభ ధర రూ.5.60 లక్షలు: టాటా మోటార్స్‌కు చెందిన అత్యంత సరసమైన మోడల్‌లలో టియాగో కారు ఒకటి. ఈ కారు ప్రారంభ ధర రూ.5.60 లక్షలుగా (ఎక్స్‌షోరూం) ఉంది. ఈ కారు 4 స్టార్ సేఫ్టే రేటింగ్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ కారు చిన్న హ్యాచ్‌బ్యాక్ అయినా.. మెరుగైన భద్రతా ఫీచర్లను కలిగి ఉంటుంది. మరియు పెట్రోల్, CNG అనే రెండు ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

టాటా కార్ల బిల్డ్ క్వాలిటీ మాత్రమే.. : ఈ రోడ్డు ప్రమాద వీడియో ఆధారంగా కారు అత్యంత వేగంగా ప్రయాణించినట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదంలో కారు గుర్తుపట్టలేనంతగా తయారైంది. కనీసం మరమ్మతు చేసేందుకు వీలు లేకుండా తయారైంది. ప్రమాద సమయానికి ఎయిర్‌బ్యాగ్‌లు ఓపెన్ కావడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో టాటా కార్ల బిల్డ్ క్వాలిటీ మాత్రమే ప్రయాణికుల ప్రాణాలను కాపాడింది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








