షోరూమ్ మొదటి అంతస్థు నుంచి కిందపడిన టాటా టియాగో, ఇద్దరికి గాయాలు

భారతదేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొంత తగ్గు ముఖం పట్టిన తరువాత కార్ల అమ్మకాలు వేగంగా పెరిగాయి. ఎందుకంటే కరోనా మహమ్మారి కారణంగా చాలామంది వాహనదారులు సొంత వాహనాలు కలిగి ఉండాలని భావిస్తున్న కారణంగా వాహన అమ్మకాలు బాగా సాగుతున్నాయి.

మొదటి అంతస్థు నుంచి కిందపడిన టాటా టియాగో, ఇద్దరికి గాయాలు.. ఎక్కడంటే?

ఇటీవల హైదరాబాద్ నగరంలోని ఒక టాటా షోరూమ్ లో కార్ డెలివరీ చేసే సమయంలో ఒక ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడగా, రెండు కార్లు మరియు ఒక బైక్ బాగా దెబ్బతిన్నాయి. ఇంతకీ అక్కడ ఈ ప్రమాదం జరగటానికి గల కారణం ఏంటి అనేదాని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.

మొదటి అంతస్థు నుంచి కిందపడిన టాటా టియాగో, ఇద్దరికి గాయాలు.. ఎక్కడంటే?

హైదరాబాద్ లోని టాటా మోటార్స్ అధీనంలో ఉన్న సెలెక్ట్ కార్స్ షోరూమ్ లో ఈ సంఘటన జరిగింది. ఈ షోరూమ్ హైదరాబాద్ లోని నాగోల్ కాలనీలోని అల్కాపురిలో ఉంది. నివేదికల ప్రకారం ఈ షోరూమ్ లో టాటా టియాగో కారు కొనుగోలు చేసిన మేడిపల్లికి చెందిన పెద్దపల్లి భగవంత్ తన కుటుంబంతో సహా కారుని డెలివరీ చేసుకోవడానికి డీలర్ షిప్ కి వెళ్ళాడు.

మొదటి అంతస్థు నుంచి కిందపడిన టాటా టియాగో, ఇద్దరికి గాయాలు.. ఎక్కడంటే?

సెలెక్ట్ కార్స్ షోరూమ్ భారీగా ఉండటం వల్ల కార్లను గ్రౌండ్ ఫ్లోర్‌లో, అలాగే మొదటి అంతస్తులో కూడా ఉంచారు. ఇక్కడ మొదట అంతస్థులో టాటా టియాగో డెలివరీకి సిద్ధమవుతోంది. కారుని గ్రౌండ్ ఫ్లోర్ కి తీసుకెళ్లడానికి ఒక హైడ్రాలిక్ ర్యాంప్ కూడా సిద్ధంగా ఉంది.

మొదటి అంతస్థు నుంచి కిందపడిన టాటా టియాగో, ఇద్దరికి గాయాలు.. ఎక్కడంటే?

అయితే ఈ కారు కొనుగోలు చేసిన వ్యక్తి కారుని అక్కడ డ్రైవ్ చేయాలనుకుని కార్ స్టార్ట్ చేసాడు. ఆ సమయంలో కారు హఠాత్తుగా ముందుకు వెళ్ళిపోయి మొదటి అంతస్తునుంచి కింద అక్కడే పార్క్ చేసి ఉన్న కారుపై పడింది. ఈ ప్రమాదంలో కిందపడిన కారు భారీగా దెబ్బతినింది. అక్కడ ఉన్న ఒక బైక్ కూడా తీవ్రమైన ప్రమాదానికి గురైనట్లు ఇక్కడ మీరు గమనించవచ్చు.

మొదటి అంతస్థు నుంచి కిందపడిన టాటా టియాగో, ఇద్దరికి గాయాలు.. ఎక్కడంటే?

ఈ ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తికీ మరియు కింద నిలబడి ఉన్న వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఆ ఇద్దరిని హాస్పిటల్ కి తరలించారు. అయితే ఎటువంటి ప్రాణహాని జరగలేదని కొన్ని వర్గాల ద్వారా తెలుస్తుంది.

మొదటి అంతస్థు నుంచి కిందపడిన టాటా టియాగో, ఇద్దరికి గాయాలు.. ఎక్కడంటే?

దేశీయ మార్కెట్లో టాటా మోటార్స్ కంపెనీ నుంచి ఎక్కువగా అమ్ముడవుతున్న బ్రాండ్లలో ఒకటి టాటా టియాగో. టాటా టియాగో బేస్ ఎక్స్‌ఇ వేరియంట్‌లో బాడీ కలర్ బంపర్స్, డ్యూయల్ టోన్ ఇంటీరియర్‌లను కలిగి ఉండి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. టాటా టియాగోలో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, మాన్యువల్ హెచ్‌విఎసి, ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ మరియు టిల్ట్ అడ్జస్టబుల్ ఫ్రంట్ హెడ్ రెస్ట్‌లు ఉన్నాయి.

మొదటి అంతస్థు నుంచి కిందపడిన టాటా టియాగో, ఇద్దరికి గాయాలు.. ఎక్కడంటే?

టాటా టియాగో మంచి సేఫ్టీ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఇందులో అడ్జస్టబుల్ ORVM లు, ఫ్రంట్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, డ్యూయల్ పార్కింగ్ సెన్సార్లు, ఓవర్ స్పీడింగ్ అలర్ట్ మరియు ఏబీఎస్ విత్ ఈబిడి వాటి ఫీచర్స్ ఉన్నాయి.

ఇక టాటా టియాగో యొక్క XT వేరియంట్లో పవర్ విండోస్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ORVM లు, 4 స్పీకర్లు మరియు బ్లూటూత్ కనెక్టివిటీతో హర్మాన్ నుండి ‘కనెక్ట్ నెక్స్ట్' ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ లభిస్తుంది. ఇది రివర్స్ కెమెరా మరియు రిమోట్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్‌ వంటి వాటిని కూడా కలిగి ఉంటుంది.

మొదటి అంతస్థు నుంచి కిందపడిన టాటా టియాగో, ఇద్దరికి గాయాలు.. ఎక్కడంటే?

టాప్ ఎండ్ మోడల్స్ అయినా XZ మరియు XZA వేరియంట్లు ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు మరియు పవర్ విండోస్‌తో 7 "టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంటాయి. టాటా టియాగో యొక్క అన్ని వేరియాయంట్లు అద్భుతంగా ఉంటాయి, కావున మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు వెళ్తుంటాయి.

Most Read Articles

English summary
New Tata Tiago Falls From 1st Floor Of Dealer Showroom. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X