టాటా టియాగోను ఢీకొట్టిన ట్రక్కు.. నుజ్జునుజ్జయిన కారు.. ఈ ఫీచర్ లేకుంటే ఏమయ్యేదో?
భారత్ దేశంలో జాతీయ రహదారుల్లో ప్రమాదాల సంఖ్య గతం కంటే పెరిగాయి. ఈ ప్రమాదాలకు చాలా కారణాలు ఉంటున్నాయి. వాహన డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా జరిగిన ఓ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఈ తాజా ఘటనలో రెండు ట్రక్కుల కారణంగా టాటా టియాగో కారు భారీగా దెబ్బతింది. గుర్తుపట్టలేని విధంగా తయారైంది. ముందు, వెనుక భాగం నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు, వీడియో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్ జాతీయ రహదారిపై జరిగినట్లు తెలుస్తోంది.

జాతీయ రహదారిపై టాటా టియాగో కారు ఓ ట్రక్కు వెనుక నిలిచింది. అదే సమయంలో వెనుక నుంచి మరో ట్రక్కు టాటా కారును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు భారీగా దెబ్బతింది. ప్రమాద ధాటికి కారు రూఫ్ పైకి లేచింది. అయితే కారు డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
టాటా టియాగో కారు ముందు భాగం ట్రక్కులో ఇరుక్కుపోయింది. ట్రక్కు వెనుక భాగంలో అండర్‌రైడ్ గార్డ్ ఏర్పాటుచేయడం వల్ల కారు పూర్తిగా ట్రక్కు కిందకు వెళ్లిపోకుండా నిలిచిపోయింది. గతంలో ఇటువంటి ప్రమాదాల్లో అటువంటి గార్డ్ లేకపోవడం వల్ల కార్లు పూర్తిగా ట్రక్కు కిందకు వెళ్లిపోయిన ఘటనలు ఉన్నాయి. అటువంటి సమయాల్లో కారు డ్రైవర్ మరణించిన ఘటనలు ఉన్నాయి.

టాటా టియాగో కారు రూఫ్ భారీగా డ్యామేజ్ అయింది. ఏకంగా పైకి వంపులు తిరిగింది. కారు వెనుక సీట్లలో ఎవరూ లేని కారణంగా క్షతగాత్రుల సంఖ్య తగ్గింది. లేకుంటే వెనుక సీట్లులో కూర్చున్న వారు తీవ్రగాయాల పాలయ్యే అవకాశం ఉండేది. కారు డ్రైవర్ మాత్రమే గాయపడ్డారు.
అయితే ఇంత భారీ ప్రమాదంలోనూ కారు డ్రైవర్ చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారంటే.. కారు బిల్డ్ క్వాలిటీనే కారణం. గ్లోబల్ NCAP రేటింగ్‌లో టాటా టియాగో కారు 4 స్టార్ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఈ సెగ్మెంట్‌లో భద్రత కలిగిన కారుగా గుర్తింపు పొందింది.

భారత మార్కెట్‌లో అత్యంత సురక్షితమైన కార్లను విక్రయిస్తున్న సంస్థల్లో టాటా మోటార్స్ ఒకటి. గ్లోబల్ NCAP క్రాష్ టెస్టులో ఈ సంస్థ కార్లు 5 స్టార్, 4 స్టార్ రేటింగ్‌లను సొంతం చేస్తున్నాయి. టాటా నెక్సాన్, టాటా ఆల్ట్రోజ్ మరియు పంచ్ కార్లు 5 స్టార్ రేటింగ్‌ను పొందాయి. టాటా టియాగో మరియు టాటా టిగోర్ కార్లు 4 స్టార్ రేటింగ్‌ను కలిగి ఉన్నాయి.
సాధారణ రోడ్ల కంటే జాతీయ రహదారులపైన డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. అప్పుడే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాయి. పట్టణాలు, నగర రోడ్లు కంటే హైవేలపైన ప్రయాణం కాస్త భిన్నంగా ఉంటుందని గుర్తుపెట్టుకొని డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాల బారినపడకుండా ఉంటాం.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








